Home
News

ఆండ్రాయిడ్‌ 16 విడుదల తేదీ వచ్చేసింది.. గతం కంటే చాలా ముందుగానే లాంచ్‌..!

మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (MWC 2025) లో ఆండ్రాయిడ్‌ 16 పై (Android 16 launch date) కీలక వివరాలు వెల్లడయ్యాయి. దీనిపై పనిచేస్తున్న ఓ అధికారి ఈ ఈవెంట్‌ లో ఆండ్రాయిడ్ 16 టైమ్‌లైన్‌ ను లీక్‌ చేశారు. ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌ ను గూగుల్‌ ఆగస్టులో విడుదల చేసేది.. అయితే ఈ కొత్త OS వెర్షన్‌ మాత్రం అంతకంటే ముందుగానే విడుదల కానుంది. ప్రస్తుతం ఈ OS వెర్షన్ రెండు బీటా వెర్షన్‌లు లాంచ్ అయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది? :
ఆండ్రాయిడ్ పోలీస్‌ నివేదిక ఆధారంగా ఆండ్రాయిడ్‌ 16 ఈ సంవత్సరం జూన్‌ లో విడుదల కానుంది. MWC 2025 లో గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఎకోసిస్టమ్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌ సామత్‌ ఈ వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. గూగుల్‌ ట్రంక్‌ స్టేబుల్ డెవలప్‌మెంట్‌ మోడల్‌ ను తీసుకున్నట్లు తెలిపారు.

Android 16 launch timeline

బీటా వెర్షన్లు :
సాధారణ ఫీచర్‌ ఆధారిత మోడల్స్‌తో పోలిస్తే దీని ద్వారా వేగంగా విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. జనవరి చివరి వారంలో ఆండ్రాయిడ్ 16 తొలి బీటా వెర్షన్ విడుదల అయింది. గత వారంలో రెండో బీటా వెర్షన్ విడుదల అయింది.

ఇప్పటికే కేవలం రెండు బీటా వెర్షన్‌ లు మాత్రమే అందుబాటులోకి రాగా.. జూన్‌ లో ఫుల్‌ వెర్షన్‌ లాంచ్‌ కానుందనే వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఆండ్రాయిడ్‌ 16 బీటా 2.1 వెర్షన్‌ లో ఎటువంటి కొత్త ఫీచర్‌లు లేనప్పటికీ.. డివైస్‌ పనితీరును మెరుగుపరిచే విధంగా కనెక్టివిటీ, సిస్టమ్‌ స్టెబిలిటీని ఫిక్స్ చేసింది.

ఇంటర్‌ఫేస్‌ మార్పులు సహా :
ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 15 OS అందుబాటులో ఉంది. అయితే త్వరలో లాంచ్‌ కానున్న OS అప్‌డేట్‌ ద్వారా ఇంటర్‌ఫేస్‌లో చాలా మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇంటర్‌ఫేస్‌ కంటే యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీంతోపాటు మెరుగైన ఆడియో సెట్టింగ్స్‌ కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఇతర ఫీచర్‌లు :
దీంతోపాటు సెక్యూరిటీ, ప్రైవసీ పరంగా అనేక కొత్త ఫీచర్‌ లు అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు డిస్‌ప్లే రీఫ్రెష్‌ రేట్‌ కూడా మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 16 తో బ్యాటరీ పనితీరు కూడా మెరుగవుతుందని తెలుస్తోంది. తొలుత గూగుల్‌ పిక్సల్ ఫోన్‌ లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

* ఇటీవల క్వాల్‌కాం కీలక ప్రకటన చేసింది. కొత్త చిప్‌సెట్‌లపై పనిచేసే డివైజ్‌లకు ఏకంగా 8 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌ అందిస్తామని వెల్లడించింది. స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌ కలిగిన డివైజ్‌లకే ప్రస్తుతానికి ఈ అవకాశం ఉందని తెలిపింది.

భవిష్యత్‌లో మిగిలిన చిప్‌సెట్‌లకు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. క్వాల్‌కాం తాజా ప్రకటనలో ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల జీవిత కాలం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కూడా ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే విడుదలైన కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు 6, 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ పొందుతున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Android 16 launch timeline revealed at mobile world congress 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X