విశాఖలో 5జీ వై-ఫై సేవలు ప్రారంభం

Posted By:

విశాఖలో 5జీ వై-ఫై సేవలు ప్రారంభం

5జీ సామర్థ్యంతో కూడిన హై-స్పీడ్ వై-ఫై సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విశాఖపట్నంలో ప్రారంభించింది. దీంతో వైజాగ్ ‘స్మార్ట్ సిటీ' హోదాను దక్కించుకుంది. ఈ వై-ఫై నెట్‌వర్క్ సేవలను నగరంలోని ప్రముఖ ప్రాంతాలతో పాటు అన్ని ఎడ్యుకేషన్‌ల్ సంస్థల్లో 2 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ వేగంతో అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ మొదటి ఫేజ్‌లో భాగంగా కైలాసగిరి, ఉడా పార్కు, ఆర్‌కే బీచ్ ప్రాంతాల్లో వై-ఫై సేవలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

Read More: సాఫ్ట్‌వేర్ అడ్డా బెంగళూరుకు మరో గుర్తింపు

విశాఖలో 5జీ వై-ఫై సేవలు ప్రారంభం

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బీఎఎస్ఎన్ఎల్ - క్వాడ్‌జెన్ సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో అందిస్తోన్న ఈ 5జీ వై-ఫై సర్వీసులను మొదటి 30 నిమిషాల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. విశాఖపట్నం శివారు మధరువాడ ఐటీ సెజ్ లోని స్టార్టప్ విలేజ్ లో అంతర్జాలల సేవలను మంత్రి గంటా ప్రారంభించారు. స్టార్టప్‌ విలేజ్‌కి 1 జీబీపీఎస్‌ బ్యాండ్‌ విడ్త్‌ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని ఎయిర్‌టెల్‌ అందిస్తోందని చెప్పారు. 

Read More: తెలంగాణ యువతకు సామ్‌సంగ్ శిక్షణ

English summary
Andhra Pradesh government launches Wi-Fi service in Vizag. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot