ఇకపై నో మనీ ఓన్లీ కార్డు..ఏపీ బస్సుల్లో కార్డు స్వైపింగ్ ఆప్షన్..

Written By:

డిజిటల్ రంగంలో దూసుకుళ్లేందుకు అన్ని రకాలుగా నవ్యాంధ్ర రెడీ అవుతోంది. నోట్ల రద్దు దెబ్బతో సామాన్యులకు ప్రయాణాలు చేయాలంటే చాలా కష్టంగతయారైంది. అయితే ఇప్పుడు ఆ కష్టాలకు చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రయాణాల్లో మీరు కార్డు స్వైప్ చేయడం ద్వారా మీరు టికెట్ ని పొందవచ్చు. ఏపీలో అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకు ఇది వర్తించనుంది.

జియో సిమ్ వాడితే రూ. 27 వేల బిల్లు..నిజమెంత..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ-పాస్ యంత్రాలను

ఆంధ్రప్రదేశ్ లోని పలు బస్టాండ్లలో ఈ-పాస్ యంత్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. పలు బస్టాండ్లలోని రిజర్వేషన్ కార్యాలయాలతో పాటు, నాన్ స్టాప్ బస్ సర్వీసు కౌంటర్ల వద్ద ఈ యంత్రాలను వాడుతున్నారు.

కార్డులను స్వైప్ చేయడం ద్వారా

టికెట్లు కావాల్సిన వారు డబ్బులు లేవనే బెంగ లేకుండా ఈ -పాస్ యంత్రాల్లో తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను స్వైప్ చేయడం ద్వారా టికెట్ ను తీసుకుని ప్రయాణం చేయవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దూరప్రాంత బస్ డ్రైవర్లకు

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, త్వరలో దూరప్రాంత బస్ డ్రైవర్లకు కూడా ఈ-పాస్ యంత్రాలను అందించనున్నట్టు తెలిపారు.

ఈ-పాస్ యంత్రాలనూ

సెర్ప్, మెప్మా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, అన్ని ఈ-పాస్ యంత్రాలనూ ఆర్టీసీకి వినియోగించాలని సూచించారు. ఇకపై ప్రయాణం మరింత సులువవుతుందని తెలిపారు.

మరో వారం రోజుల్లో

మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఇప్పుడు విజయవాడ బస్టాండ్ లో ఈ సర్వీసు అందుబాటులో ఉందని అలాగేకృష్ణా, గుంటూరు జిల్లాల్లో 50 మెషీన్లను అందుబాటులో ఉంచామని మరో వారం రోజుల్లో అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకూ మెషీన్లను అందిస్తామని తెలిపారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Purchasing a bus ticket in AP is as simple as swiping a credit/debit card now, all thanks to EPOS machines read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting