Home
News

Apple మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ యొక్క డిజైన్‌ మీద ఓ లుక్ వేయండి!!

ఫోల్డబుల్ ఫోన్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు ఆపిల్ యొక్క ఐఫోన్ ను కొనుగోలు చేయాలనీ ఆశపడుతూ ఉంటారు. అయితే ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ మీ చేతిలో ఉంటే ఎలా ఉంటుంది. ఇది వినడానికి కొద్దిగా అద్బుతంగా ఉంది కదూ. ఈ ఆశ త్వరలోనే నెరవేరనున్నది. ఆపిల్ సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు కొన్ని పుకారులు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆపిల్ మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్‌కు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్

ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్

ప్రసిద్ధ ఆపిల్ సంస్థ యొక్క ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ కు సంబందించిన వివరాలను పరిశీలిస్తే ఐఫోన్ ఫ్లిప్ పేరుతో పిలవబడే ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ కోసం సంస్థ రెండు రకాల ప్రోటోటైప్‌లపై పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే శామ్‌సంగ్, మోటరోలా మరియు హువాయి వంటి ప్రధాన సంస్థలు తమ యొక్క ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసాయి. ఇందులో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ మాదిరిగానే ఫోల్డబుల్ ఐఫోన్ ఒక రకం క్లామ్‌షెల్ విడుదల చేయనున్నారా లేదా మరొకటి పుస్తకం లాగా నిలువుగా ఓపెన్ అయ్యే లాగా డిజైన్ ను కలిగి ఉందా.

ఫోల్డబుల్ ఐఫోన్

ఆపిల్ సంస్థ యొక్క ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ దేనివైపు మొగ్గు చూపుతుంది? అన్న దాని మీద ఇంకా సరైన వివరణ తెలియాలసి ఉంది. ఆపిల్ శామ్‌సంగ్ లీడ్స్‌ను అనుసరించి క్లామ్‌షెల్ డిజైన్‌తో ఐఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని కొన్ని లీక్ లు వెల్లడించాయి. ఐఫోన్ యొక్క ఫోల్డబుల్ ఫోన్ అడ్డంగా తెరుచుకునే డిజైన్ ను కలిగి ఉంటుంది.

క్లామ్‌షెల్

క్లామ్‌షెల్ తరహా ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ఆపిల్ ఎందుకు వెళ్తుందో తెలియాలసి ఉంది. ఫోల్డబుల్ డిస్ప్లేల కోసం ఆపిల్ శామ్‌సంగ్‌తో వ్యవహరించే అవకాశాలు మరొక కారణం కావచ్చు. ఇతర వివరాలలో ఐఫోన్ యొక్క ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు ఇంకా విడుదల కాలేదు. అయితే ఇది ఫంకీ కలర్ ఆప్షన్స్‌తో వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఐఫోన్ 11 యొక్క కలర్ ఆప్షన్ ప్రకారం ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రారంభించడంతో ఆపిల్ తమ వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది అని ఇది సూచిస్తుంది.

ఫంకీ ఫోల్డబుల్ ఐఫోన్?

ఫంకీ ఫోల్డబుల్ ఐఫోన్?

ఆపిల్ సంస్థ యొక్క క్రొత్త ఫోన్ కు సంబందించిన లీక్‌ను నమ్ముకుంటే మనకు ఇది ఒక ఫంకీ ఫోల్డబుల్ ఐఫోన్ కావచ్చు. ఇది ఇప్పటికే ఉన్న ఫోల్డబుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీని ఇవ్వగలదు. ఇది మల్టీ టాస్కింగ్ చేయటానికి ఉద్దేశించిన ఒక తీవ్రమైనదిగా మార్చడానికి బదులుగా ఫోల్డబుల్ డివైస్ వైపు ఒక ఆహ్లాదకరమైన విధానం అని నిరూపించవచ్చు.

ఐఫోన్ XR మరియు ఐఫోన్ 11 అత్యధికంగా అమ్ముడవుతున్న పరికరాలు కాబట్టి వాటి యొక్క కలర్ ఎంపికలను మేము ఇష్టపడుతున్నామని సురక్షితంగా చెప్పగలం. ఆ కలర్ ఎంపికలలో ఫోల్డబుల్ ఐఫోన్ కూడా అధికంగా ప్రాచుర్యం పొందగలదు. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ 2022 లో రాబోతున్నట్లు సమాచారం.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Apple's First Foldable iPhone Leaks: Design, Specs, Price, Release Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X