అమెజాన్ సేల్‌లో దిమ్మతిరిగే ఆఫర్లు.. ప్రీమియం హెడ్‌ఫోన్స్, స్పీకర్లు, మైక్రోఫోన్లు సగం కంటే తక్కువ ధరకే..!!
Amazon Mega Music Fest: అమెజాన్ ఇండియా మ్యూజిక్ ప్రియుల కోసం \"మెగా మ్యూజిక్ ఫెస్ట్\" సేల్ ప్రకటించింది. ఈ సేల్ మార్చి 16 నుంచి మార్చి 18 వరకు కొనసాగుతుంది. ఈ లిమిటెడ్ టైమ్ సేల్‌లో మంచి బ్రాండ్లకు సంబంధించిన హెడ్‌ఫోన్స్, సౌండ్‌బార్లు, వైర్‌లెస్ స్పీకర్లు, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇంకా మరెన్నో ఆడియో ప్రొడక్ట్స్‌పై ఏకంగా 65% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
అంతేకాదు, ఎస్‌బీఐ, HSBC, హెచ్‌డీఎఫ్‌సీ, IDFC క్రెడిట్ కార్డులతో EMI పద్ధతిలో డబ్బులు చెల్లించే వారికి అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరి మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ సేల్ లో ఏయే ఆడియో ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ లభిస్తాయో తెలుసుకుందాం పదండి.

* ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్‌పై బెస్ట్ డీల్స్..
boAt నిర్వాణ X TWS ఇయర్‌బడ్స్ కేవలం రూ.2,799కే లభించనున్నాయి. డ్యూయల్ డ్రైవర్స్‌తో ఇవి వస్తాయి. వీటిలో Knowles పవర్, LDAC హై-రిజల్యూషన్ ఆడియో, ఇంకా రిచ్ సౌండ్ కోసం అడాప్టివ్ EQ కూడా ఉంది. ఇవి కొనుగోలు చేస్తే మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండటం ఖాయం.
- బౌల్ట్ ఎక్స్ ముస్తాంగ్ టార్క్ TWS
ఇవి కేవలం రూ.1,999 ధరకే లభిస్తున్నాయి. ఫోర్డ్ ముస్టాంగ్ ప్రేరణతో డిజైన్ చేసిన ఈ ఇయర్‌బడ్స్‌లో ఏకంగా 60 గంటల బ్యాటరీ లైఫ్ ఉంది. 13mm డ్రైవర్స్‌తో పాటు, మీ టేస్ట్‌కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకునే EQ మోడ్స్ కూడా ఉన్నాయి. స్టైలిష్ లుక్స్‌తో పాటు సూపర్ సౌండ్ క్వాలిటీ కూడా మీ సొంతం.
* నాయిస్ మాస్టర్ బడ్స్ (ధర రూ.7,999)
ఇవి మామూలు బడ్స్ కాదు. 49dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ ఉంది, డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ చేసుకోవచ్చు, ఇంకా బోస్ క్యూరేటెడ్ సౌండ్‌తో వస్తాయి. అంటే సౌండ్ క్వాలిటీలో ఏ మాత్రం రాజీ పడలేదు కంపెనీ. ఇవి నచ్చితే ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.
* సోనీ WH-1000XM4 (ధర రూ.22,989)
ప్రీమియం ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ తక్కువ ధరలో కావాలనుకుంటే సోనీ WH-1000XM4 చెక్ చేయవచ్చు. 30 గంటల బ్యాటరీ లైఫ్, డిజిటల్ ANC, టచ్ కంట్రోల్స్... అన్నీ ఉన్నాయి ఇందులో. గొప్ప సౌండ్ క్వాలిటీ, మంచి బ్రాండ్ వాల్యూ అందించడం ఈ హెడ్ ఫోన్స్ ప్రత్యేకత.
* స్పీకర్లు, సౌండ్‌బార్లపై టాప్ డీల్స్..
- JBL సినిమా SB560 సౌండ్‌బార్
దీని ధర కేవలం రూ.17,999 మాత్రమే. కానీ ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అందించడంలో వీటికి ఇవే సాటి. JBL సౌండ్‌బార్ ఎలాంటి సినిమా సౌండ్ నైనా అద్భుతంగా వినిపించగలరు. ఇందులో డాల్బీ ఆడియో, 250W RMS ఔట్‌పుట్, 3.1-ఛానెల్ సరౌండ్ సౌండ్‌తో సినిమా చూస్తున్న ఫీలింగ్ కచ్చితంగా వస్తుంది.
- మార్షల్ ఎంబర్‌టన్ II, సోనీ అల్ట్ ఫీల్డ్ 1 వైర్‌లెస్ స్పీకర్
దీని ధర రూ.14,999. కాంపాక్ట్ బ్లూటూత్ స్పీకర్ కావాలంటే మార్షల్ ఎంబర్‌టన్ II చెక్ చేయవచ్చు. 30 గంటల బ్యాటరీ లైఫ్, IP67 వాటర్ రెసిస్టెన్స్, ఇంకా మార్షల్ సిగ్నేచర్ సౌండ్‌తో ఎక్కడైనా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. సోనీ అల్ట్ ఫీల్డ్ స్పీకర్ ధర రూ.10,990.
పార్టీ మూడ్ కోసం మంచి బేస్ కావాలనుకుంటే దీని కంటే మంచి ఛాయిస్ మరొకటి ఉండదు. ఇది 12 గంటల ప్లేటైమ్, IP67 రేటింగ్ అందిస్తుంది. అంతేకాదు జీబ్రానిక్స్ జ్యూక్ బార్ 9510WS ప్రో రూ.15,999 ధరకే లభిస్తుంది. 600W RMS సౌండ్‌బార్ విత్ డ్యూయల్ వైర్‌లెస్ శాటిలైట్స్ ఇందులో ఉన్నాయి. డాల్బీ ఆడియోతో హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందొచ్చు.
* మైక్రోఫోన్లు, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫర్లు..
బోయా BY-V10 వైర్‌లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ ధర రూ.2,200గా ఉంది. పాడ్‌కాస్ట్‌లు, వ్లాగ్‌లు, ఇంటర్వ్యూలు కోసం బెస్ట్ మైక్. బోయా BY-V10 ఒకే ఒక్క క్లిక్‌తో బయట శబ్దాల నీటిని రిమూవ్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌కి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్న్ INT-38C అకౌస్టిక్ గిటార్ కిట్ కూడా తక్కువ ధరకే లభిస్తుంది.
దీని ధర రూ.2,199. గిటార్ నేర్చుకోవాలనుకుంటే ఈ అకౌస్టిక్ గిటార్ కిట్ మీ కోసమే. ఎబోనీ వుడ్ ఫ్రేట్‌బోర్డ్, ప్లాస్టిక్ బ్రిడ్జ్, కంఫర్టబుల్ స్ట్రింగ్స్‌తో వస్తుంది. స్ట్రాప్, ఎక్స్ట్రా స్ట్రింగ్స్, క్యారీయింగ్ బ్యాగ్, మూడు పిక్స్ ఫ్రీగా ఇస్తారు. బ్యాంక్ ఆఫర్లు, అమెజాన్ పే రివార్డులు కూడా ఉన్నాయి.
వాటిని సేల్స్ సమయంలో చెక్ చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కి చాలా ప్రొడక్ట్స్‌పై సేమ్-డే, నెక్స్ట్-డే డెలివరీ ఫెసిలిటీలు ఉన్నాయి. అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్‌తో అన్‌లిమిటెడ్ 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. డీల్స్‌కి ఎర్లీ యాక్సెస్ కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications







