అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ లో స్మార్ట్ ఫోన్ల పై ఆఫర్లు చూస్తే ఫిదా అవుతారు
కొత్త మొబైల్ ను కొనుగోలు చెయ్యాలి అని అనుకుంటున్నారా అయితే మంచి తరుణం రాబోతుంది.ఇది వరకు చాలా ఆఫర్లతో అమెజాన్ లో మొబైల్ అమ్మకాలు జరిగాయి.గత అమెజాన్ ఫెస్టివల్ లో మొబైల్ ను కొనుగోలు చేయకుండా ఉంటె ఇప్పుడు అమెజాన్ యొక్క ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ తరువాతి వారంలో మరోసారి తిరిగి వస్తోంది.

నో -కాస్ట్ EMI ఎంపికలతో పాటు మరియు అన్ని రకాల స్మార్ట్ ఫోన్ ల ఎక్స్చేంజ్ ఆఫర్లతో పాటు చాలా రకాల డిస్కౌంట్లను కూడా ఈ అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ లో అందిస్తోంది.అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ జూన్10 న మొదలవుతుంది మరియు జూన్13 వరకు కొనసాగుతుంది. కానీ అమెజాన్ ఇప్పటికే స్టోర్ లో అతిపెద్ద ఆఫర్లును అందిస్తున్నట్లు కనిపిస్తుంది.

మొబైల్ ఫోన్లు :
మీరు ఒకవేల OnePlus 6T, ఐఫోన్ X, Huawei P30 ప్రో మరియు శామ్సంగ్ గెలాక్సీ M30లు కొనడానికి ఇష్టపడుతున్నట్లు అయితే ఈ ఫోన్లను పొందడానికి మీకు ఇది మంచి ఉత్తమమైన అవకాశం కావచ్చు.
అమెజాన్ వీటితో పాటు శామ్సంగ్ గెలాక్సీ M20, హానర్ 9N,మరియు రెడ్మి 7 వంటి మరిన్ని అనేక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరను తగ్గించాలని ప్రణాళిక వేస్తోంది.మొబైల్ ఫోన్లతో పాటు వాటి యొక్క ఉపకరణాలు కూడా తక్కువ ధరలు జాబితాలో భాగంగా అమ్మకానికి ఉన్నాయి.

ధరలు:
OnePlus 7 మరియు Oneplus 7 ప్రో ఇప్పటికే ఇక్కడ ఉండవచ్చు కానీ OnePlus 6T ఇప్పటికే మంచి తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.ఈ ఫోన్ యొక్క 8 GB RAM + 128 GBస్టోరేజ్ వేరియంట్ ధర కేవలం 27,999 రూపాయలకు అందుబాటులో ఉంది.
శ్యామ్సంగ్ గెలాక్సీ M30 ఫోన్ రూ.15,000 కంటే తక్కువ ధరతో ఉన్న స్మార్ట్ ఫోన్లలో ఉత్తమ డిస్ప్లే ను అందిస్తుంది.గెలాక్సీ M30 యొక్క బేస్ వేరియంట్ ధర రూ.14,990 కోసం రిటైల్లో ఉండగా ఈ ఫోన్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్ రిటైల్ ధర రూ. 17,990లుగా ఉంది.

ఆఫర్స్:
అమ్మకాలలో భాగంగా గెలాక్సీ M30 6 జీబి ర్యామ్ మరియు 128 జీబి స్టోరేజ్ తో ఉన్న టాప్-ఎండ్ వేరియంట్ ధర 14,990 రూపాయలకు తక్కువగా లభ్యమవుతుంది.ఈ మొబైల్ ను నో-కాస్ట్ EMI మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లతో లబిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ M20, హానర్ 9N , వివో Y91i, రెడ్మి 6A, Mi A2 , Redmi 7 మరియు Oppo A5 వంటి ఇతర బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా ఈ అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ అమ్మకంలో ధర తగ్గింపులు కలిగి ఉన్నాయి.

No-cost EMI ఎంపికలు:
గెలాక్సీ నోట్ 9, వివో నెక్స్, హువాయ్ P30 ప్రో , మరియు Oppo R17 వంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్లు కూడా ధరలను తగ్గించాయి. ఈ ఫోన్లలో ప్రతి దానిపై ఖచ్చితమైన మొత్తం ఇంకా ప్రస్తావించబడలేదు కానీ ధర తగ్గింపు మొత్తం వ్యయంతో పాటు మరింత తగ్గింపు కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో పాటు ఉండవచ్చని అమెజాన్ సూచించింది.
No-cost EMI ఎంపికలలో నోకియా 8.1, హానర్ వ్యూ 20, వివో V15 ప్రో మరియు Oppo F11 ప్రో లలో కూడా ఇవ్వబడతాయి. మీరు అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ యొక్క మరిన్ని వివరాలు తెలుసుకోవటం కోసం అమెజాన్ యొక్క అధికారిక పేజీలో చూడవచ్చు. ఇది అమ్మకంలో భాగంగా ఇతర ఫోన్ జాబితాను తనిఖీ చెయవచ్చు.


Click it and Unblock the Notifications








