ఉగ్రవాదుల సైట్లపై వయాగ్రాతో దాడి

Written By:

ఉగ్రవాదులకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి...వారి మూలాలను వేర్లతో సహా పెకిలించేయడానికి అన్ని దేశాలు నడుం బిగించిన విషయం తెలిసిందే. అయితే టెక్నాలజీ పరంగా కూడా ఉగ్రవాదులను హ్యాకర్స్ టార్గెట్ చేసి వారి వెబ్ సైట్లను బ్లాక్ చేస్తున్నారు. అయితే తాజాగా వారి బ్లాక్ లను డార్క్ వెబ్ లోకి తరలించిన హ్యాకర్స్ వారి వెబ్ సైట్ల పైన వయాగ్రా యాడ్ ను ఉంచారు..ఈ దెబ్బతో ఉగ్రవాదులకు దిమ్మతిరిగినట్లేనని తెలుస్తోంది. ఆసక్తి రేపుతున్న కథనం స్లైడ్స్ లో

Read more : నీ వెన్నుపోటు దురాగతాలు మానుకో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గుర్తు తెలియని టెక్కీలు ఐఎస్‌ఐఎస్ ప్రధాన వెబ్ సైట్లలో

గుర్తు తెలియని టెక్కీలు ఐఎస్‌ఐఎస్ ప్రధాన వెబ్ సైట్లలో ఒక దాన్ని హ్యాక్ చేసి అందులో వయాగ్రా మాత్రల ప్రకటనలు ఉంచారు. ఈ యాడ్ చూసి మిమ్మల్ని ఉత్సాహపరుచుకోండి. మేము మా మౌళిక వసతులను మరింతగా పెంచుకుని ఐఎస్‌ఐఎస్ చెప్పాలనుకున్న దాన్ని ఇంకా గట్టిగా చెబుతామంటూ ఆ పేజీలో వ్యాఖ్యానిస్తూ టూ మచ్ ఐఎస్‌ఐఎస్ అని టైటిల్ ఉంచారు.

ఓ ఆన్ లైన్ ఫార్మసీ యాడ్ ను ఈ పేజీలో చేర్చారు

ఓ ఆన్ లైన్ ఫార్మసీ యాడ్ ను ఈ పేజీలో చేర్చారు.మిగతా ఉగ్రవాదులకు చెందిన సమాచారాన్ని చేరిపేశారు.కాగా ఇప్పటికే పలు ఐఎస్‌ఐఎస్ వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురికాగా మరెన్నో సైట్లు డార్క్ వెబ్ లోకి తరలిపోయాయి.

జర్నలిస్టులను తలనరికి చంపేస్తున్న వీడియోలూ

జర్నలిస్టులను తలనరికి చంపేస్తున్న వీడియోలూ, తమ సంస్థలో చేరాలంటూ ప్రకటనలూ కనిపించే కిరాతక తీవ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్' వెబ్ సైట్లో ప్రస్తుతం వయాగ్రా మాత్రల అడ్వర్టైజ్ మెంట్ దర్శనమిస్తోంది..!

అనామక హ్యాకర్లు ఐఎస్ సంస్థ వెబ్ సైట్ ను

కొంత మంది గుర్తు తెలియని అనామక హ్యాకర్లు ఐఎస్ సంస్థ వెబ్ సైట్ ను హ్యాక్ చేసి ఈ విధంగా వయాగ్రా అడ్వర్టైజ్ మెంట్ ను పోస్టు చేశారు. ఈ మాత్రలు కావాలంటే సంప్రదించాలంటూ ఓ ఆన్ లైన్ మందుల విక్రయ సంస్థ అడ్రస్ కూడా ఉంచారు.

ఐఎస్ చేస్తున్న విచిత్రమైన ప్రచారాన్ని

తమ సంస్థలో చేరేవారికి పెళ్ళి చేసుకునేందుకు యువతులను, ఉద్యోగాన్ని, మంచి జీవితాన్ని ఇస్తామంటూ ఐఎస్ చేస్తున్న విచిత్రమైన ప్రచారాన్ని ఎగతాళి చేస్తూ ఈ విధంగా చేశారు హ్యాకర్లు.

ఈ ప్రకటన చూసి నిరుత్సాహపడకండి

‘అలాగే నిశ్శబ్ధంగా ఉండండి..' అంటూ హోంపేజీలో కనిపించిన సందేశంతో పాటు వయాగ్రా అడ్వర్టైజ్ మెంట్ ను, ఓ విచిత్రమైన సందేశాన్ని కూడా వీరు ఉంచారు. ‘ఈ ప్రకటన చూసి నిరుత్సాహపడకండి.. మౌళిక వసతులను మెరుగుపరుచుకుని, ఐఎస్ఐఎస్ కంటే మంచి సౌకర్యాలను కల్పించేందుకు మేం కృషి చేస్తాం..' అంటూ ఎగతాళి వ్యాఖ్యను ఉంచారు.

చివర్లో ‘టూ మచ్ ఐఎస్ఐఎస్..!

చివర్లో ‘టూ మచ్ ఐఎస్ఐఎస్..!' అంటూ ఐఎస్ సంస్థ చేస్తున్న ప్రచారాన్ని వెక్కరించారు. ప్రకటనతో పాటు మందులు కొనుగోలు చేసి రుసుము కూడా చెల్లించేందుకు హ్యాకర్లకే చెందిన మరో సంస్థ లింక్ ను కూడా అందులో ఉంచారు.

ఐఎస్ వెబ్ సైట్ ను పూర్తిగా హ్యాక్ చేసిన

ఐఎస్ వెబ్ సైట్ ను పూర్తిగా హ్యాక్ చేసిన ఈ గుర్తు తెలియని హ్యాకర్లు.. ఒక రోజు పాటు పూర్తిగా బ్లాక్ చేసి, తిరిగి తమ ఆధీనంలో నుంచి వదిలిపెట్టారు. అనంతరం ఈ రకమైన ప్రకటన వెబ్ సైట్లో దర్శనమిస్తోంది.

ముస్లిం యువతను ఆకర్షించడానికి

అయితే ఇంతకు ముందు ఉగ్రవాదం వైపు ముస్లిం యువతను ఆకర్షించడానికి ఉగ్రవాదులు అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం. అలాగే ఉద్యోగం ఇస్తామంటూ ప్రకటనలు గుప్పించిన విషయం విదితమే. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు లేటెస్ట్ అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.  https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Anonymous group takes down Isis website replaces it with Viagra ad and message to calm down
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot