Home
News

Amazon Primeను ఉచితంగా అందిస్తున్న Vodafone,Airtel ప్లాన్‌లు ఇవే!!

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో త్వరలోనే జరపబోయే తన ప్రైమ్ డే అమ్మకాల తేదీలను ఇటీవల ప్రకటించింది. రెండు రోజులపాటు జరిగే ప్రైమ్ డే అమ్మకంలో అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ముందుగా యాక్సిస్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ ను ఇప్పుడు ఒక నెలకు రూ.129 లేదా సంవత్సరానికి రూ.999 చెల్లించి ప్రైమ్ సభ్యత్వాన్ని కొనుగోలు చేయవచ్చు.

Amazon Prime Day Sale

Amazon Prime Day Sale

అమెజాన్ ప్రైమ్ డే అమ్మకానికి ముందుగా యాక్సిస్ పొందడానికి అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా పొందడానికి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటి వద్ద నుండి పనిచేయడానికి అధిక డేటాను అందిస్తున్న ప్లాన్ లతో రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఒక వేల మీరు ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ వంటి సిమ్ లను ఉపయోగిస్తూ ఉంటే కనుక అవి కొన్ని కొన్ని ప్లాన్ లతో అమెజాన్ ప్రైమ్ ను ఉచితంగా అందిస్తున్నది. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వ ప్రయోజనాల విషయానికి వస్తే ఒకరోజులో డెలివరీ, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్ మరియు ఉచిత ఇన్-గేమ్ కంటెంట్‌లకు ముందుగా ఉచిత యాక్సిస్ లభిస్తుంది. అలాగే సాధారణ అమ్మకాల సమయంలో కూడా ముందుగా యాక్సిస్ లభిస్తుంది.

వోడాఫోన్-ఐడియా రూ.499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్-ఐడియా రూ.499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్-ఐడియా అందిస్తున్న ఈ ప్లాన్ నెలకు 75GB డేటా మరియు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది.

వోడాఫోన్-ఐడియా రూ .699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత డేటా మరియు నెలకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది.

 

వోడాఫోన్-ఐడియా రూ.1,099 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్-ఐడియా రూ.1,099 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్ యొక్క Red X ప్లాన్‌లో భాగంగా రూ.1,099 ధర వద్ద వస్తున్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అపరిమిత డేటా మరియు నెలకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఇది కస్టమర్ సర్వీస్ ప్రాధాన్యత యాక్సెస్, హోటల్ బుకింగ్‌లకు 10% ఆఫ్ వంటి మరిన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

వోడాఫోన్-ఐడియా రూ.589 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్-ఐడియా రూ.589 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఇది రెండు కనెక్షన్లతో వస్తున్న ఫ్యామిలీ ప్లాన్. ఈ ప్లాన్ మొత్తంగా 80GB డేటాను అందిస్తుంది. ఇందులో మొదటి సభ్యుడు 50GB డేటాను మరియు రెండవ సభ్యుడికి నెలకు 30GB డేటా లభిస్తుంది. డేటా రోల్ ఓవర్ కోసం ఇది 200GB పరిమితిని కలిగి ఉంది.

వోడాఫోన్-ఐడియా రూ .749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్-ఐడియా రూ .749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్-ఐడియా రూ .749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా మూడు కనెక్షన్లకు చెల్లుబాటు అయ్యే ఫ్యామిలీ ప్లాన్. ఇది మొత్తంగా 120GB డేటాను అందిస్తుంది. ఇందులో మొదటి సభ్యుడికి 60GB డేటా, మిగిలిన ఇద్దరు సభ్యులకు 30GB + 30GB డేటా లభిస్తుంది. డేటా రోల్ ఓవర్ కోసం ఇది 200GB పరిమితిని కలిగి ఉంది.

వోడాఫోన్-ఐడియా రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్-ఐడియా రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్-ఐడియా యొక్క రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఐదు కనెక్షన్లతో వస్తున్న ఫ్యామిలీ ప్లాన్. ఇది మొత్తంగా 200GB డేటాను అందిస్తుంది. ఇక్కడ మొదటి సభ్యుడు 80GB డేటా ప్రయోజనంను మరియు మిగిలిన సభ్యులు ప్రతి ఒక్కరు 30GB చొప్పున డేటా ప్రయోజనంను పొందుతారు. ఇది డేటా రోల్ ఓవర్ కోసం 200GB పరిమితిని కలిగి ఉంది మరియు నెలకు 100 SMS ను కలిగి ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ .349 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ .349 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ సంస్థ రూ.349 ధర వద్ద అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వానికి ఉచిత యాక్సిస్ ను కేవలం 28 రోజులకు మాత్రమే అందిస్తుంది. ఇందులో భాగంగా ఇది వినియోగదారులకు అపరిమిత కాలింగ్, రోజుకు 2GB డేటా, రోజుకు 100SMS వంటి ప్రయోజనాలను కూడా అదనంగా అందిస్తుంది.

 

ఎయిర్‌టెల్ యొక్క రూ.349 ప్లాన్ మినహా అన్ని ప్లాన్‌లు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని 12 నెలల పాటు అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్నాయి. అన్ని ప్రణాళికలు కొన్ని నిబంధనలు మరియు షరతులతో వస్తాయి.

ఎయిర్‌టెల్ రూ .499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ .499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో తక్కువ ధర వద్ద అమెజాన్ ప్రైమ్ ను ఉచితంగా అందిస్తున్న ఈ ప్లాన్ నెలకు 75GB డేటా మరియు రోజుకు 100SMS లను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ .749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ .749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రెండు కనెక్షన్లతో వస్తున్న ఫ్యామిలీ ప్లాన్. ఈ ప్లాన్ రోల్ 125GB డేటా ఓవర్‌తో వస్తుంది. ఇది అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ మరియు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ .999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ .999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నాలుగు కనెక్షన్లతో వస్తున్న ఫ్యామిలీ ప్లాన్. ఇది మొత్తంగా నెలకు 150GB డేటా రోల్ ఓవర్‌తో లభిస్తుంది. ఇది అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ .1,599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ .1,599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క రూ .1,599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 2-సభ్యుల పరిమితితో వస్తున్న ఫ్యామిలీ ప్లాన్. ఒక నెల చెల్లుబాటుతో వస్తున్న ఈ ప్లాన్ అపరిమిత డేటా మరియు అపరిమిత కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో పాటుగా ఇది ఉచితంగా 200 ISD నిమిషాలు మరియు అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లపై 10% తగ్గింపును అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Amazon Prime Day Sale: Airtel and Vodafone-Idea 11 Plans Gives Prime Membership offer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X