కొత్త షాక్: ఐఫోన్ 7 ఇయర్ ఫోన్లు చాలా డేంజర్ !

Written By:

ప్రపంచ మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయిన ఐఫోన్ ఇప్పుడు కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉంది. భారత మార్కెట్లోకి అక్టోబర్ 7వ తేదీన అడుగుపెట్టబోతున్న ఈఫోన్ గురించి అప్పుడే కొన్ని షాకింగ్ నిజాలు బటయకొసున్నాయి. కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వైర్ లెస్ ఎయిర్ ఫోన్స్ ఇప్పుడు చెవులకు చాలా ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఆపిల్ ఐఫోన్ 7 చీప్‌గా దొరికేది ఎక్కడో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

సంప్రదాయబద్ధమైన ఇయర్ ఫోన్లకు బదులుగా ‘ఎయిర్‌పాడ్స్'గా పిలిచే వైర్‌లెస్ ఇయర్ ఫోన్లను విప్లవాత్మకమార్పుగా తీసుకువస్తున్నామని, ఇది వైర్‌లెస్ యుగానికి నాంది పలికేందుకు తొలి ముందడుగుగా కంపెనీ సీఈవో టిమ్‌కుక్ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.

#2

అయితే ఇప్పుడు ఈ సిరీస్ ఐఫోన్లలో ఉపయోగిస్తున్న వైర్‌లెస్ ఎయిర్‌పాడ్స్ పూర్తిగా బ్లూటూత్ టెక్నాలజీపైనే పనిచేస్తాయి. ఎయిర్‌పాడ్స్‌లో బ్లూటూత్ కారణంగా విడుదలయ్యే రేడియేషన్ వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

#3

చెవికి సమీపంలో ఉండే మెదడు రక్తప్రసరణకు ఈ రేడియేషన్ అవరోధం కలిగిస్తుందని, దీనివల్ల మెదడుపై దుష్ప్రభావం ఉంటుందని ‘యుసి బెర్‌క్లీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్' ప్రొఫెసర్ డాక్టర్ జోయెల్ మోస్కోవిట్జ్ హెచ్చరించారు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను వాడడం అంటే ఓ మైక్రోవేవ్‌ను చెవులో పెట్టుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు.

#4

అయితే ఎయిర్‌పాడ్స్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ (పౌనపుణ్యం) ఎంత అనే వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ ఎఫ్‌సీసీ (ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్) నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడే రేడియేషన్ ఉంటుందని వీటిని తయారు చేసిన ఆపిల్ కంపెనీ ఇంజనీర్లు తెలియజేస్తున్నారు.

#5

మానవ ఆరోగ్యానికి హానికలిగించే రేడియేషన్, అయస్కాంత తరంగాలను నిరోధించేందుకు అనుగుణంగా ఎఫ్‌సీసీ మార్గదర్శకాలు లేవని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలు తేల్చారని డాక్టర్ జోయెల్ హెచ్చరించారు.

#6

అయితే ఆపిల్ ఇంజనీర్లు మాత్రం మైక్రోవేవ్ నుంచి వెలువడే రేడియేషన్ కన్నా తమ ఎయిర్‌పాడ్స్ నుంచి తక్కువ స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుందని దాన్ని సమర్థిస్తున్నారు.

#7

బ్లూటూత్ స్పీకర్లను దూరంగా ఉండి విన్నా కొంత రేడియేషన్ ప్రభావానికి మనం గురవుతామని, అలాంటప్పుడు నేరుగా, అందులో మెదడుకు దగ్గరగా విడుదలయ్యే రేడియేషన్ ఎక్కువ ముప్పు ఉంటుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు.

#8

అంతే కాకుండా కార్డుతో పనిచేసే ఇయర్‌ ఫోన్‌లే అన్నింటికన్నా ఉత్తమమన్నది తన అభిప్రాయమని జోయెల్ చెప్పారు. మరి ఈ ఐఫోన్ ఇయర్ ఫోన్స్ సంగతి ఎప్పుడు తేలుతుందనేది ఇప్పటికైతే సస్పెన్స్.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple eliminates headphone jack from iPhone 7: Harmful to your health Read mor gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot