అమెరికా నుంచి హైదరాబాద్‌కు ఆపిల్ కంపెనీ

Written By:

టెక్నాలజీ రంగంలో తనకు తానే పోటీనంటూ పరుగులు పెడుతున్న ఆపిల్ సంస్థ గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఆఫీసు పెడుతున్నారంటూ వస్తున్న వార్తలకు జై కొట్టింది. హైదరాబాద్‌లో ఆఫీసును ఓపెన్ చేయనున్నట్లు ఆపిల్ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ఇందులో సుమారు 150 మంది ఉద్యోగులు ఉంటారని వీరు మ్యాప్స్ అభివృద్ధి కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారని ఆపిల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Read more : ఐ ఫోన్‌తో పెళ్లి మొత్తం షూట్ చేశాడు

అమెరికా నుంచి హైదరాబాద్‌కు ఆపిల్ కంపెనీ

ఈ ఏడాది చివర్లో అమెరికా క్యూపర్టీనోలోని కొత్త క్యాంపస్ హెడ్ క్వార్టర్స్ కి సిబ్బంది తరలింపు మొదలు పెట్టే సమయంలో ఇక్కడ కార్యాలయం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వివరించారు. భారత్ లో కార్యకలాపాల విస్తరణపై తాము గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

Read more: సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేయండి: కార్పోరేట్ జాబు కొట్టండి

అయితే ఆపిల్ దాదాపు 25 మిలియన్ల డాలర్లతో హైదరాబాద్ లో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 4500 మంది నిర్మాణంలో పాలుపంచుకోవచ్చని అంచనా.ఈ సంధర్భంగా ఆపిల్ చరిత్రపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐప్యాడ్ రెటీనా డిస్‌ప్లేను

యాపిల్ ఐప్యాడ్ రెటీనా డిస్‌ప్లేను వాస్తవానికి తయారు చేసింది సామ్‌సంగ్.

 

 

పొగత్రాగితే వారంటీని కోల్పొవల్సి వస్తుంది.

యాపిల్ కంప్యూటర్ల దగ్గర పొగత్రాగితే వారంటీని కోల్పొవల్సి వస్తుంది.

 

 

యాపిల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా

యాపిల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 80,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు.

 

 

ఏడాదికి పొందే సగటు వేతనం 1,25,000 యూఎస్ డాలర్లు.,

యాపిల్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఏడాదికి పొందే సగటు వేతనం 1,25,000 యూఎస్ డాలర్లు.,

 

 

2012లో యాపిల్ రోజుకు

2012లో యాపిల్ రోజుకు 3,40,000 ఐఫోన్‌లను విక్రయించగలిగింది.

 

 

నిమిషానికి 300000 యూఎస్ డాలర్లు

యాపిల్ కంపెనీ ఆదాయం నిమిషానికి 300000 యూఎస్ డాలర్లు,

 

 

తన షేర్లను కేవలం 800 డాలర్లకు

యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అప్పట్లో తన షేర్లను కేవలం 800 డాలర్లకు విక్రయించారు. ఇప్పుడు వాటి విలువ 35 బిలియన్ డాలర్లు.

 

 

సిరి వాయిస్ యాప్‌కు

సిరి వాయిస్ యాప్‌కు చెప్పే ప్రతి మాట యాపిల్ కంపెనీని పంపబడుతుంది. ఆ పదాలను విశ్లేషించి స్టోర్ చేస్తారు.

 

 

యూఎస్ ఖజానాతో పోలిస్తే

యూఎస్ ఖజానాతో పోలిస్తే యాపిల్ ఎక్కవ ఆపరేటింగ్ క్యాష్‌ను కలిగి ఉంది.

 

 

సెకను కాలంలో డౌన్‌లోడ్ కాబడుతున్న

ప్రపంచవ్యాప్తంగా ఒక్క సెకను కాలంలో డౌన్‌లోడ్ కాబడుతున్న యాపిల్ అప్లికేషన్ల సంఖ్య 800.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple confirms opening of development centre in Hyderabad
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot