Home
News

సగం ధరకే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌

ఇండియాలో 18-24 సంవత్సరాల మధ్య వయస్సు గల వినియోగదారులు 999రూపాయల విలువ గల అమెజాన్ వార్షిక ప్రైమ్ సభ్యత్వానికి చేరినప్పుడు 50 శాతం రాయతీతో (రూ.500) క్యాష్‌బ్యాక్ లభిస్తుందని అమెజాన్ ప్రకటించింది. ఇ-రిటైల్ దిగ్గజం తన ప్రైమ్ డే సేల్ ఈవెంట్ కోసం సన్నద్ధమవుతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది.

amazon prime subscription rs 499 young adults 18 24 year

కొత్త ధరలతో ప్రైమ్ సభ్యత్వానికి సైన్ అప్ చేసే యువకులు కూడా ప్రైమ్ డే అమ్మకానికి అర్హులు అవుతారని కంపెనీ తెలిపింది.అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కోసం కొత్తగా సైన్ అప్ చేసే వినియోగదారులు అమెజాన్.ఇన్ లో వారి వయస్సును ధృవీకరించడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆఫర్‌లను సంస్థ యొక్క అధికారిక Android లేదా iOS యాప్ ల ద్వారా మాత్రమే పొందవచ్చు.

ఆఫర్:

ఆఫర్:

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంపై 50 శాతం క్యాష్‌బ్యాక్‌తో కస్టమర్లు ప్రైమ్ ద్వారా ఉత్తమమైన షాపింగ్ మరియు వినోదాన్ని ఆస్వాదించగలరు మరియు అదే సమయంలో 500రూపాయలు కూడా ఆదా చేయవచ్చు.అమెజాన్ ప్రైమ్ డే 2019 (జూలై 15-16) సమయానికి ఈ ఆఫర్‌ను ప్రారంభించటానికి మేము సంతోషిస్తున్నాము అని అమెజాన్ ప్రైమ్ డైరెక్టర్ మరియు ఇండియన్ హెడ్ అక్షయ్ సాహి ఒక ప్రకటనలో తెలిపారు.

యూత్ ఆఫర్ దరఖాస్తు :

యూత్ ఆఫర్ దరఖాస్తు :

యువత అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వానికి ‘యూత్ ఆఫర్' బ్యానర్ నుండి ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాన్ కార్డ్, ఇమెయిల్ ID మరియు ఫోటోను అప్‌లోడ్ చేయడం ద్వారా వారు వారి వయస్సును ధృవీకరించాలి. తరువాత 999రూపాయలు చెల్లించి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ను పొందవచ్చు. ఒకసారి వయసు ధృవీకరించిన తర్వాత 500రూపాయలు క్యాష్‌బ్యాక్‌ రూపంలో కస్టమర్ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్ కు 10 రోజుల్లో జమచేయబడుతుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ ద్వారా బిల్ చెల్లింపులు, రీఛార్జిలు లేదా ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాటికి ఉపయోగించవచ్చు అని కంపెనీ తెలిపింది.

ప్రయోజనాలు:

ప్రయోజనాలు:

అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అర్హత కలిగిన ఉత్పత్తులపై అపరిమిత ఉచిత ఫాస్ట్ డెలివరీ, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ మరియు ప్రైమ్ రీడింగ్‌కు యాక్సిస్, ఒప్పందాలు మరియు ఆఫర్‌లకు త్వరిత యాక్సిస్ మరియు మరిన్ని లాభాలను పొందవచ్చు.

అమెజాన్ ప్రైమ్ చందా :

అమెజాన్ ప్రైమ్ చందా :

జూలై 2016 లో భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ చందా సంవత్సరానికి 499రూపాయలతో ప్రారంభించింది. అమెజాన్ ప్రైమ్ చందా ప్రస్తుత ధర 999రూపాయలు.ఇప్పుడు వార్షిక ధరతో పాటు ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా నెలకు 129రూపాయలకు అందిస్తోంది. కానీ అమెజాన్ సంస్థ యువతకు నెలవారీ చందాపై ఎటువంటి క్యాష్‌బ్యాక్ ఇవ్వడం లేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
amazon prime subscription rs 499 young adults 18 24 year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X