కోట్లాస్తి ఉన్నా ధనదాహం తీరడం లేదు : అమెజాన్ బాస్
కోట్ల రూపాయల సంపాదనతో ప్రపంచాన్ని శాసిస్తున్న అమెజాన్ అధినేతకు ఇంకా ధన దాహం తీరలేదు. ఇంకా ఇంకా సంపాదించాలని తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించాలని అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడనని చెబుతున్నారు. నూతన సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన పేరును లిఖించాలని అన్ని రంగాల్లో అమెజాన్ దే పై చేయిగా ఉండాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నాని చెప్పాడు.
Read more : డిలీట్ చేసిన ట్వీట్లు మళ్లీ చూడొచ్చు

అతిపెద్ద ఇంటర్నెట్ రిటేలర్‌గా వ్యాపార సామ్రాజ్యాన్ని
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ రిటేలర్‌గా వ్యాపార సామ్రాజ్యాన్ని అనతికాలంలోనే విస్తరించుకున్న ‘అమెజాన్' బాస్ జెఫ్ బిజోస్‌కు ఇంకా సంపాదన దాహం తీరలేదట.

వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకొని
వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకొని కోటాను కోట్ల రూపాయలను సంపాదించుకోవడమే నూతన సంవత్సరంలో తన లక్ష్యమని ఆయన ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.

నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యక్తిగత సంపాదనతో
నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యక్తిగత సంపాదనతో ప్రపంచంలోనే నాలుగవ ధనిక వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ తన లక్ష్యం ఇంకా మిగిలే ఉందని చెప్పారు.

అమెజాన్‌లో కేవలం 18 శాతం వాటా కలిగిన జెఫ్
అమెజాన్‌లో కేవలం 18 శాతం వాటా కలిగిన జెఫ్ ఇప్పటికీ వ్యక్తిగత సంపాదనలో ప్రపంచ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్ వ్యవస్థాపకులను అధిగమించారు.

ఆయన వ్యక్తిగత సంపాదన గత ఏడాదిలోనే
ఆయన వ్యక్తిగత సంపాదన గత ఏడాదిలోనే రెండింతలైంది. పుస్తకాల అమ్మకాలతో 1994లోనే అమెజాన్ వ్యాపారాన్ని మొదలుపెట్టి వివిధ రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించిన జెఫ్ ఇటీవలనే హాలీవుడ్ సినిమా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నానని ప్రకటించిన విషయం తెల్సిందే.

ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీయడం
ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీయడం, ఒక్కటైనా ఆస్కార్ అవార్డును సాధించడం తన లక్ష్యమని ప్రకటించిన విషయం తెల్సిందే.

ఫ్రెష్ ఫుడ్ ఉత్పత్తులను గత నవంబర్‌లోనే
ఫ్రెష్ ఫుడ్ ఉత్పత్తులను గత నవంబర్‌లోనే ప్రారంభించి న్యూయార్క్, లాస్ ఏంజెలిస్ నగరాల్లో సరఫరా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదిలో ఫ్రెష్ ఫుడ్ ఉత్పత్తులను ప్రపంచంలోని నగరాలన్నింటికీ విస్తరిస్తానని చెప్పారు.

ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ
ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ ఛారిటీ సంస్థలకు విరాళాలు ఇవ్వాలంటే మనస్కరించని వ్యక్తి. ఈ విషయంలో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఇటీవల వెయ్యి నుంచి పది వేల డాలర్ల వరకు విరాళాలు ఇస్తున్నారు.

అయినప్పటికీ విమర్శలు తగ్గుముఖం పట్టకపోవడంతో
అయినప్పటికీ విమర్శలు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ ఉద్యమాన్ని నడుపుతుందని ప్రకటించారు. అంతటి చిత్తశుద్ధే ఆయనకుంటే అమెజాన్ సరఫరా చేస్తున్న ఉత్పత్తుల ప్యాకేజీకి ఏమాత్రం ప్లాస్టిక్ పేపర్‌ను వాడకూడదు.

మరి అమెజాన్ అధినేత ఆ దిశగా
మరి అమెజాన్ అధినేత ఆ దిశగా అడుగులు వేస్తారా లేక అందరిబాటలోనే నడుస్తారా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications








