షాకింగ్ : మిస్సయిన వందేళ్లకు..

Written By:

ఆ ఓడ 100 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయింది. అదీ ఎప్పుడో తెలుసా మొదటి ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయంలో..జర్మనీ సైనికులు ఆ ఓడలో ప్రయాణిస్తూ జర్మనీ సైనికులు మిస్సయ్యారు. వారి జాడ ఇప్పటివరకు తెలియలేదు. అయితే ఈ మధ్య ఓ సర్వే బృందం ఈ ఓడను కనుగొంది. ఆ ఓడతో పాటు అందులో సైన్యానికి చెందిన ఆయుధాలు కూడా కనుగొన్నారు. దీనిపై ఓ లుక్కేద్దాం.

Read more: తమ శక్తులతో సైన్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సముద్రంలో మునిగిపోయిన ఓ ఓడను

సముద్రంలో మునిగిపోయిన ఓ ఓడను ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందేళ్ల తర్వాత గుర్తించారు. ఆ సబ్ మెరైన్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా గుర్తించే స్థితిలో ఉండటం గమనార్హం.

అందులోని ఆయుధాలు

అందులోని ఆయుధాలు పాక్షికంగానే ధ్వంసమయ్యాయి. అయితే అప్పటి ఆయుధాలను ఇప్పుడు వాడటం కుదకరపోవచ్చునని ఈ ఓడను వెలుగులోకి తెచ్చిన స్కాట్లాండ్ పునరుత్పాదక ఇంధన సంస్థ తెలిపింది.

మొదటి ప్రపంచ యుద్ధంలో

మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైనికులు ఈ పెద్ద ఓడలో ప్రయాణించారు. ఇందులోని ప్రయాణించిన వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

ఈస్ట్ ఆంగ్లియన్ తీరానికి 55 మైళ్ల దూరంలో

ఈస్ట్ ఆంగ్లియన్ తీరానికి 55 మైళ్ల దూరంలో నీటి కింద సుమారు వంద అడుగుల లోతులో ఉన్న ఈ 'యూ-బోట్' భాగాలను స్కాట్లాండ్ కు చెందిన సర్వే కంపెనీ బృందం గుర్తించారు.

ఈ షిప్పును పేల్చివేయడంతో మునిగిపోయి ఉండొచ్చునని

ఈ షిప్పును పేల్చివేయడంతో మునిగిపోయి ఉండొచ్చునని, 1915లో తొలి ప్రపంచ యుద్ధంలో భాగంగా ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

గ్రేటర్ లండన్ కంటే నాలుగు రెట్ల అధిక వైశాల్యం ఉన్న

గ్రేటర్ లండన్ కంటే నాలుగు రెట్ల అధిక వైశాల్యం ఉన్న సముద్రజలాల్లో సుమారు రెండు సంవత్సరాల పాటు అన్వేషించి ఈ షిప్పును గుర్తించారు.

జర్మనీ సబ్ మెరైన్ 'యూ-31' అని

మొదటగా దీనిని 1940, జూన్లో అదృశ్యమైన డచ్ మిలిటరీ సబ్ మెరైన్ అని భావించారు. చివరికి జర్మనీ సబ్ మెరైన్ 'యూ-31' అని నిర్ధారించుకున్నారు.

జనవరి 13, 1915న జర్మనీ తూర్పు తీరంలో

జనవరి 13, 1915న జర్మనీ తూర్పు తీరంలో గస్తీకి వెళ్లిన ఈ నౌక మళ్లీ కనిపించలేదు. అయితే ఇప్పుడు ఇది కనిపించడంతో ఇది అప్పుడు కనపడకుండా పోయిన యూ 31 షిప్పుగానే నిర్థారించారు. దాని ఆనవాళ్లు కూడా అలాగే ఉన్నాయి.

ఈ ఓడ శకలాలను గుర్తించడం నిజంగా చాలా

ఈ ఓడ శకలాలను గుర్తించడం నిజంగా చాలా ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని రేకెత్తించిందని స్కాట్లాండ్ పవర్ గ్రూపు ప్రాజెక్టు డైరెక్టర్ చార్లీ జార్డాన్ తెలిపారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Divers find wreckage of German World War One submarine which was sunk by a mine off East Anglia in 1915 with 31 crew on board
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot