ఏపీలో జియోని కోట్ల పెట్టుబడులు

Written By:

మైబైల్ ఫోన్ల రంగంలో ఉన్న జియోని మేక్ ఇన్ ఇండియా బాట పట్టింది. ఆంధ్రప్రదేశ్ లో తన ఫ్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. మొబైల్స్ తయారీ దారు సంస్థలైన ఫాక్స్ కాన్,డిక్సన్ టెక్నాలజీతో చేతులు కలిపి ఆంద్రప్రదేశ్ లో తన మొబైల్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు వేదికగా ఏపీలోని శ్రీసిటీని ఎంచుకుంది. మరి శ్రీసిటీలో జియోనితో పాటు ఏయే కంపెనీలు తమ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇండియాలో అలాగే ఏపీలో మేక్ ఇన్ ఇండియాలో ఏయే అంతర్జాతీయ కంపెనీలు దూసుకురానున్నాయి అనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : మళ్లీ శ్యాంసంగ్‌కే పట్టం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫాక్స్‌కాన్‌తో చేతులు

చైనా స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం జియోనీ.. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్‌ ఫోన్ల తయారీకి సిద్ధమైంది. ఈ మేరకు శ్రీసిటీలో ప్లాంట్‌ ఏర్పాటు చేసిన ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది.

డిక్సన్‌ టెక్నాలజీతోనూ ఒప్పందం

అదే విధంగా ఢిల్లీ ఎన్‌సిఆర్‌ రీజియన్‌కు చెందిన డిక్సన్‌ టెక్నాలజీతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం.. జియోనీకి చెందిన ఎఫ్‌ సీరిస్‌, పి సీరిస్‌ ఫోన్లను ఫాక్స్‌కాన్‌ తన ప్లాంట్‌లో తయారు చేయనుంది. అదే విధంగా ఫీచర్‌, ఇతర స్మార్ట్‌ఫోన్లను డిక్సన్‌ తయారు చేస్తుంది.

నెలకు 12 లక్షలకు పైగానే

ఈ రెండు సంస్థలు కూడా వచ్చే నెల నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తాయని జియోనీ వెల్లడించింది. నెలకు 12 లక్షలకు పైగా మొబైల్‌ ఫోన్లను తయారు చేసే సామర్థ్యం ఈ కంపెనీలకు ఉందని తెలిపింది.

జియోనీ రూ. 330 కోట్ల పెట్టుబడులు

భారత్‌లో తయారీ కోసం వచ్చే మూడేళ్లకాలంలో 5 కోట్ల డాలర్ల (రూ.330 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు జియోనీ తెలిపింది.

భారత కష్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ...

పరిశోధనా, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డి) కార్యకలాపాలను పెంచడానికి కూడా పెట్టుబడులను వినియోగించనున్నట్టు పేర్కొంది. భారత కష్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మొబైల్‌ ఫోన్లను రూపొందించడంపై ఆర్‌ అండ్‌ డి బృందం దృష్టిసారిస్తుందని తెలిపింది.

జియోనీ ఇండియా కంట్రీ సిఇఒ, ఎండి అర్వింద్‌ ఆర్‌ వొహ్రా

మేక్‌ ఇన్‌ ఇండియా ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో తాము కూడా భాగస్వాములుగా మారిపోతున్నామని జియోనీ ఇండియా కంట్రీ సిఇఒ, ఎండి అర్వింద్‌ ఆర్‌ వొహ్రా తెలిపారు.

చైనా తర్వాత భారత మార్కెటే జియోనీకి అతిపెద్దది

చైనా తర్వాత భారత మార్కెటే జియోనీకి అతిపెద్దదని, ఈ నేపథ్యంలో భారత మార్కెట్లోకి మరిన్ని ఉత్పత్తులు తీసుకురావడానికి తమ పెట్టుబడులు దోహదపడతాయని జియోనీ ప్రెసిడెంట్‌ విలియం లు తెలిపారు.

ఏడాదికి 2.3 కోట్ల మొబైల్‌ ఫోన్లను విక్రయిస్తోంది

జియోనీ అంతర్జాతీయంగా ఏడాదికి 2.3 కోట్ల మొబైల్‌ ఫోన్లను విక్రయిస్తోంది. ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ వాటా పరంగా పదో స్థానంలో ఈ సంస్థ ఉంది.

షామీ, మోటరోలా, లెనోవో

ఇదిలా ఉంటే.. ఇప్పటికే భారత్‌లో మొబైల్‌ ఫోన్లను తయారు చేయనున్నట్టు షామీ, మోటరోలా, లెనోవో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆసుస్‌, ఒప్పో, హెచ్‌టిసిలు

అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజాలైన ఆసుస్‌, ఒప్పో, హెచ్‌టిసిలు కూడా భారత్‌లో మొబైల్‌ ఫోన్ల తయారీకి సిద్ధం కావచ్చన్న వార్తలు కూడా వస్తున్నాయి.

దేశీయంగా స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ

దేశీయంగా స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే అనేక కంపెనీలు ఈ మార్కెట్లోకి అరంగేట్రం చేస్తున్నాయి.

అమెరికాను భారత్‌ అధిగమించే అవకాశం

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ పరంగా అమెరికాను వచ్చే కొన్నేళ్ల కాలంలోనే భారత్‌ అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

ఏపీలో పాతుకుపోయిన గ్జియోమి

ఇప్పటికే గ్జియోమి ఏపీలో మొబైల్ ను తయారుచేసే పనిలో బిజీగా ఉంది. గ్జియోమి తొలిసారిగా ఆ మధ్య ఏపీలో తొలిసారిగా తయారుచేసిన గ్జియోమి మొబైల్ ను ఏపీ సీఎం చంద్రబాబు లాంచ్ చేశారు 

మొబైల్ ఫ్లాంట్లు రానున్న ఏపీ శ్రీ సిటీ ఇదే

మొబైల్ ఫ్లాంట్లు రానున్న ఏపీ శ్రీ సిటీ ఇదే 

మొబైల్ ఫ్లాంట్లు రానున్న ఏపీ శ్రీ సిటీ ఇదే

మొబైల్ ఫ్లాంట్లు రానున్న ఏపీ శ్రీ సిటీ ఇదే

శ్రీ సిటీకి సంబంధించిన మ్యాప్

శ్రీ సిటీకి సంబంధించిన మ్యాప్ 

శ్రీ సిటిలో ఎంప్లాయిస్ కోసం..

శ్రీ సిటిలో ఎంప్లాయిస్ కోసం..

ఏపీలోని శ్రీ సెటీ సెజ్ హౌస్

ఏపీలోని శ్రీ సెటీ సెజ్ హౌస్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Gionee claims it will be investing $50 million (approximately Rs. 330 crore) in the country over the next three years to facilitate its 'Make in India' plans.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot