సత్యం...శివం...సుందరం

Written By:

లోకాన్ని పాలించేది ఆ త్రిమూర్తులు అయితే ఇండియాలో పుట్టి ప్రపంచాన్ని పాలిస్తున్నారు ఈ త్రిమూర్తులు.ఇంతకీ ఎవరా ఆ త్రి మూర్తులు అనుకుంటున్నారా..ఇంకెవరు ఐటీలో ప్రపంచాన్ని శాసిస్తున్న మూడు కంపెనీలకు అధిపతులు.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల,అలాగే హెచ్ సీఎల్ కంపెనీలో దుమ్ము దులుపుతున్న శివనాడార్తో పాటు ఈ మధ్యనే గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సుందర్ పిచాయ్.ఈ త్రి మూర్తులపై ఓ టెక్ లెక్ వేద్దాం..

Read more : మోడీ.. ఏమిటీ ఈ సెల్పీల దాడి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్... ఈ కంపెనీది 38 ఏళ్ల చరిత్ర...సత్య రాకముందు 38 ఏళ్లలో ఒక్క భారతీయుడు కూడా మైక్రోసాఫ్ట్ లో అత్యున్నత శిఖరాలను అధిరోహించలేదు. కోట్లకు పడగలెత్తిన బిల్ గేట్స్ కు వారసులు ఎప్పడూ ఫారిన్ వాళ్లే ఉండేవారు.

సత్య నాదెళ్ల

అయితే సత్య నాదెళ్ల ఆగమనంతో ఒక్కసారిగా భారతీయ కీర్తి పతాకంలో ఓ మైలు రాయి చేరింది. బిల్ గేట్స్ వారసుడిగా మైక్రోసాఫ్ట్ సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.తెలుగు జాతి సత్తాను ప్రపంచానికి పరిచయం చేశారు.

సత్య నాదెళ్ల

38 ఏళ్ల చరిత్ర ఉన్న మైక్రోసాఫ్ట్ లో బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత 3వ సీఈఓగా సత్యనాదెళ్ల బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న నాదెళ్ల మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేశారు.

సత్య నాదెళ్ల

ఆ తర్వాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ లో కంప్యూటర్ సైన్ష్ లో మాస్టర్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ఏంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన వార్షిక జీతం రూ.525 కోట్లు. ఇది ఓ తెలుగోడి సత్తా

శివనాడార్

1976లోనే టెక్ పటాలెక్కిన మరో భారతీయుడు శివనాడార్. 1945లో తమిళనాడులోని తూతుకుడి జిల్లా తిరుచెందూరుకు 10 కిలో మీటర్ల సమీపంలో మూలైపొజి గ్రామంలో శివనాడార్‌ జన్మించారు. కుంభకోణంలో పాఠశాల విద్య అభ్యసించారు.

శివనాడార్

మధు రైలోని ద అమెరికన్‌ కాలేజ్‌లో ప్రీ యూనివర్సిటీ డిగ్రీ, కోయంబత్తూర్‌లోని పీఎస్‌జీ కాలేజీ ఆఫ్‌ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ చేశారు. పూణలో వాల్‌ చంద్‌ క్రూపర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో కెరీర్‌ ప్రారంభించారు.

శివనాడార్

ఆ తర్వాత స్నేహితులతో కలిసి 1976లో హెచ్‌సిఎల్‌ను స్థాపించారు. ఐటీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా నాడార్‌కు 2008లో పద్మభూషణ్‌ అవార్డు వరించింది. ఇప్పుడు ప్రపంచ టాప్ 20 కుబేరుల్లో శివనాడార్ 14వ స్థానంలో ఉన్నారు .నాడార్ సంపద విలువ దాదాపు 14.4 బిలియన్ డాలర్లు.. ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 88వేల కోట్ల రూపాయలు.

శివనాడార్

భక్తి గుణాలు ఎక్కువగా ఉన్న శివనాడార్ తిరుపతిని అనేక సార్లు దర్శించుకున్నారు. అక్కడికి వెళ్లారంటే ఎంతో సాదాసీదాగా ఉంటారు.కోట్లు ఉన్నా అవన్నీ కూటి కొరకే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. విద్యారంగంలోనూ నాడార్‌ విరాళాలు ఇస్తూ విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేస్తున్నారు.

సుందర్ పిచాయ్

గూగుల్ లో అత్యున్నత పదవిని అలంకరించిన మరో భారతీయుడు సుందర్. ఈయన కూడా తమిళనాడుకు చెందిన వాడే. 43 ఏళ్ల పిచాయ్ ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్, వార్టస్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఏంబీఏ పట్టా అందుకున్నారు.

సుందర్ పిచాయ్

2004లో గూగుల్ లో సాధారణ ఉద్యోగిగా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. గూగుల్ క్రోమ్, గూగుల్ మ్యాప్స్,గూగుల్ స్టోర్స్,ఆండ్రాయిడ్ అప్లికేషన్లతో పాటు మరిన్ని అప్లికేషన్లలో సుందర్ కీలక పాత్ర పోషించారు.

సుందర్ పిచాయ్

ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఒకానొక దశలో సత్య నాదెళ్లకే పోటీనిచ్చారు సుందర్. మొబైల్ మార్కెట్లో వెనుకబడ్డ మైక్రోసాఫ్ట్ సమర్థుడైన వారి కోసం వెతుకుతున్న సమయంలో సుందర్ వారి దృష్టిని ఆకర్షించారు. అటువంటి దశలో గూగుల్ సుందర్ ని వదులుకోవడానికి ఇష్టపడకపోవడం అలాగే సుందర్ కూడా గూగుల్ లోనే ఉండటంతో మరో సమర్థుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కు సీఈఓ అయ్యారు.

సుందర్ పిచాయ్

రెండు గదుల ఇంటి నుంచి అందరూ కలలు కనే సౌధానికి సుందర్ మారారు. ఇప్పుడు సుందర్ వార్షిక ఆదాయం రూ.310 కోట్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write tech of the world heros satyam sivam sundaram
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot