Airtel,Jio,Vodafone రోజువారి 2GB డేటా ప్లాన్‌లు!!! Vodafone అదనంగా 2GB డేటా ...
కరోనా వైరస్ మహమ్మారి ముప్పు నుండి మిమ్మలిని మీరు కాపాడుకోవడానికి ఇంటికి మాత్రమే పరిమితం కావాలి అని ప్రభుత్వం సూచిస్తున్నది. ప్రైవేట్ సంస్థలు కూడా తమ తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుండి పనిచేయడానికి ఆదేశాలను ఇచ్చింది. ఇంటి వద్ద నుండి బయటికి వెళ్ళకుండా తమను తాము నిరోధించుకోవడానికి ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్న అస్త్రం ఇంటర్నెట్. ఎయిర్టెల్, జియో మరియు వొడాఫోన్ ఐడియా టెల్కోలు తమ వినియోగదారులకు 2GB రోజువారీ డేటా ప్లాన్‌లను అదికంగా అందిస్తున్నాయి.

టెల్కోల రోజువారి 2GB డేటా ప్లాన్‌లు
ప్రస్తుతం ప్రతి ఒక్కరు మునుపటిలాగా బయట స్వేచ్ఛగా ప్రయాణించలేని పరిస్థితి. అందువల్ల వినియోగదారులు తమ యొక్క పనిని పూర్తి చేసుకోవడానికి మరియు దాని ద్వారా మరి కొంత వినోదాన్ని పొందడానికి ఇంటర్నెట్ మాత్రమే మూలంగా మారింది. ప్రస్తుతం ఇంటర్నెట్ సంబంధిత పనులకు డిమాండ్ పెరిగినందున చాలా మంది ప్రజలు 2GB రోజువారీ డేటా ప్లాన్‌ల కోసం వెళుతున్నారు. ఎయిర్టెల్, జియో మరియు వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ వినియోగదారులకు అందిస్తున్న 2GB రోజువారీ డేటా ప్లాన్‌ల యొక్క అన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ 2GB డైలీ డేటా ప్లాన్స్ వివరాలు
ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారులకు రోజువారి 2GB డేటా అన్‌లిమిటెడ్ విభాగంలో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నది. రూ.298 ధర వద్ద 28 రోజుల వాలిడిటీతో మరియు రూ.698 ధర వద్ద 84 రోజుల వాలిడిటీతో లభిస్తున్న ఈ రెండు ప్లాన్‌లు తమ వినియోగదారులకు రోజుకు 2GB 3G/4G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రెండు ప్లాన్‌లు అందిస్తున్న అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్, ఒక సంవత్సరం షా అకాడమీ ఉచిత కోర్స్ లకు ప్రవేశం వంటి ప్రోత్సాహకాలతో కూడిన ప్రయోజనాలను అందిస్తుంది. దానితో పాటు ఎయిర్‌టెల్ 2GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌తో తన ప్లాన్‌లతో అందిస్తోంది. ఇతర ప్రయోజనాలలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్, హెలోట్యూన్స్ మరియు ఫాస్టాగ్ లావాదేవీపై రూ.150 క్యాష్-బ్యాక్ చందాలు కూడా ఉచితంగా లభిస్తాయి.

జియో 2GB డైలీ డేటా ప్లాన్స్ వివరాలు
టెలికామ్ రంగంలో తక్కువ కాలంలో గొప్పగా ఎదిగిన జియో సంస్థ తన వినియోగదారులకు రోజుకు 2GB ప్యాక్‌లను తక్కువ ధరకు అందిస్తుంది. కాకపోతే ఇది ఫోన్ కాల్స్ విషయంలో FUP నిమిషాల పరిమితో వస్తుంది. Jio యొక్క ప్లాన్‌ల ధరల వివరాల విషయానికి వస్తే ఇది రూ.249 మరియు రూ.599 ధర వద్ద 28 మరియు 84 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు కూడా రోజుకు 2GB డేటాతో పాటుగా జియో టూ జియో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఇవి నాన్-జియో కాల్స్ కోసం 1000 మరియు 3000 FUP నిమిషాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు రెండూ కూడా జియో యొక్క అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు సేవలకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి.

వోడాఫోన్ ఐడియా 4GB డైలీ డేటా ప్లాన్స్ వివరాలు
వొడాఫోన్ ఐడియాకు విషయానికి వస్తే ఇవి తమ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రస్తుతం డబుల్ డేటా ప్రయోజనాన్ని అదనంగా కూడా అందిస్తున్నది. వోడాఫోన్ మరియు ఐడియా రూ.299 మరియు రూ.699 ధర వద్ద గల ప్లాన్‌లు రోజువారీ 2GB డేటాను 28 రోజులు మరియు 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు రోజుకు 2Gb డేటాను పొందడంతో పాటుగా అదనంగా రోజుకు 2GB అంటే మొత్తంగా రోజుకు 4GB డేటాను పొందవచ్చు. ఇది పరిమిత-సమయం వరకు మాత్రమే ఈ డబుల్ డేటా ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లు రెండూ కూడా అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100sms ప్రయోజనాలను అందిస్తాయి . ఈ ప్లాన్‌లు వొడాఫోన్ / ఐడియా వీడియో ప్లాట్‌ఫామ్‌లతో పాటు ZEE5 సభ్యత్వానికి కూడా ఉచిత యాక్సిస్ ను ఇస్తాయి.


Click it and Unblock the Notifications








