రికార్డుల మోతకిది ఆరంభమా..100 కోట్ల ఐఫోన్లు హాంఫట్

Written By:

ఆపిల్ సంస్థ నుంచి విడుదలైన హైఎండ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఐ ఫోన్ల అమ్మకాలు వందకోట్లను దాటాయి. ఈ విషయాన్ని 'ఆపిల్' సీఈఓ టిమ్ కుక్ స్వయంగా వెల్లడించారు. కాలిఫోర్నియాలోని ఆపిల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా టిమ్ కుక్ మాట్లాడుతూ, ఐ ఫోన్ విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 100 కోట్ల ఫోన్లను విక్రయించామని, గతవారం ఈ మైలు రాయిని చేరుకున్నామని చెప్పారు. ఇటీవలే వంద కోట్ల యూనిట్ల ఐ ఫోన్లను విక్రయించామన్నారు. స్మార్ట్ ఫోన్ చరిత్రలోనే 'ఐ ఫోన్'ది చాలా ప్రత్యేకమని, ప్రపంచాన్ని మార్చగలిగే ఫోన్‌గా ఇది మారిందని కుక్ పేర్కొన్నారు. ఇక నుంచి అన్ని రికార్డుల మోతలేనంటూ సెలవిచ్చారు. మరి ముందు ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది వేచి చూడాల్సిన విషయమే.

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే.. వస్తే షాకేనట

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు ఏవో ఓ సారి చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ ఎస్111

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

ఆండ్రాయిడ్ 4.04 ఐస్ క్రీం శాండ్ విచ్ తో 2012లో రిలీజయింది. వచ్చి రాగానే మార్కెట్ ని కుదేల్ చేసింది. 60 మిలియన్లకు పైగా ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

Motorola StarTAC

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

1996లో రిలీజయింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రభంజనాన్ని సృష్టించిన మొబైల్ ఇదొక్కటే..వచ్చి రావడంతోనే 60 మిలియన్ల ఫోన్లకు పైగానే హాంఫట్ అయ్యాయి.

Apple's iPhone 4s

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

2011లో రిలీజయింది. సిరితో వచ్చిన ఫస్ట్ ఐ ఫోన్ ఇది. 60 మిలియన్లకు పైగానే యూనిట్లు అవలీలగా అమ్ముడుపోయాయి.

Nokia 5130

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

2007లో రిలీజయింది. మ్యూజిక్ ప్లేయర్ తో 2 మెగా ఫిక్సల్ తో మార్కెట్లోకి దూసుకొచ్చింది. 65 మిలియన్ల యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి.

iPhone 5

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

పెద్ద హ్యాండ్ సెట్ తో మార్కెట్లోకి వచ్చి ఓ ప్రభంజనాన్ని సృస్టించిన ఫోన్ ఇది. 2012లో రిలీజయింది. 70 మిలియన్లకు పైగా ఫోన్ల అమ్మకాలు జరిగాయి.

Nokia 6010

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

2004లో మార్కెట్లోకి ఎంటరయ్యింది. 75 మిలియన్లకు పైగా అమ్మకాలతో రికార్డులు నమోదు చేసింది.

Galaxy S4

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

2013లో మార్కెట్లోకి వచ్చింది. కంపెనీ ఫాస్టెస్ట్ సెల్లింగ్ మొబైల్ గా రికార్డు నమోదు చేసింది. 80 మిలియన్ల అమ్మకాలు జరిపింది. దీన్నే రీప్లేస్ చేసి మళ్లీ Galaxy S5గా మరుసటి ఏడాది తీసుకొచ్చారు.

iPhones 6 and 6 Plus

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

2014లో మార్కెట్లోకి వచ్చాయి. ఆపిల్ కంపెనీ చరిత్రలోనే బెస్ట్ సెల్లింగ్ పోన్లుగా రికార్డులు నమోదు చేశాయి. 100 మిలియన్లకు పైగా అమ్మకాలతో సరికొత్త రికార్డులకు తెరలేపాయి.

Nokia 1208

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

2007లో మార్కెట్లోకి రిలీజయింది. కలర్ స్క్రీన్ తో వచ్చిన ఈ మొబైల్ అప్పట్లో ఓ ఊపు ఊపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మిలియన్లకు పైగా అమ్మకాలతో సరికొత్త రికార్డులు నమోదు చేసింది.

Nokia 3310

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

2000లో మార్కెట్లోకి రిలీజయింది. గేమ్స్ తో వచ్చిన ఈ మొబైల్ ఫోన్ మార్కెట్ ని షేక్ చేసింది. 126 మిలియన్లకు పైగా అమ్మకాలు నమోదు చేసింది.

Motorola's RAZR V3

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

రిలీజ్: 2004
అమ్మకాలు: 130 మిలియన్లకు పైగానే

Nokia 1600

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

రిలీజ్: 2006
అమ్మకాలు: 130 మిలియన్లకు పైగానే

Nokia 2600

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

రిలీజ్: 2004
అమ్మకాలు: 135 మిలియన్లకు పైగానే

Samsung E1100

ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లు

రిలీజ్: 2009
అమ్మకాలు: 150 మిలియన్లకు పైగానే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple celebrates selling one billion iPhones
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting