బ్లైండ్‌స్పాట్: అన్నీ నగ్న ఫోటోలు,చంపేస్తామంటూ బెదిరింపులే

By Hazarath
|

ఇద్దరు వ్యాపార వేత్తలు తమ అవసరాల కోసం సృష్టించిన యాప్ ఇప్పుడు వారికి చుక్కలు చూపిస్తోంది. ఈ యాప్ ద్వారా ఇప్పుడు ఆ వ్యాపార వేత్తలు ఏం చేయాలిరా దేవుడా అంటూ జుట్టు పీక్కుంటున్నారు. ఆ యాప్ పేరే బ్లైండ్‌స్పాట్.

పేరులోనే గుడ్డి ఉందంటే ఇక యాప్ కూడా ఎంత గుడ్డిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ యాప్‌ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశ రాజకీయ నేతల్ని ముప్ప తిప్పలు పెడుతోంది. మరి ఆ యాప్‌లో ఉన్న స్పెషల్ ఏంటీ.. స్లైడర్ లో చదవండి.

Read more: షాకింగ్ : మిస్సయిన వందేళ్లకు..

విలియం, నిక్కీ మినాజ్ అనే ఇద్దరు వ్యాపారవేత్తలు

విలియం, నిక్కీ మినాజ్ అనే ఇద్దరు వ్యాపారవేత్తలు

ఇజ్రాయిల్‌లో విలియం, నిక్కీ మినాజ్ అనే ఇద్దరు వ్యాపారవేత్తలు నెల రోజుల క్రితం బ్లైండ్‌స్పాట్ పేరుతో ఓ యాప్‌ను ఆవిష్కరించారు.

ఈ యాప్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే

ఈ యాప్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే

ఈ యాప్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇదొక అన్‌నోన్ మెసెంజింగ్ సర్వీస్. తమ అవసరాల కోసం అలాగే ఫ్రీ చాటింగ్ కోసం ఈ యాప్‌ని కనుగొంటే అది ఇప్పుడు వారి మెడకు ఉరితాడులా చుట్టుకుంది.

ఈ యాప్ పేరుకు తగ్గట్టుగానే గుడ్డిగా

ఈ యాప్ పేరుకు తగ్గట్టుగానే గుడ్డిగా

విషయంలోకి వెళ్తే ఈ యాప్ పేరుకు తగ్గట్టుగానే గుడ్డిగా ఉంటుంది. ఈ యాప్ సహాయంతో తెలియని వ్యక్తులకు ఎవరికైనా వాట్సప్ లో పంపినట్లు సందేశాలు, ఫోటోలు, వీడియోలు పంపిచొచ్చు.

ఎక్కడ నుంచి సందేశాలు పంపించారో ట్రేస్ అవుట్ చేయడం

ఎక్కడ నుంచి సందేశాలు పంపించారో ట్రేస్ అవుట్ చేయడం

వాట్సప్‌లో అయితే పంపిన వారి వివరాలు వస్తాయి. కాని ఈ యాప్‌లో అలా కాదు. ఎక్కడ నుంచి సందేశాలు పంపించారో ట్రేస్ అవుట్ చేయడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. ఇక మనుషులకి ఏం సాధ్యం అవుతుంది చెప్పండి.

 ఈ యాప్‌ను ఇప్పటివరకూ 5 లక్షల మందికి పైగా

ఈ యాప్‌ను ఇప్పటివరకూ 5 లక్షల మందికి పైగా

అన్ సెక్యూర్డ్ యాప్ కావడంతో ఈ యాప్‌ను ఇప్పటివరకూ 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌లో పేరు ఊరు లేకపోవడంతో దీనిని ఉపయోగించుకుని సంఘవిద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నాయి.

యువతులకు అసభ్యకర రీతిలో సందేశాలు

యువతులకు అసభ్యకర రీతిలో సందేశాలు

మరి కొందరు సైబర్ నేరగాళ్లు అయితే దొరికిందే సందని యువతులకు అసభ్యకర రీతిలో సందేశాలు, ఫోటోలు, వీడియోలు పంపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.

ఏకంగా అమ్మాయిల నగ్న భంగిమలతో కూడిన చిత్రాలు

ఏకంగా అమ్మాయిల నగ్న భంగిమలతో కూడిన చిత్రాలు

ఇదంతా ఓ షాక్ అయితే మరి కొందరు ఏకంగా అమ్మాయిల నగ్న భంగిమలతో కూడిన చిత్రాలు పంపిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారు. ఈ వేధింపులు తాళలేక కొందరు యువతులు లోలోన భాదపడుతుంటే, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

ఇక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి

ఇక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి

ఇక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎవరు పంపించారో ట్రేస్ అవుట్ చేయడం సాధ్యం కాని పని. కాబట్టి వారు కూడా ఏం చేయలేరు.

 రాజకీయ నాయకుల సంగతైతే

రాజకీయ నాయకుల సంగతైతే

సామాన్యుల సంగతే ఇలా ఉంటే ఇక రాజకీయ నాయకుల సంగతైతే చెప్పనక్కర్లేదు. ప్రత్యర్థుల నుంచి వచ్చే బెదిరింపు సందేశాలతో వారంతా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయంతో చస్తున్నారు.

అక్కడి రాజకీయ నాయకులకు చుక్కలు

అక్కడి రాజకీయ నాయకులకు చుక్కలు

ఇక్కడ కాదు గాని ఇజ్రాయెల్‌లో ఈ యాప్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. అక్కడి రాజకీయ నాయకులకు చుక్కలను చూపిస్తోంది. చంపేస్తామంటూ బెదిరింపు సందేశాలు వస్తున్నాయి. ఏకంగా పార్లమెంట్‌లోనే ఈ యాప్‌పై చర్చలు జరిపారు కూడా.

ఈ యాప్‌ను ఇజ్రాయిల్ పార్లమెంట్ కమిటీ

ఈ యాప్‌ను ఇజ్రాయిల్ పార్లమెంట్ కమిటీ

ఈ యాప్‌ను ఇజ్రాయిల్ పార్లమెంట్ కమిటీ తీవ్రంగా విమర్శించింది. యాప్ ఓనర్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందంటే నమ్మండి. ఇక ఈ యాప్‌ను బ్యాన్ చేయాలని రాజకీయ నాయకులంతా గళం విప్పుతున్నారు.

ఈ యాప్‌ను తయారు చేసిన షలెనో గ్రూప్ లిమిటెడ్ వారు మాత్రం

ఈ యాప్‌ను తయారు చేసిన షలెనో గ్రూప్ లిమిటెడ్ వారు మాత్రం

అయితే ఈ యాప్‌ను తయారు చేసిన షలెనో గ్రూప్ లిమిటెడ్ వారు మాత్రం అందరూ ఫ్రీగా చాట్ చేసుకోవడానికి మాత్రమే ఈ యాప్ ను రూపొందించామని ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదని చెబుతున్నారు

దీని దెబ్బకు అందరూ భయపడి

దీని దెబ్బకు అందరూ భయపడి

దీని దెబ్బకు అందరూ భయపడి గూగుల్ ప్లే లో రేటింగ్ కూడా ఇవ్వడం మానేశారు. ఇది కేవలం 2.2 రేటింగ్ ని సాధించింది ఇందులో దాదాపు 4000 దాకా సింగిల్ స్టార్ ను ఇచ్చారు.

అసలే ఇజ్రాయిల్‌లో కట్టుదిట్టమైన నిఘా

అసలే ఇజ్రాయిల్‌లో కట్టుదిట్టమైన నిఘా

అసలే ఇజ్రాయిల్‌లో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. అలాంటి చోటే ఇలాంటి యాప్ ఉపయోగిస్తున్నారంటే, మన దేశంలో ఈ యాప్ ఉపయోగించకుండా ఉండరు కదా..

అదృష్టం కొద్దీ ఇండియాలో

అదృష్టం కొద్దీ ఇండియాలో

అదృష్టం కొద్దీ ఇండియాలో ఇలాంటి పోకడలు లేవు. ఒకవేళ వస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి అందరూ వీలైనంత అలర్ట్ గా ఉండటం మంచిది.

Best Mobiles in India

English summary
Here Write Anonymous messaging app stirs controversy in Israel

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X