డిలీట్ చేసిన ట్వీట్లు మళ్లీ చూడొచ్చు

Written By:

ఎవరైనా నచ్చలేదంటే వారి గురించి రాజకీయ నాయకులు ట్విట్టర్ లో వాయించి పారేస్తారు గదా..వారి మీద వినడానికి భయపడే పదాలతో ట్విట్టర్ లో ఆడేసుకుంటారు చాలామంది రాజకీయ నాయకులు..అవి వివాదస్పదం అయ్యే లోపు చాలామంది చూసేస్తారు కూడా.. ఇక వారి వాడిన పదాలు అభ్యంతరంగా ఉన్నాయని కొంతమంది విమర్శలతో ప్రతి దాడి చేస్తుంటారు కూడా. అటువంటి సంధర్భంలో చాలా మంది మా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నామని ఆ పోస్టులు డిలీట్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఆ పోస్టులను డిలీట్ చేసినా కాని మళ్లీ మనం చూడొచ్చు.

Read more : బీబీసీ వెబ్‌సైట్ హ్యాక్ మా పనే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రాజకీయ నాయకులకు మింగుడు పడని వార్త

రాజకీయ నాయకులకు మింగుడు పడని వార్త. ట్విటర్ లో పోస్ట్ చేసి, తొలగించిన వివాదస్పద ట్వీట్స్ మళ్లీ ప్రజల చేతుల్లోకి రానున్నాయి. ఈ మేరకు ట్విటర్ తో పొలిట్ వూప్స్ వెబ్ సైట్ ఒప్పందం కుదుర్చుకుంది.

తాము ట్విటర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు

తాము ట్విటర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కాగానే రాజకీయ నాయకులు వాటిని వెంటనే తొలగిస్తున్నారు. దీంతో అసలు వారేమన్నారో ప్రజలకు తెలియకుండా పోతోంది. ఇలా తొలగించిన ట్వీట్లను పొలిట్ వూప్స్ ద్వారా తిరిగి పొందవచ్చు.

భారత్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా సహా 30 దేశాల్లో

భారత్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా సహా 30 దేశాల్లో ఈ సేవలను మళ్లీ ప్రారంభించనుందని సీనెట్ డాట్ కామ్ వెల్లడించింది. అమెరికాకు చెందిన సన్ లైట్ ఫౌండేషన్ నడుపుతున్న పొలిట్ వూప్స్ వైబ్ సైట్ ను నెదర్లాండ్ కు చెందిన పారదర్శక సంస్థ ఓపెన్ స్టేట్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది.

పొలిట్ వూప్స్ ఇంతకుముందు ఈ సేవలు

పొలిట్ వూప్స్ ఇంతకుముందు ఈ సేవలు అందించింది. అయితే తొలగించిన ట్వీట్లకు సంబంధించిన కోడ్ ఇచ్చేందుకు ట్విటర్ నిరాకరించడంతో గతేదాడి నుంచి ఈ సేవలు నిలిచిపోయాయి.

ట్విటర్ సీఈవో జాక్ డోర్సెతో పలు దఫాలుగా

ట్విటర్ సీఈవో జాక్ డోర్సెతో పలు దఫాలుగా తాము జరిపిన చర్చలు ఫలించడంతో మరోసారి ఈ సేవలు ప్రారంభించనున్నామని ఓపెన్ స్టేట్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు

సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పేర్కొంది. అయితే ట్విటర్ లో తొలగించిన ట్వీట్లను తిరిగి పోస్ట్ చేస్తుందా అనేది స్పష్టం కాలేదు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Recover politicians' deleted tweets on Politwoops
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot