ఆండ్రాయిడ్ ఎమ్ వచ్చేస్తోంది!!

Posted By:

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పట్టుమని 10 శాతం ఆండ్రాయిడ్ డివైస్‌లకు చేరిందో లేదో అప్పుడే తరువాతి వర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై టెక్నాలజీ ప్రపంచంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆండ్రాయిడ్ ఎమ్ (లేదా ఆండ్రాయిడ్ 6.0) పేరుతో కొత్త వర్షన్ ఆపరటిేంగ్ సిస్టంను గూగుల్ మరికొద్ది నెలల్లో మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గూగుల్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం గురుంచి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

(ఇంకా చదవండి: సోషల్ మీడియా గురించి షాకింగ్ నిజాలు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ ఎమ్ లేదా ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం, మెరుగుపరచబడిన నోటిఫికేషన్ ఫీచర్లతో లభ్యం కానుంది.  ఆండ్రాయిడ్ టీవీ, ఆటో సపోర్ట్ వంటి ఫీచర్లు ఓఎస్‌కు మరింత ఆధునీకతను తెచ్చిపెడతాయి.  

స్మార్ట్‌హోమ్ కనెక్టువిటీ, ఈ ప్రత్యేకమైన ఫీచర్ ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫీచర్ ద్వారా మీ స్మార్ట్‌హోమ్‌ను సునాయాసంగా కంట్రోల్ చేసుకోవచ్చు.

 

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వర్షన్‌లో ఏర్పాటు చేసిన ‘కిల్ స్విచ్' తరహాలోనే మరింత ఆధునీకరించబడిన సెక్యూరిటీ వ్యవస్థను ఆండ్రాయిడ్ ఎమ్ ప్లాట్‌ఫామ్‌లో గూగుల్ ఏర్పాటు చేయనుంది.

 

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే అన్ని స్మార్ట్‌ఫోన్‌లు మరింత ఆధునీకరించబడిన స్పెసిఫికేషన్‌లతో ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌లను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాయి.

 

విడుదల ఎప్పుడంటే..?

ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రపంచానికి పరిచయం చేసే అవకాశముంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android M is coming: here's what you need to know. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot