వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

By Hazarath
|

ఆపిల్‌కు సంబంధించి ఎటువంటి ఫోన్లు అమ్మడానికి వీల్లేదని నిషేదం విధించిన చైనాలోనే ఆపిల్ ఇప్పుడు పాగా వేసింది. ఏకంగా కోట్ల పెట్టుబడితో చైనాలో సత్తా చాటేందుకు రెడీ అయింది. అయితే ఆపిల్ కంపెనీ అక్కడ పాగా వేసేందుకు ఈ సారి స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను వదిలేసి రవాణా సర్వీసులను ఎంచుకుంది. ఆ రంగంలో బిలియన్ డాలర్ పెట్టుబడులు పెట్టింది. ఐ ఫోన్ మార్కెట్ కోసం చైనాలో ఆపిల్ కసరత్తుపై ప్రత్యేక కథనం.

Read more: షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

చైనాలో ఉబెర్ కు ప్రధాన ప్రత్యర్థిగా దూసుకుపోతున్న చైనా రవాణా దిగ్గజం దిది చుక్సింగ్ లో ఆపిల్ వంద కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది.

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

అతి కష్టంగా ఎవ్వరికీ అర్థంకాని విధంగా ఉండే చైనా మార్కెట్ ను అర్థం చేసుకోవడానికి ఈ కంపెనీకి మా సాయం చేస్తున్నామని అందుకు అందులో పెట్టుబడులు పెట్టామని ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ చెబుతున్నారు.

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

అయితే వాస్తవం మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలో ఐఫోన్ వ్యాపారాలకు గండిపడిన నేపథ్యంలో మరో రంగంలో తన సత్తాను చూపడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అందుకే దూసుకుపోతున్న షేరింగ్, కారు టెక్నాలజీలో ఈ టెక్నాలజీ దిగ్గజం పెట్టుబడులు పెట్టిందని తెలుస్తోంది.

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

దీంతో పాటు ఇక్కడ మళ్లీ తన ఐఫోన్ అమ్మకాలను పునరుద్ధరించుకోవడానికి సరైన దారులు ఏర్పరచుకునేందుకు కూడా ఇది బాగా కలిసివస్తుందని తెలుస్తోంది.అందులో భాగంగానే కుక్ ఈ నెలలో చైనా పర్యటనకు వెళ్లనున్నారు.

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

ఇక ఉబర్‌కు ప్రత్యర్థి అయిన దిదిలో పెట్టుబడులు పెట్టడం, ఆటోమేకర్స్, టెక్నాలజీ కంపెనీల పెట్టుబడుల్లో కొత్త ఒరవడి సృష్టించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. భవిష్యత్తులో దిది రవాణా నెట్ వర్క్, ఆపిల్ రెండూ కలిసి పనిచేయడానికి అవకాశాలను చూస్తున్నామని కుక్ తెలిపారు.

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

దిదిలో పెట్టుబడులు పెట్టడానికి చాలా కారణాలున్నాయని, తాము పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనే ఇస్తాయని అంతే కాకుండా ఈ డీల్ తో చైనీస్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఏర్పడతాయనే ఆశాభావాన్ని కుక్ వ్యక్తంచేశారు.

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

ఇదిలా ఉంటే ఆపిల్ తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం తమకు కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని దిది చుక్సింగ్ సీఈవో, వ్యవస్థాపకుడు చెంగ్ వీ తెలిపారు.

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

బస్ లకు, ప్రైవేట్ కార్లకు బుకింగ్ లు, టాక్సీలను అద్దెకు ఇవ్వడం, రైడ్ షేరింగ్, డ్రైవింగ్ టెస్ట్ లకు కార్లను ఇవ్వడం వంటి సేవలను దిది చుక్సింగ్ అందిస్తోంది. ఒక్క రోజులో 110 లక్షల రైడ్ లను కంపెనీ జరుపుతుంటోంది.

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

400 చైనీస్ నగరాల్లో 3000లక్షల మంది యూజర్లు దీని సేవలను పొందుతున్నారు. అంతే కాకుండా ప్రైవేట్ కారు మార్కెట్ లో 87శాతం, టాక్సీలను అద్దెకు ఇవ్వడంలో 99శాతం షేరును ఈ కంపెనీ కలిగి ఉంది.

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

మొన్నటిదాకా చైనాలో ఆధిపత్యాన్ని అనుభవించిన దిది గత కొంతకాలంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. కంపెనీ ఉద్యోగులు పలు కేసుల్లో చిక్కుకుని అరెస్టయ్యారు కూడా.

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

వద్దన్న చైనాలోనే ఆపిల్ పాగా వేసింది

ఇప్పుడు ఆపిల్ పెట్టిన పెట్టుబడులతో కంపెనీ రాత మారుతుందా లేక మళ్లీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుందా అనేది ముందు ముందు చూడాలి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Apple pumps $1 billion into Uber's China rival Didi Chuxing

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X