నీ వెన్నుపోటు దురాగతాలు మానుకో..

Written By:

టర్కీ సైన్యం రష్యా యుద్ధవిమానాన్ని కూల్చివేసిన ఘటనపై రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ భూభాగంలో ప్రవేశించిన రష్యా యుద్ధవిమాన పైలెట్లకు పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినా వారు పట్టించుకోకపోవడంతోనే కూల్చివేశామని టర్కీ బల్లగుద్దీమరీ చెబుతోంది.అయితే ఈ ప్రకటనను రష్యా తప్పుపట్టింది. తమ విమానం టర్కీ భూభాగంలో ప్రవేశించకపోయినా కూల్చివేశారంటూ... ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇలా కూల్చడం టర్కీకి తగదని ముందు ముందు దీనిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ హెచ్చరికలకు ఊతమిస్తూ రష్యా తన ఎయిర్ ఢిపెన్స్ మిస్సైల్స్ ను ఇప్పుడు సిరియాకి తరలించింది. మిగతా కథనం స్లైడర్‌లో

Read more: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అవుట్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ సైన్యం పేల్చివేసిన తరువాత

రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ సైన్యం పేల్చివేసిన తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింతగా పెరిగింది. ప్రత్యక్ష యుద్ధానికి దిగబోమని అటు రష్యా, ఇటు టర్కీలు ప్రకటించినప్పటికీ, పరిస్థితి చేతులు దాటేలా ఉందని తెలుస్తోంది. సిరియాలోని రష్యన్ బేస్ కు లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైళ్లను రష్యా తరలించింది.

తమ యుద్ధ విమానాలను కూల్చాలని చూస్తే

ఇకపై తమ యుద్ధ విమానాలను కూల్చాలని చూస్తే, పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, తాము కూడా మిసైళ్లను పేలుస్తామని రష్యన్ మిలటరీ వర్గాలు హెచ్చరించాయి. ఇక నాటోలో సభ్యత్వం ఉన్న ఓ దేశం, మరో దేశపు విమానాన్ని పేల్చడం గడచిన 50 ఏళ్లలో ఇదే తొలిసారి.

మా గగనతలాన్ని ఉల్లంఘించారని

మా గగనతలాన్ని ఉల్లంఘించారని అందుకే టర్కీ ఎఫ్‌ 16 విమానాలు ఆ యుద్ధ విమానాన్ని హెచ్చరించినట్లు టర్కీ అధికారి తెలిపారు. ఆ యుద్ధ విమానం రష్యా తయారీ ఎస్‌యు-24 అని ఇప్పటికి పది సార్లకు పైగా రష్యాను హెచ్చరించామని అయినా ఫలితం లేకపోయిందని టర్కీ అధ్యక్ష భవన వర్గాలు తెలిపాయి.

తాము గగనతలాన్ని ఉల్లంఘించలేదని

అయితే తమ భూభాగంలోకి ప్రవేశించడంతోనే కూల్చివేశామని టర్కీ అధికారులు ప్రకటించడాన్ని రష్యా తప్పుపట్టింది. తాము గగనతలాన్ని ఉల్లంఘించలేదని అంతకుముందు రష్యా సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కావాలంటే ఈ విషయాన్ని రుజువు చేస్తామని ప్రకటించింది. సిరియా భూభాగంలో ఉండగాలనే కూల్చివేశారంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మండిపడుతున్నారు.

తోక భాగం నుండి దట్టంగా పొగ వస్తున్న ఫోటోలను

పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయి, తోక భాగం నుండి దట్టంగా పొగ వస్తున్న ఫోటోలను ప్రైవేటు టివి చానెల్‌ ప్రసారం చేసింది. ఉత్తర సిరియాలో సరిహద్దుకు సమీపంలో 'తుర్క్‌మెన్‌ మౌంటెన్‌' అనే ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది. సిరియాలో టర్కీ జాతీయులపై జరుగుతున్న దాడుల గురించి చర్చించేందుకు వారంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా టర్కీ కోరింది.

వెన్నుపోటుకు పాల్పడిన టర్కీ తీవ్ర పరిణామాలు

వెన్నుపోటుకు పాల్పడిన టర్కీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలకు విఘాతం కలిగించేలా టర్కీ వ్యవహరించిందని మండిపడ్డారు. సిరియా భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై తమ విమానం దాడులు చేస్తున్నప్పుడు ఇలా కూల్చివేయడం టర్కీకి ఏ మాత్రం తగదని రష్యా హెచ్చరించింది.

ఒక పైలట్‌ సిరియా ఉగ్రవాదులకు చిక్కి

కాగా టర్కీ సైనికులు రష్యా యుద్ధవిమాన్ని కూల్చిన వేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక పైలట్‌ సిరియా ఉగ్రవాదులకు చిక్కి మరణించాడు. మరో పైలట్‌ ఉగ్రవాదులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. అతను సురక్షితంగా ఉన్నట్టు రష్యా ప్రకటించింది. సిరియా భద్రతా దళాలు రక్షించినట్టు రష్యా రాయబారి అలెగ్జాండర్‌ ఒర్లోవ్‌ చెప్పారు. అయితే ప్రమాదం నుంచి బయటపడిన ఫైలట్ వాదన మరోలా ఉంది.

రష్యన్ పైలట్ కొన్‌స్తాంతిన్ మురఖ్తిన్

టర్కీ యుద్ధ విమానాలు దాడికి ముందు కనీస హెచ్చరికలు కూడా చేయలేదని ప్రాణాలతో బయటపడిన రష్యన్ పైలట్ కొన్‌స్తాంతిన్ మురఖ్తిన్ పేర్కొన్నారు. సిరియా భూభాగంలో ఉగ్రశిబిరాలపై దాడులకు బయలుదేరిన కొద్దిసేపటికే తమపై టర్క్ విమానాలు దాడి ప్రారంభించాయి. రేడియోలో సంప్రదించే ప్రయత్నం కూడా చేయలేదు. కనీస ప్రమాణాలేవీ పాటించలేదు అని సిరియాలోని రష్యన్ బేస్‌ లో మీడియాకు వెల్లడించారు.

మృతిచెందిన పైలట్‌కు దేశ అత్యున్నత సాహస అవార్డు

కాగా మృతిచెందిన పైలట్‌కు దేశ అత్యున్నత సాహస అవార్డు ‘హీరో ఆఫ్ రష్యా'ను పుతిన్ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సిరియాకు ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లను తరలించాలని ఆదేశించారు. టర్కీపై యుద్ధాన్ని ప్రకటించబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ పేర్కొన్నారు.

మరోవైపు అమెరికా పర్యటనలో

మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు.. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చల సందర్భంగా టర్కీలో రష్యా యుద్ధవిమానం కూల్చివేత అంశం ప్రస్తావనకు వచ్చింది. సిరియా అధ్యక్షుడు అసద్‌ అధికారం నుంచి దిగిపోలని టర్కీ కోరుతోంది. కానీ రష్యా మాత్రం అసద్‌కు మద్దతు ఇస్తోంది. ఈ అంశం మీదనే వారు ఎక్కువగా చర్చలు జరిపారు.

రష్యా యుద్ధవిమానం కూల్చివేతకు ఇదో కారణమై

రష్యా యుద్ధవిమానం కూల్చివేతకు ఇదో కారణమై ఉండొచ్చన్న అంశం ఒబామా, హోలెండే మధ్య చర్చకు వచ్చింది. ఐఎస్‌ ఉగ్రవాదులను అణచివేసే అంశంపై కూడా ఇద్దరు అధ్యక్షులు చర్చించారు. ఈ విషయంలో రాజీలేని ధోరణి అవలంభించాలని వారు నిర్ణయించారు.

అయితే రష్యా మాత్రం ఈ ఘటనను చాలా సీరియస్ గా

అయితే రష్యా మాత్రం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టర్కీ వెన్నుపోటు పొడించిందని కారాలు మిరియాలు నూరింది. ఇంకా విమానం కూల్చి వేత ఘటనలో అమెరికా పాత్ర కూడా ఉన్నట్లు రష్యా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఘటనపై స్పదించారు.

తన భూభాగాన్ని, గగన తలాన్ని కాపాడుకునే హక్కు

తన భూభాగాన్ని, గగన తలాన్ని కాపాడుకునే హక్కు టర్కీకి ఉందన్న ఒబామా.. యుద్ధ విమానం కూల్చివేత విషయంలో టర్కీ, రష్యా దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతను తాను ప్రోత్సహించడంలేదని, ఈ విషయంపై రష్యా, టర్కీ మాట్లాడుకొని నిజంగా ఏంజరిగిందో చర్చించుకుని తీవ్ర పరిణామాలకు తావులేకుండా చూడడం తమముందున్న తక్షణ కర్వవ్యమని ఒబామా అభిప్రాయపడ్డారు.

పరిస్థితి విషమిస్తుండటంతో

అయితే టర్కీ తమను వెన్నుపోటు పొడిచిందని.. పరిణామాలు సీరియస్ గా ఉంటాయని రష్యా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. అందులో భాగంగా రష్యా పౌరులెవరూ.. టర్కీని సందర్శించవద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే పరిస్థితి విషమిస్తుండటంతో రష్యాలో టర్కీ.. టర్కీలో రష్యా రాయబారులను పిలిపించి మందలించాయి ఆయా ప్రభుత్వాలు.

తమ యుద్ధ విమానాన్ని కూల్చేయడమంటే

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు వెళ్తున్న తమ యుద్ధ విమానాన్ని కూల్చేయడమంటే కచ్చితంగా ఉగ్రవాదులకు ఒక దేశ సైన్యం రక్షణ కల్పించడమేనని రష్యా అధ్యక్షులు పుతిన్‌ ఘాటుగా విమర్శించారు.

ఈ ప్రాంతంలో అధిక భాగం రష్యా నుంచి వెళ్లినవారేనని

సిరియాలోని లటాకియా ప్రావిన్సులో ఉగ్రవాదులను లక్ష్యం చేసుకొని తమ యుద్ధ విమానం వెళ్లిందని..ఈ ప్రాంతంలో అధిక భాగం రష్యా నుంచి వెళ్లినవారేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. వారిని కాపాడుకునే దిశలో మా యుద్ధవిమానం అక్కడికి వెళిందని పుతిన్ చెబుతున్నారు.

చమురు స్మగ్లింగ్‌ ద్వారానే కాకుండా ఇప్పుడు ఏకంగా

దీంతో పాటు సిరియాలో ఉగ్రవాదుల నియంత్రణలోని ప్రాంతం నుంచి చమురు టర్కీకి చేరుతోందని ఆయన చెప్పారు. చమురు స్మగ్లింగ్‌ ద్వారానే కాకుండా ఇప్పుడు ఏకంగా ఒక దేశం యొక్క సైన్యం నుంచి ఐఎస్‌కు రక్షణ లభిస్తోందని పరోక్షంగా టర్కీపై పుతిన్‌ నిప్పులు చెరిగారు. అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలు రక్తపాతం పారించడం వెనుక ఇదే కారణమని పుతిన్ టర్కీపై మండిపడ్డారు.

రష్యా, టర్కీ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని

ఇలాంటి ఘటనలతో రష్యా, టర్కీ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని హెచ్చరించారు. అంతే కాకుండా టర్కీ నాటో సమావేశంపై మండి పడ్డారు. వాస్తవానికి టర్కీ తమను సంప్రదించకుండా నేరుగా నాటో సమావేశం ఏర్పాటు చేయాలని కోరడం దుర్మార్గమన్నారు. దీనర్థం ఐఎస్‌కు అండదండలందివ్వాలని నాటోను టర్కీ కోరడమేనని పుతిన్‌ వాపోయారు.

అక్కడ యుద్ధమేఘాలు

రష్యా ఈ పరిణామాలతో ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది. అందులో భగంగా అత్యాధునికి ఎయిర్ ఢిపెన్స్ మిస్సైల్స్ ను సిరియాకు తరలించడంతో అక్కడ యుద్ధమేఘాలు కమ్మకునేలా ఉన్నాయి.

అయితే చేసిన దురాగతానికి సమాధానం

ఇతర దేశాల ప్రాంతీయ ప్రయోజనాలను రష్యా గౌరవిస్తుందని, అయితే చేసిన దురాగతానికి సమాధానం చవిచూడకుండా టర్కీ తప్పించుకోజాలదని పుతిన్‌ హెచ్చరించారు. మరి ఈ మాటల యుద్ధం ఇంతటితో ముగుస్తుందా లేక ముందు ముందు టర్కీ రష్యా మధ్యల మరింతగా రాజుకుంటుందా అనేది ముందు ముందు చూడాలి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.  https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Putin sends air-defense missiles to Syria to deter Turkey
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot