ఆపిల్ సీఈఓ ఇండియా పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటీ..?

Written By:

ఆపిల్ సీఈఓ ఈ వారంలో భారత్ లో పర్యటించనున్నారని తెలుస్తోంది. ఈ సంధర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆపిల్ ప్రస్తుతం ఇండియాలో అలాగే చైనాలో గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వారంలో టిమ్ కుక్ చైనా పర్యటన కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది.

ఆపిల్ సీఈఓ ఇండియా పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటీ..?

అయితే దీనికి సంబంధించి ఆపిల్ కంపెనీ నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. భారత్ లో అపార వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఇంతకు ముందు ఓ ఇంటర్యూలో కుక్ అన్నారు. ఇదిలా ఉంటే ఆపిల్ తన పాత ఫోన్లను రీ సైక్లింగ్ చేసి ఇండియాలో అమ్మాలనే ప్రతిపాదనను ఇండియా తిరస్కరించడంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొందని తెలుస్తోంది.

Read more: వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియా చెత్త మార్కెట్ అయ్యే అవకాశం

ఆపిల్ సీఈఓ ఇండియా పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటీ..?

కుప్పలు తెప్పలుగా వస్తోన్న విదేశీ ఫోన్లతో ఇండియా ఓ డంప్ యార్డ్ లా తయారవుతోంది. ఫోన్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు ఇండియాను కమ్మేస్తున్నాయి. ఇవి చాలదన్నట్లు ఇక వాడేసిన ఫోన్లు కూడా ఇండియాకు వస్తే ఇండియా చెత్త మార్కెట్ అయ్యే అవకాశం ఉంది.

విదేశాల్లో వాడేసిన ఫోన్లను

ఆపిల్ సీఈఓ ఇండియా పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటీ..?

ఇదే కోవలో విదేశాల్లో వాడేసిన ఫోన్లను బాగు చేసి ఇండియాకు తెచ్చి విక్రయించాలని చూసిన దిగ్గజ మొబైల్ సంస్థ ‘ఆపిల్'కు ఎదురుదెబ్బ తగిలింది. ఆపిల్ చేసిన ఈ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఆపిల్ చేసిన ఈ ప్రతిపాదన

ఆపిల్ సీఈఓ ఇండియా పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటీ..?

నిజానికి ఆపిల్ చేసిన ఈ ప్రతిపాదన దేశంలో పెద్ద కదలికే తెచ్చింది. ప్రపంచంలోనే నంబర్-1 సంస్థయిన ఆపిల్ గనక ఈ మార్కెట్లోకి వస్తే ఐఫోన్లు మరింత చౌకగా వస్తాయని, అందుబాటులోకి వస్తాయని చాలామంది భావించారు. అదీగా ఆపిల్ బ్రాండ్ దానికి తోడుంటుంది కనక పాత ఫోనైనా సరే నమ్మకమైన సర్వీసు ఉంటుందని, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఇదో సంచలనమవుతుందని చాలామంది భావించారు.

పాత ఫోన్లన్నీ ఇండియాకు దిగుమతి

ఆపిల్ సీఈఓ ఇండియా పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటీ..?

అయితే ఆపిల్‌ను అనుమతిస్తే పాత ఫోన్లన్నీ ఇండియాకు దిగుమతి అయి వస్తాయని, దీనికితోడు ఇండియాలో తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా' ప్రచారానికి కూడా దెబ్బ తగులుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తంచేశారు.

ఆపిల్ ప్రత్యర్థి కంపెనీలైతే

ఆపిల్ సీఈఓ ఇండియా పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటీ..?

ఆపిల్ ప్రత్యర్థి కంపెనీలైతే ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ ప్రభుత్వానికి అభ్యర్థనలు కూడా పంపాయి. ఇవన్నీ చూశాక కేంద్రం మాత్రం యాపిల్ ప్రతిపాదనకు నో చెప్పినట్లు ‘బ్లూమ్‌బర్గ్' వార్తా సంస్థ తెలియజేసింది.

 

 

ఆపిల్ మళ్లీ చేసిన దరఖాస్తును

ఆపిల్ సీఈఓ ఇండియా పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటీ..?

ఇలాంటి ప్రతిపాదనను గతేడాది పర్యావరణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఆపిల్ మళ్లీ చేసిన దరఖాస్తును కేంద్రం తోసిపుచ్చింది'' అని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని టెలికం అధికారి ఒకరు చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ తెలియజేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple CEO Tim Cook may visit India this week to meet PM Narendra Modi: Sources
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting