Good News ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. 8 సంవత్సరాల వరకు ఒకే స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు..!
స్మార్ట్‌ఫోన్‌లను మీరు ఎన్ని సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు. అంటే చాలా మందికి సరైన సమాధానం తెలియదు. కొంత మందికి తెలిసినా.. రెండో మూడో సంవత్సరాలు లేదా కొత్త మోడల్ వచ్చేంత వరకు అనే సమాధానాలు వినిపిస్తాయి. అయితే సాధారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను OS, సెక్యూరిటీ అప్‌డేట్‌లు వచ్చేంత వరకు నిశ్చింతకు వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు 3 సంవత్సరాల వరకు OS అప్‌డేట్‌లు వస్తుంటే.. సుమారు 4 లేదా 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు వస్తాయి.
ఈ సమయంలో OS అప్‌డేట్లు కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తాయి. అదే సెక్యూరిటీ అప్‌డేట్‌లు.. ఫోన్‌ను సురక్షితంగా వినియోగించుకొనేందుకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అనేక సంస్థలు 3 OS, 4 సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తున్నాయి. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు అయితే మరిన్ని సంవత్సరాలపాటు ఈ అప్‌డేట్స్‌ను పొందవచ్చు.

క్వాల్‌కాం కీలక ప్రకటన :
గూగుల్, శాంసంగ్ వంటి సంస్థలు తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను అందిస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ చిప్‌సెట్‌ల తయారీ సంస్థ క్వాల్‌కాం (Qualcomm) కీలక ప్రకటన చేసింది. క్వాల్‌కాం మరియు గూగుల్ భాగస్పామ్యంలో భాగంగా ఏకంగా 8 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను అందిస్తామని తెలిపింది.
ఏకంగా 8 సంవత్సరాల వరకు :
ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్స్‌ను 8 సంవత్సరాల వరకు (Android Updates Upto 8 Years) ఎటువంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు. ఈ కొత్త నిర్ణయం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (e-waste) తగ్గే అవకాశం ఉంది. మరియు స్మార్ట్‌ఫోన్‌ల జీవిత కాలం భారీగా పెరుగుతుంది.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌లకే 8 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ అందిస్తామని క్వాల్‌కాం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 మరియు స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్‌లకు 5 జనరేషన్‌ల వరకు విస్తరించనున్నామని తెలిపింది.
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఏమంటాయో :
8 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు అందిస్తామని క్వాల్‌కాం ప్రకటన చేసినప్పటికీ.. స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరియు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే హ్యాండ్‌సెట్‌లు.. క్వాల్‌కాం నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది.
స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే ప్రస్తుతానికి 8 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందనుంది. పాత OS వెర్షన్‌లు ఈ స్థాయిలో అప్‌డేట్‌లను అందుకోలేవు. అయితే క్వాల్‌కాం నిర్ణయం ఆండ్రాయిడ్ ఫోన్‌లకు సానుకూలంగా ఉంది. అయితే తయారీ సంస్థలు దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.
ప్రస్తుతం అనేక మంది మార్కెట్‌లోకి కొత్త మోడల్ ఫోన్‌లు రాగానే తమ స్మార్ట్‌ఫోన్‌లను మార్చేస్తున్నారు. అదే మరికొంత మంది సంవత్సరాల తరబడి అవే ఫోన్‌లను వినియోగిస్తున్నారు. క్వాల్‌కాం తాజా నిర్ణయం.. ఎక్కువ సంవత్సరాలపాటు ఒకే ఫోన్ వినియోగించే అలవాటు ఉన్నవారికి భాగా ఉపయోగపడుతుంది. అయితే కేవలం స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ కలిగి ఉన్న మోడల్స్ మాత్రమే 8 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ పొందే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








