నవ్యాంధ్రకు మొబైల్ కంపెనీల పరుగులు

By Hazarath
|

దేశవాలీ మొబైల్ దిగ్గజాలు మైక్రోమ్యాక్స్,సెల్‌కాన్, కార్బన్ సంస్థలు చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో సెల్‌ఫోన్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు ఏపీ సర్కారుతో ఈ మూడు కంపెనీలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పరిశ్రమల శాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఆయా కంపెనీల ప్రతినిధులు సీఎం చంద్రబాబు సమక్షంలో డీల్స్ పై సంతకాలు చేశారు. ఈ మూడు సెల్ ఫోన్ కంపెనీలు ప్రారంభమైతే 7 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు వివరించారు. విమానాశ్రయానికి దగ్గరగా పరిశ్రమలు ఉండాలని భావించిన తరువాతనే ఈ సంస్థలు చిత్తూరు జిల్లాను ఎంచుకున్నాయని ఆయన అన్నారు.

Read more :ఏపీలో జియోని కోట్ల పెట్టుబడులు

అవగాహనా ఒప్పందంపై సంతకాలు

అవగాహనా ఒప్పందంపై సంతకాలు

సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు

పూర్తిగా స్వదేశీ పరిజ్ఙానంతో తయారైన మొట్టమొదటి మొబైల్

పూర్తిగా స్వదేశీ పరిజ్ఙానంతో తయారైన మొట్టమొదటి మొబైల్

ఇప్పటికే ఏపీలో చైనా మొబైల్ సంస్థ జియోమి తన జియోమి ఫోన్ ను ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఙానంతో తయారైన మొట్టమొదటి మొబైల్ ఇదే 

మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోసం..

మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోసం..

మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోసం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో గ్జియోమి ఉత్పత్తి యూనిట్ ప్రారంభించనున్నట్లు కంపెనీ సీఈఓ చెబుతున్నారు 

ఫాక్స్‌కాన్‌తో చేతులు

ఫాక్స్‌కాన్‌తో చేతులు

ఇక మరొక చైనా స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం జియోనీ.. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్‌ ఫోన్ల తయారీకి సిద్ధమైంది. ఈ మేరకు శ్రీసిటీలో ప్లాంట్‌ ఏర్పాటు చేసిన ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది.

 

 

నెలకు 12 లక్షలకు పైగానే

నెలకు 12 లక్షలకు పైగానే

ఈ రెండు సంస్థలు కూడా వచ్చే నెల నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తాయని జియోనీ వెల్లడించింది. నెలకు 12 లక్షలకు పైగా మొబైల్‌ ఫోన్లను తయారు చేసే సామర్థ్యం ఈ కంపెనీలకు ఉందని తెలిపింది. 

 

 

జియోనీ రూ. 330 కోట్ల పెట్టుబడులు

జియోనీ రూ. 330 కోట్ల పెట్టుబడులు

భారత్‌లో తయారీ కోసం వచ్చే మూడేళ్లకాలంలో 5 కోట్ల డాలర్ల (రూ.330 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు జియోనీ తెలిపింది.

 

 

ఏపీలో గణనీయంగా ఉద్యోగ అవకాశాలు

ఏపీలో గణనీయంగా ఉద్యోగ అవకాశాలు

తద్వారా ఏపీలో గణనీయంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కంపెనీ ప్రతినిధులతో పాటు సీఎం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Best Mobiles in India

English summary
In its steps towards becoming an electronics manufacturing hub, the Government of Andhra Pradesh signed MoUs with low-cost cellphone-makers Micromax, Celkon and Karboon Mobiles.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X