బ్లాక్ బెర్రీకి బాలీవుడ్ ఫిదా

Written By:

నోకియాకు షారూఖ్ ఖాన్ బ్రాండ్ అయితే ఇంటెక్స్ కు మహేష్ బాబు ఇప్పుడు కార్బన్ కు అక్కినేని అఖిల్...ఇలా ప్రతి స్మార్ట్ పోన్ కు ఓ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ల రాకతో ప్రపంచమే మారిపోయింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఏ స్మార్ట్ ఫోన్లకు ఎవరు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అలాగే ఎవరికి ఏ పోన్ అంటే వల్లమాలిన అభిమానం..తనతో ఎప్పుడూ ఏ పోన్లను వెంట బెట్టుకుని వెళతారు... తెలుసుకోవాలని ఉందా...అయితే ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more:మీ 60 ఏళ్ల ఫోటోను ఇప్పుడే చూడొచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కార్బన్‌ మొబైల్స్‌

కార్బన్‌ మొబైల్స్‌ తన ఉత్పత్తుల ప్రచారం కోసం టాలీవుడ్‌ నటుడు అఖిల్‌ అక్కినేనిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. మూడేళ్లపాటు అఖిల్‌ తమ ఉత్పత్తులకు ప్రచారం చేస్తారని కార్బన్‌ మొబైల్స్‌ చైర్మన్‌ సుధిర్‌ హసిజా తెలిపారు.

ఇంటెక్స్‌

భారతదేశపు రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్‌కు టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ ఉత్పత్తుల ప్రచారం నిమిత్తం ప్రిన్స్ మహేష్‌ను ఇంటెక్స్ సంస్థ ఎంచుకుంది.

ఎల్ జి

ఎల్ జి కు బ్రాండ్ అంబాసిడర్ గా జాన్ అబ్రహం హీరోయిన్ జెనీలియా కొనసాగుతున్నారు.

నోకియా

షారూఖ్ ఖాన్ నోకియా కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎప్పటి నుంచో ఉన్నారు. తన సినిమాల్లో కూడా నోకియా ఫోన్ ను ప్రమోట్ చేసుకుంటూ బిజీగా గడిపేస్తున్నారు.

శ్యాం సంగ్

అమీర్ ఖాన్ కూడా శ్యాం సంగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగారు. అతను ఇప్పడు శ్యాం సంగ్ కు సంబంధించిన పవర్ పుల్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు.

బ్లాక్ బెర్రీ

ఇక సల్మాన్ ఖాన్ బ్లాక్ బెర్రీ కి ఫిదా అయిపోయారు. అతని చేతిలో ఎప్పుడూ బ్లాక్ బెర్రీ ఫోన్ ఉంటుంది. మరి బ్లాక్ బెర్రీకి అంబాసిడర్ గా మారుతారా లేదా అన్నది చూడాలి.

బ్లాక్ బెర్రి

తెలుగులో తన సినిమాలతో సంచలనం రేపుతున్న రామ్ గోపాల్ వర్మ కూడా బ్లాక్ బెర్రికి ఫిదాఅయిన వ్యక్తే. ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా కూడా ఉంటారు.

ఐటెక్స్

ఐటెక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన పర్హానా అక్తర్ కూడా బ్లాక్ బెర్రినే వాడుతారట.సెక్యూరిటీ రీజన్ వల్ల కావచ్చని కొందరు అంటున్నారు.

నోకియా

నోకియాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక చోప్రా నోకియా ఫోన్ అంటే అమితమైన ఇష్టం. కంపెనీతో తనకున్న అనుబంధం నోకియా మీద మనసు పడేలా చేసి ఉండవచ్చని కొందరి అభిప్రాయం.

ఎల్ జి

ఇక ఎల్ జి ఫోన్లను లాంచ్ చేసిన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం బ్లాక్ బెర్రితో పాటు ఐ ఫోన్ అంటేనే ఎక్కువ మోజట.వాటినే ఆయన ఎక్కువగా వాడుతుంటారు.

ఆపిల్ ఫోన్

ఇక డ్యాన్స్ లో అందాలను ఆరబోసిన మాధురీ దీక్షిత్ ఆపిల్ ఫోన్ అంటే వల్లమాలిన అభిమానం. ఐ ఫ్యాడ్ కూడా ఆపిల్ దే వాడుతుంటుంది. అన్ని ఐ ఆపిల్ కు సంబంధించిన వస్తువులే ఈ అందాల భామ వెంట ఉంటాయి.

బ్లాక్ బెర్రీ

ఇక మున్నాభాయ్ అయితే ఎప్పుడూ బ్లాక్ బెర్రీనే వాడుతుంటారట. సెక్యూరిటీ రీజన్ కోసం బ్లాక్ బెర్రీనే వాడుతుంటారని కొందరు అంటున్నారు.

ప్రీతిజింటా సైతం బ్లాక్ బెర్రీకి ఫిదా

అందాల నటి ప్రీతిజింటా సైతం బ్లాక్ బెర్రీకి ఫిదా అయిపోయిన వ్యక్తే. ఈమెతో పాటు బిపాసా బసు శిల్పా శెట్టి కూడా బ్లాక్ బెర్రీనే వాడుతారట.

బ్లాక్ బెర్రీ

బ్లాక్ బెర్రీకి బ్రాండ్ అంబాసిడర్ గాఉన్న రణబీర్ కపూర్ కూడా తన బ్రాండ్ ఫోన్ బ్లాక్ బెర్రీనే అంటున్నారు. ఎందుకంటే అది మోస్ట్ సెక్యూరిటీని ఇస్తుందని చెబుతున్నారు.

సెల్ కాన్

తమన్నా దేశీయ బ్రాండ్ సెల్ కాన్ అంటే చాలా అభిమానం అందుకే సెల్ కాన్ లాంచ్ సమయంలో ఎప్పుడూ ముందు ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
n this celebrity obsessed culture, people are always interested in knowing more about their favourite famous people, whether it is bollywood celebrities, cricketers or any other famous persons.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot