Home
News

Apple Days Sale: అమెజాన్‌లో కొత్త ఐఫోన్ల మీద ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు

ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ విడుదల చేసే ఐఫోన్ లను కొనాలని చూస్తున్న వారికి ఇప్పుడు గొప్ప అవకాశం వచ్చింది. ప్రముఖ ఈ-కామెర్స్ సంస్థ అమెజాన్‌లో 'ఆపిల్ డేస్' సేల్స్ ఇప్పుడు మరొకసారి తిరిగి వచ్చింది. మార్చి 17 వరకు ఆరు రోజులపాటు జరిగే ఈ అమ్మకంలో ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11 ప్రో సిరీస్, ఐఫోన్ 7 వంటి ఐఫోన్లతో పాటుగా మాక్‌బుక్ మరియు ఇతర ఆపిల్ ప్రొడెక్టులపై అనేక ఒప్పందాలు మరియు డిస్కౌంట్ ఆఫర్‌లు కలిగి ఉన్నాయి. ఈ తగ్గింపు ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐఫోన్ 12 మినీ మీద తగ్గింపు ఆఫర్స్

ఐఫోన్ 12 మినీ మీద తగ్గింపు ఆఫర్స్

ఆపిల్ డేస్ కొత్త అమ్మకంలో వినియోగదారులు ఆపిల్ సంస్థ యొక్క 2020 లైనప్‌లో అత్యంత సరసమైన ఐఫోన్ 12 మినీ యొక్క 64GB స్టోరేజ్‌బేస్ వేరియంట్ రూ.2,800 తగ్గింపుతో మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ మీద రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. ఇది బ్లాక్, వైట్, ప్రొడక్ట్ (RED), బ్లూ మరియు గ్రీన్ అనే ఐదు కలర్ ఎంపికలలో వస్తుంది.అలాగే ఐఫోన్ 11 ప్రోను ఇప్పుడు 82,900 రూపాయల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 128GB స్టోరేజ్‌తో లభించే ఐఫోన్ 12 ప్రో మాక్స్ యొక్క బేస్ వేరియంట్ రూ.5,196 తగ్గింపుతో, 256GB స్టోరేజ్ రూ.5,596 తగ్గింపుతో లభిస్తుంది. ఇది 2020 యొక్క టాప్-ఎండ్ ఐఫోన్ మరియు 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఐఫోన్ 11 ప్రో, ప్రో మాక్స్ మీద డిస్కౌంట్ ఆఫర్స్

ఐఫోన్ 11 ప్రో, ప్రో మాక్స్ మీద డిస్కౌంట్ ఆఫర్స్

64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ తో లభించే ఐఫోన్ 11 ప్రో రూ.19,901 తగ్గింపుతో, 256GB వేరియంట్ రూ.35,400 తగ్గింపుతో మరియు 512GB వేరియంట్ మీద అధికంగా రూ.22,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఐఫోన్ 11 ప్రో 5.8-అంగుళాల సూపర్ రెటినా XDR ఒఎల్‌ఇడి డిస్‌ప్లేను కలిగి ఉండి A13 బయోనిక్ చిప్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఐఫోన్ 11 ప్రో మాక్స్ యొక్క 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ.26,200 డిస్కౌంట్ తో, 256GB వేరియంట్ రూ.28,000 డిస్కౌంట్ తో మరియు 512GB స్టోరేజ్ వేరియంట్ రూ.28,901 తగ్గింపుతో విక్రయిస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ 6.5-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ ఓఎల్‌ఇడి డిస్‌ప్లేను అందిస్తుంది మరియు ఇది ఎ 13 బయోనిక్ చిప్‌తో వస్తుంది.చివరిగా ఐఫోన్ 7 మీద రూ.2,000 తగ్గింపు పొందిన తర్వాత ఇప్పుడు రూ.29,500 ధర వద్ద లభిస్తుంది. ఇది 4.7-అంగుళాల రెటినా డిస్‌ప్లేను కలిగి ఉండి సిల్వర్, గోల్డ్, బ్లాక్ మరియు రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్, ఎయిర్‌పాడ్స్‌ మీద డిస్కౌంట్ ఆఫర్స్

ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్, ఎయిర్‌పాడ్స్‌ మీద డిస్కౌంట్ ఆఫర్స్

మాక్‌బుక్ ఎయిర్ యొక్క 256GB స్టోరేజ్ వేరియంట్ మీద రూ.9,000 వరకు డిస్కౌంట్ తో మరియు 256GB వేరియంట్ రూ.13,090 అధిక డిస్కౌంట్ వద్ద విక్రయిస్తోంది. ఇది 13.3-అంగుళాల రెటినా డిస్ప్లేని కలిగి ఉండి 10 వ తరం ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్‌లో రన్ అవుతుంది. అలాగే ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ మీద రూ.2,901 తగ్గింపును పొందిన తరువాత ఇప్పుడు రూ.15,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇవి ఆపిల్ హెచ్ 1 హెడ్‌ఫోన్ చిప్‌తో పనిచేస్తాయి మరియు 24 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి.

Best Mobiles in India

English summary
Apple Days Sales Live on Amazon: Discount Offers on iPhone 12 Mini, MacBook Air and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X