క్యాష్ ఆన్ డెలివరీ మళ్లీ వచ్చేసింది

రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను కొద్ది రోజుల పాటు నిలిపివేసిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు.. తిరిగి ఆ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే చెల్లుబాటయ్యే నోట్లను మాత్రమే చెల్లించి వస్తువులను తీసుకోవల్సి ఉంది.

Read More : తెలుగు రాష్ట్రాల్లో జియో సిమ్ హోమ్ డెలివరీ షురూ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్ పూర్తిగా రద్దు చేసింది..

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అమెజాన్ ఇండియా పూర్తిగా క్యాష్ ఆన్ డెలివరీ సర్వీసును నిలిపివేసింది. ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు ఎంపిక చేసిన వస్తువుల పై మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయాన్ని అందుబాటులో ఉంచాయి.

చెల్లుబాటుకావంటూ..

పేమెంట్ క్రింద పాత రూ.500, రూ.1000 నోట్లు అంగీకరించబడవంటూ మెసేజ్‌లను కూడా ఈ వెబ్‌సైట్‌లు పోస్ట్ చేయటం జరిగింది. వాట్సాప్ వీడియో కాల్స్‌‌లో దమ్మెంత..?

డెబిట్ ఇంకా క్రెడిట్ కార్డుల పై డిస్కౌంట్స్..

ఇదే సమయంలో ఆన్‌లైన్ పేమెంట్‌లను ప్రోత్సహించేందుకు డెబిట్ ఇంకా క్రెడిట్ కార్డుల పై 10 శాతం వరకు డిస్కౌంట్‌లకు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు తెరలేపాయి.

'Wallet on Delivery'

ఈ విభాగంలో ఒకడుగు ముందుకువేసిన స్నాప్‌డీల్, ఫ్రీచార్జ్‌తో జతకట్టి 'Wallet on Delivery' పేరుతో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్, తాను కొనుగోలు చేసిన వస్తువుకు సంబంధించి ఫ్రీచార్జ్ వాలెట్ ద్వారా డబ్బులు చెల్లించే అవకాశం ఉంటుంది. ఫోన్‌లో పోర్న్ వెబ్‌‌సైట్‌లు చూస్తున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Amazon, Flipkart and Snapdeal resumes Cash On Delivery. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting