గూగుల్ గుట్టు విప్పేసింది

Posted By:

గూగుల్ తన కొత్తగా మార్కెట్ లోకి వదిలే ఏ వెర్షన్ కైనా పేరు ఏం పెడుతుందో ఈ పాటికే మీకు తెలిసే ఉంటుంది కదా..అన్ని వెర్షన్లకు అందరికీ ఎంతో ఇష్టమైన పేర్లను పెట్టి రిలీజ్ చేస్తుంది. అయితే గత కొద్ది నెలల నుంచి గూగుల్ తన కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ ఎమ్ కు ఏ పేరు పెడుతోంది అనే ప్రశ్న అందరినీ తెగ ఉత్కంఠకు గురిచేసింది..అయితే దానికి కూడా గూగుల్ చాక్లెట్ పేరే పెట్టేసింది. రానున్న ఆండ్రాయిడ్ వెర్షన్ పేరు మార్ష్‌మలో. దీంతో పాటు ఇంతకు ముందున్న వెర్షన్ల పేర్లపై ఓ లుక్కేద్దాం.

Read more: సత్యం...శివం...సుందరం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ లో 2.2 ప్రొయో చాక్లెట్

ఆండ్రాయిడ్ ఫోన్ లో మొట్టమొదట వచ్చిన వెర్షన్.దీని పేరు ప్రోయో  

ఆండ్రాయిడ్ 2.3 గింగర్ బ్రెడ్

తరువాత వచ్చిన వెర్షన్ ఇది ఆండ్రాయిడ్ 2.3 దీని పేరే గింగర్ బ్రెడ్ 

ఆండ్రాయిడ్ 3.0 హానీకూంబ్

గింగర్ బ్రెడ్ తరువాత వచ్చిన లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 3.0 హానీకూంబ్ 

ఆండ్రాయిడ్ 4.0

హానీ కూంబ్ తరువాత వచ్చిన ఇంకో అప్ డేట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీం శాండ్ విచ్.

 

 

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీ బిన్

ఈ వెర్షన్ తరువాత వచ్చిన మరో వెర్షన్ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీ బిన్  

ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్

జెల్లీ బిన్ తరువాత వెనువెంటనే ఆండ్రాయిడ్ 4.4 వెర్షన్ రిలీజ్ చేసింది. దానికి కిట్ క్యాట్ అని పేరు కూడా పెట్టింది. 

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్

కిట్ క్యాట్ వచ్చిన తరువాత మళ్లీ న్యూ ఆండ్రాయిడ్ 5.0 రిలీజ్ చేసింది. దీనికి లాలీపాప్ అని పేరు కూడా పెట్టింది. 

ఆండ్రాయిడ్ ఎమ్....మార్ష్‌మలో

ఇప్పడు లేటెస్ట్ గా ఆండ్రాయిడ్ ఎమ్ అంటూ ఎప్పటినుంచో ఊరిస్తూ వచ్చిన దానికి పేరు పెట్టింది.దీని పేరే మార్ష్‌మలో

ప్రతి సారి చాక్లెట్ పేరే

ప్రతిసారి ఏదో ఓ చాక్లెట్ పేరును తన ఆండ్రాయిడ్ వెర్షన్లకు పెట్టే గూగుల్...ఈ సారి విడుదల చేసే సరికొత్త వెర్షన్‌కు కూడా ఓ పేరు ఎంపిక చేసుకుంది. ఈ కొత్త పేరు మార్ష్‌మలో.ఇది కూడా ఒక లాంటి చాక్లెట్ కావడం విశేషం.ఇప్పటివరకూ గూగుల్ తన ఆండ్రాయిడ్ వెర్షన్లకు పెట్టిన పేర్లు చాలావరకు భారతీయులకు బాగా తెలిసినవే.అందుకే అందరికీ బాగా తెలిసున్న ఈ మార్ష్‌మలోను ఈ సారి ఆండ్రాయిడ్ వెర్షన్ గా ఎంచుకున్నారు.

చాక్లెట్ అంటే చాలా మోజు

ఇంతకు ముందు 4.0 వెర్షన్ కు ఐస్‌క్రీం శాండ్ విచ్, 4.1 కు జెల్లీ బిన్.4.4కు కిట్ క్యాట్,5.0కు లాలీపాప్ అనే పేర్లను గూగుల్ ఎంపిక చేసుకుంది.ఇవన్నీ కూడా పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికీ బాగా నచ్చిన చాక్లెట్లే. అందుకే ఈ సారి కూడా అందరికీ నచ్చే అందరూ మెచ్చే పేరును గూగుల్ ఎంపిక చేసుకుంది.

కొత్త వెర్షన్ అదిరింది

ఈ కొత్త వెర్షన్‌లో ప్రధానంగా ఫింగర్ ఫ్రింట్ సెన్సర్లు,అప్ డేట్ చేసిన పవర్ సేవింగ్ మోడ్ ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఏవైనా యాప్ లను అప్ గ్రేడ్ చేయాలంటే ఆటోమేటిగ్గా కాకుండా యూజర్ అనుమతితో మాత్రమే చేసేలా ఈ కొత్త వెర్షన్ స్ట్రీమ్ లైన్ చేస్తుందని గూగుల్ చెబుతోంది.

కొత్త వెర్షన్ వీడియో ఇదే

కొత్త వెర్షన్ వీడియోనూ గూగుల్ అందించింది 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google has finally, physically unveiled the official name for its new operating system (still sans a version number): it's marshmallow! Googler Alex Ruiz just posted a picture of the statue over at Building 43 at Google HQ in Mountain View.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot