వాడేసిన ఐఫోన్ల నుంచి టన్నుల కొద్దీ బంగారం

By Hazarath
|

న్యూస్ వినగానే షాక్ అవుతున్నారా..నిజం. పాత ఐ ఫోన్ల నుంచి గతేడాది ఆపిల్ కంపెనీ దాదాపు టన్ను బంగారాన్ని సేకరించింది. ఐ ఫోన్ల నుంచే కాకుండా డెస్క్ టాప్, ఐ ప్యాడ్లు, ఐ మ్యాక్ ల నుంచి బంగారం రాబట్టుకుంటుందోని కంపెనీ వార్షిక పర్యావరణ రిపోర్ట్ లో తెలిపింది. మరీ ఫోన్ నుంచి బంగారం తీయడం ఎలా సాధ్యం అవుతుందని అనుకోవచ్చు కదా..తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని చెబుతోంది ఆపిల్ కంపెనీ.

 

Read more: షాకిచ్చిన ఆపిల్ : ఐఫోన్ జీవిత కాలం మూడేళ్లే !

1

1

త‌న పాత ఐఫోన్లను రీసైక్లింగ్ చేయడం ద్వారా బంగారం..ఇత‌ర మెట‌ల్స్ ను ఐఫోన్ స‌మ‌కూర్చుకుంటుంది. అంటే..మొత్తం స్క్రాప్ నుంచి మాత్ర‌మే కాదు.. కొత్త వాటిని కూడా కొనుగోలు చేస్తుంటారు. పాత గాడ్జెట్లను, ఫోన్లను రీసైక్లింగ్ చేసి, బంగారాన్ని తీసుకుంటుందట.

2

2

సగటున ఒక్కో ఐఫోన్ తయారీలో 30 మిల్లీ గ్రాముల బంగారం ఉపయోగిస్తారు. గతేడాది ఇలా దాదాపు 2,204 పౌండ్ల (టన్ను కంటే ఎక్కువ) బంగారాన్ని ఐఫోన్లను, ఐపాడ్లను, ఐమాక్లను పగలగొట్టి రీసైక్లింగ్ చేసుకుందని కంపెనీ వార్షిక పర్యావరణ రిపోర్టులో తెలిపింది.

3
 

3

అయితే.. వాడేసిన ఫోన్ల నుంచి యాపిల్ సేక‌రించిన బంగారం బ‌రువు ఎంతో తెలుసా? అక్ష‌రాల వెయ్యి కిలోలు. తాజాగా కంపెనీ వార్షిక ప‌ర్యావ‌ర‌ణ నివేదిక‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

4

4

వీటి విలువ దాదాపు 40 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తుప్పు పట్టకుండా, ఎక్కువ కాలం పనిచేసేలా, అద్భుతమైన విద్యుత్ వాహకంలా బంగారం ఉపయోగపడుతుంది.

5

5

వెండిని, రాగిని కూడా ఈ ఉత్పత్తుల్లో వాడతారు. అయితే అవి త్వరగా తుప్పు పట్టి, పాడయ్యే అవకాశాలు అధికంగా ఉండడం, అతి ముఖ్యమైన వేళ ఎలక్ట్రాన్లను మెల్లగా ప్రయాణించేలా చేయడం వల్ల వీటిని గ్యాడ్జెట్లలో తక్కువగా వాడతారు.

6

6

90 మిలియన్ పౌండ్ల ఈ-వేస్ట్‌ను రీసైక్లింగ్ ప్రోగ్రామ్స్ ద్వారానే చేపడతామని, పునర్వినియోగ పదార్థాల నుంచి 61 మిలియన్లు రాబట్టుకున్నామని యాపిల్ సంస్థ తెలిపింది. పాత గ్యాడ్జెట్ల నుంచి తీసుకున్న పదార్థంలో బంగారం ఒకటని పేర్కొంది.

7

7

బంగార‌మే వెయ్యి కిలోలు అయితే.. మిగిలిన మెట‌ల్స్ ను రీసైక్లింగ్‌ద్వారా ఎంత స‌మ‌కూర్చుకుంటుందోనని అందరూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.

8

8

యాపిల్ మొత్తం 90 మిలియ‌న్ పౌండ్ల ఈ-వేస్ట్ ను రీసైక్లింగ్ చేసి 61 మిలియ‌న్ పౌండ్ల మెట‌ల్స్ ను ఐఫోన్ల వినియోగానికి ఉప‌యోగిస్తుంద‌ట‌.

9

9

ఇందులో బంగారం దాదాపు 1000 కిలోల వ‌ర‌కూ ఉంటే.. ఉక్కు 1.04ల‌క్ష‌ల కిలోలు.. ఫ్లాస్టిక్ 58,967 కిలోలు.. గ్లాస్ 54,431 కిలోలు.. అల్యూమినియం 20,411 కిలోలు.. రాగి 13607 కిలోలు.. వెండి 2993 కిలోలు ఉన్నాయ‌ట‌.

10

10

ఈ రీసైక్లింగ్ విధానం వ‌ల్ల భూమి నుంచి లోహాల్ని తీసుకునే అవ‌స‌రం త‌గ్గుతుంద‌ని.. దీంతో ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడొచ్చ‌ని యాపిల్ చెబుతోంది.

11

11

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write Apple found 40 million in gold in used phones and computers last year

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X