ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

Posted By:

ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘6.0 Marshmallow' అంతిమంగా మార్కెట్లో విడుదలైంది. గూగుల్ ఇప్పటికే తన నెక్సుస్ డివైస్‌లకు ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్‌ను OTA రూపంలో అందిస్తోంది. మరోవైపు సామ్‌సంగ్, సోనీ, మోటరోలా, హెచ్‌టీసీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు కొత్త ఓఎస్ అప్‌డేట్‌ను అందుకునే తమ డివైస్‌ల జాబితాను ఇప్పటికే ప్రకటించేసాయి. అడ్వాన్సుడ్ ఫీచర్లతో విడుదలైన ఆండ్రాయిడ్ 6.0 Marshmallow సరికొత్త ఇంటర్‌ఫేస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, యాప్ పర్మిషన్‍ వంటి ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ఈ కొత్త ఓఎస్‌లోని 5 బెస్ట్, వరస్ట్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం...

Read More : ‘బజాజ్ ఫిన్‌సర్వ్' బంపర్ ఆఫర్,రూ.32,000 ఫోన్ మీ సొంతం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

యాప్ పర్మిషన్

ఆండ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టంలో యాప్ పర్మిషన్ ఫీచర్‌కు ప్రత్యేకమైన స్థానం లభించింది. ఈ ఫీచర్ ద్వారా యాప్ పర్మిషన్ పట్ల యూజర్ నియంత్రణను గూగుల్ మరింతగా పెంచింది.

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

నౌ ఆన్ టాప్

ఆండ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టంలో భాగంగా గూగుల్ నౌ కోసం ‘నౌ ఆన్ టాప్' పేరుతో కొత్త ఫీచర్‌ను గూగుల్ అనౌన్స్ చేసింది. ఈ ఫీచర్‌లో భాగంగా క్లిక్ లేదా వాయిస్ కమాండ్‌ను అప్లై చేయటం ద్వారా contextual సమాచారాన్ని పొందవచ్చు.

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

Doze Mode

ఆండ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టంలో Doze Mode ఫీచర్ బ్యాటరీ శక్తిని మరింగా పొదుపు చేస్తుంది.

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

ర్యామ్ మేనేజర్

ఆండ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టంలో పొందుపరిచిన సరికొత్త ర్యామ్ మేనేజర్ డివైస్ మెమరీకి సంబంధించి వివరణాత్మక విశ్లేషణను ఫోన్ స్ర్కీన్ పై చూపెడుతుంది. తద్వారా ఎక్కువ మెమరీని ఖర్చు చేస్తున్న యాప్‌లను యూజర్ సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు.

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

ఆటో బ్యాకప్ అండ్ రిస్టోర్

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో పొందుపరిచిన ఈ ఫీచర్ ఫోన్‌లోని అన్ని యాప్స్‌ను ఆటోమెటిక్‌గా గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసేస్తుంది.

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

బ్యాటరీ లైఫ్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఆరంభం నుంచి బ్యాటరీ లైఫ్ ప్రధాన సమస్యగా మారింది. ఆండ్రాయిడ్ డివైస్‌లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచేందుకు గూగుల్ ఎన్ని చర్యలు చేపడుతున్పటికి అవి పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వటం లేదు. కొత్త వర్షన్‌లో పొందుపరిచిన ఇంటెలిజెంట్ డోజ్ మోడ్ బ్యాటరీ శక్తిని ఏ మేరకు ఆదా చేస్తుందో చూడాలి.

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

కొత్త ఫీచర్లు కావాలంటే కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాల్సిందే

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ ‘6.0 Marshmallow' ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ వంటి కొత్త ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్లను మీరు ఆస్వాదించాలనుకుంటే ఈ పీచర్లను సపోర్ట్ చేసే కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌ను కొనాల్సిందే.

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

యూజర్ పర్మిషన్ లేకుండా అప్లికేషన్‌లతో డీప్ లింకింగ్.

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

Now on Tap ఫీచర్ ఫేలవమైన పనితీరు.

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

కొత్త వాల్‌పేపర్లు తప్పితే యూజర్ ఇంటర్‌ఫేస్‌లో ఏ విధమైన మార్పులు లేవు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android 6.0 Marshmallow: 5 Best And 5 Worst Features Of Google's Latest OS. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot