ఇంటెల్ నుంచి 12 వేల మంది ఇంటికి : కారణాలు ఇవేనా..

Written By:

అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన కంపెనీల నుంచి దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తీసివేయాలనే నిర్ణయం యావత్ టెక్ ప్రపంచాన్నే ఆలోచనలో పడేసింది. ఒక్కసారిగా అంతమంది ఉద్యోగులు రోడ్డు మీదకు రావడమంటే అది మిగతా కంపెనీలను సైతం ప్రభావితం చేయగలిగే అంశమే. మరి ఇంటెల్ అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది. అసలు మార్కెట్లో పీసీ అమ్మకాలు అంతలా పడిపోవడానికి కారణమేమిటి. ఓసారి చూద్దాం. విశ్లేషిద్దాం.

Read more: 10 లక్షల ఐటీ ఉద్యోగాలు రెడీ అవుతున్నాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఇంటెల్ చిప్‌ల ప్రపంచంలో ఒకప్పుడు రారాజు. కాని నేడు కంపెనీ లాభాల సంగతి అటుంచితే నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి. షేర్ల మార్కెట్‌లో ఇంటెల్ వాటా మునుపెన్నడూ లేనంత ఘోరంగా నమోదైంది. దీంతో ఇంటెల్ ఒక్కసారిగా పునరాలోచనలో పడింది.

2

ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలకు మైక్రో చిప్ లను తయారు చేసే విభాగంపై మరింత దృష్టిని సారించి పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.

3

స్మార్ట్ ఫోన్ల దెబ్బతో ఇప్పటికే హెచ్‌పీ సంస్థతో పాటు మైక్రోసాఫ్ట్‌ లాంటి దిగ్గజ కంపెనీలు కుదేలు కాగా, హెచ్‌పీ ఏకంగా రెండు వేర్వేరు సంస్థలుగా విడిపోయింది. మైక్రోసాఫ్ట్ సైతం కంప్యూటర్లను వదిలి మెరుగైన స్మార్ట్‌ఫోన్ల రంగం వైపు అడుగులు వేసింది.

4

2011 వరకూ పీసీ పరిశ్రమకు ఫుల్ క్రేజ్ ఉండేది. ఎవరిని చూసినా ల్యాప్‌టాప్ కొనాలని అనుకునేవాళ్లు. అయితే 2016 సంవత్సరం మొదటి త్రైమాసికంలో నమోదైన ఫలితాల్లో పీసీల అమ్మకాలు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక్కసారిగా 10 శాతం పడిపోయాయి.

5

కేవలం 6 కోట్ల పీసీలే అమ్ముడుపోయినట్టు గణాంకాలు చూపించాయి. ఇక అప్పటినుంచి మొదలైన అమ్మకాల క్షీణత, 2014లో కొంచెం ఫర్వాలేదు అనిపించినా, తర్వాత మళ్లీ పడిపోయింది. ప్రస్తుతం పీసీల పరిశ్రమ దిక్కులు చూస్తోంది.

6

భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొత్త వినియోగదారులను చేరుకోలేకపోవడం, వినియోగదారులు కూడా చాలావరకు ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్‌ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పీసీల డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

7

చాలమంది తమ అవసరాల కోసం డెస్క్‌టాప్ మోడళ్లుగా పేరుబడ్డ టాబ్లెట్ల వైపు నడుస్తున్నారు. దీంతో పీసీ కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2010లో టాబ్లెట్ల రవాణా 5శాతం ఉంటే, 2014లో అది కాస్తా 40 శాతానికి పెరిగిందంటే ఎంతగా ముందుకు వెళుతుందో అర్థం చేసుకోవచ్చు.

8

మొదట్లో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ తక్కువగానే ఉన్నా.. తర్వాత ధర తగ్గడం, ఎక్కువ మోడళ్లు అందుబాటులోకి రావడంతో క్రమంగా ప్రపంచమే స్మార్ట్‌ఫోన్ లోకంగా మారింది. గతేడాది స్మార్ట్ ఫోన్ల రవాణా 150 కోట్లకు ఎగబాకింది.

9

ఇక ఉద్యోగులను తొలగిస్తే సంవత్సరానికి 1.4 బిలియన్ డాలర్లను ఆదా చేయవచ్చన్న వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇంటెల్ ఫ్యాక్టరీలు ఎక్కువగా అమెరికాలో ఉండటంతో, ఎక్కడ ఉద్యోగుల కోత విధించనున్నారో తెలియాల్సి ఉంది.

10

చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్న స్టేసీ స్మిత్‌కు కంపెనీ ఉత్పత్తి అమ్మకాలు, తయారీ కార్యకలాపాలు నిర్వర్తించే బాధ్యతను అప్పజెప్పింది. కంపెనీకి కొత్త సీఈవోను నియమించే ప్రక్రియ కొనసాగుతుందని ఇంటెల్ తెలిపింది.

11

మరి ముందు ముందు ఇంకెన్ని పీసీ కంపెనీలు ఇలా ఉద్యోగులను తొలగిస్తాయో చూడాలి. లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apocalypse Now 6 reasons why Intel is firing 12,000 people
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot