అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్స్ ... ఈ ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లు

|

అమెజాన్ ఇండియా ఇప్పుడు కొత్తగా 'ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్' పేరుతో మరొక సేల్స్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ అమ్మకంలో ఒప్పో, వివో, షియోమి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్లపై భారీగా ఆఫర్లను మరియు డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ తాజా ఆన్‌లైన్ సేల్స్ లో కొత్తగా రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్ వివో U20పై అధికంగా ఆఫర్లను అందిస్తున్నది.

ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్
 

ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సందర్భంగా అమెజాన్ ఇండియాలో షాపింగ్ చేసే వినియోగదారులకు రూ.8,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. అలాగే 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI పై 5% తక్షణ డిస్కౌంట్, యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI పై 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి డెబిట్ కార్డ్ వినియోగదారులు 10% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ లో రియల్‌మి X2 ప్రో సేల్స్ .. క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ అదుర్స్

 వివో U20

అమెజాన్ ఇండియాలో మొదలైన ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్స్ లో స్మార్ట్‌ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లలో భాగంగా వివో U20 యొక్క మొదటి ఫ్లాష్ సేల్ నవంబర్ 28 న మధ్యాహ్నం 12 గంటల వద్ద మొదలుకానున్నది. అలాగే షియోమి యొక్క సరికొత్త రెడ్‌మి నోట్ 8 మరియు రెడ్‌మి నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క ఫ్లాష్ సేల్స్ నవంబర్ 26 మరియు నవంబర్ 27 న జరుగుతున్నాయి.

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ఐఫోన్‌లు

కొత్త ఆపిల్ ఐఫోన్‌లు కొనాలనుకునే వారు ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్ మరియు ఐఫోన్ ఎక్స్‌ఆర్ స్మార్ట్‌ఫోన్‌ల మీద అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్స్ లో కొత్త ఒప్పందాలను అందిస్తున్నారు. ఇందులో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు మీద ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.7 వేల వరకు ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌
 

వివో స్మార్ట్‌ఫోన్‌ల మీద రూ.11,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు అదనంగా రూ.1,000 వరకు తగ్గింపుతో పొందవచ్చు. అలాగే ఒప్పో ఫోన్ల మీద కూడా అదనంగా రూ.5 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. హానర్ మరియు హువాయి ఫోన్లు 13,000 రూపాయల నుండి తగ్గింపు ధరలతో పొందవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Fab Phones Fest Sales Starts Today: Discounts That You Like To See

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X