దడ పుట్టిస్తోన్న కొత్త ఐఫోన్ ధర

Posted By:

యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ ఫోన్‌లను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart తన లిస్టింగ్స్‌లో ఉంచింది. ఈ రెండు ఫోన్‌లు గోల్డ్, రోజ్ గోల్డ్ ఇంకా స్పేస్ గోల్డ్ వేరియంట్‌లలో లభ్యంకానున్నాయి. ధరలు ఈ విధంగా ఉన్నాయి...

Read More : స్మార్ట్‌ఫోన్ వెలుతురు అత్యంత ప్రమాదకరమా..?

యాపిల్ ఐఫోన్ 6ఎస్ (16జీబి) ధర రూ.64,836, యాపిల్ ఐఫోన్ 6ఎస్ (64జీబి) ధర రూ.74,117, యాపిల్ ఐఫోన్ 6ఎస్ (128జీబి) ధర రూ.83,401,  యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ (16జీబి) ధర రూ.74,117, యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ (64జీబి) ధర రూ.83,401, యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128జీబి) ధర రూ.88,478

Read More : ఫోన్ చార్జింగ్ నిమిషాల్లో.. 10 టిప్స్!

కొత్త ఐఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకున్న వారికి అక్టోబర్ 16 లేదా 17వ తేదీని డెలివరీ ఉంటుంది.ఐఫోన్‌లకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైలింగ్ చెయిన్‌లలో ప్రారంభమయ్యాయి. The MobileStore ఇప్పటికే తన 800 పై చిలుకు అవుట్ లెట్‌లలో కొత్త ఐఫోన్‌లకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తోంది. 13 వరకు ఈ బుకింగ్‌లు కొనసాగుతాయి. యూజర్లు రూ 2,000 చెల్లించి కొత్త ఐఫోన్‌‌లను ఆర్డర్ చేసుకోవచ్చు. అక్టోబర్ 15 అర్థరాత్రి నుంచి ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్ చరిత్రలో చోటుచేసుకున్న 8 అతిపెద్ద వివాదాలు

యాపిల్ మొదటి ఐఫోన్ 599 డాలర్ల ధర ట్యాగ్‌తో మార్కెట్లో విడుదలైంది. మూడు నెలలు గడిచిందో లేదో ఫోన్ ధరను 399 డాలర్లకు యాపిల్ తగ్గించింది.

యాపిల్ ఐఫోన్ చరిత్రలో చోటుచేసుకున్న 8 అతిపెద్ద వివాదాలు

అడోబ్ ఫ్లాష్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికి తొలి రోజుల్లో యాపిల్ ఐఫోన్‌లలో ఫ్లాష్ సపోర్ట్ చేయలేదు. ఈ అంశం పలువురు యాపిల్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది.

యాపిల్ ఐఫోన్ చరిత్రలో చోటుచేసుకున్న 8 అతిపెద్ద వివాదాలు

2012లో యాపిల్ విడుదల చేసిన ఐఓఎస్ 6 మ్యాప్స్ ఫీచర్ ఫేలవమైన ఫలితాలతో డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది.

యాపిల్ ఐఫోన్ చరిత్రలో చోటుచేసుకున్న 8 అతిపెద్ద వివాదాలు

ఐఫోన్ 4లో యాంటీనా సమస్య.

యాపిల్ ఐఫోన్ చరిత్రలో చోటుచేసుకున్న 8 అతిపెద్ద వివాదాలు

చైనాలోని యాపిల్ ఐఫోన్‌ల తయారీ కంపెనీలో దారుణమైన పరిస్థితులు.

యాపిల్ ఐఫోన్ చరిత్రలో చోటుచేసుకున్న 8 అతిపెద్ద వివాదాలు

ఫేలవమైన యాపిల్ ఐఓఎస్ 8.0.1 అప్‌డేట్.

యాపిల్ ఐఫోన్ చరిత్రలో చోటుచేసుకున్న 8 అతిపెద్ద వివాదాలు

ఐఫోన్ 4 విడుదలవటానికి కొద్ది రోజుల ముందు ఓ ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్ ఐఫోన్ 4 ప్రోటోటైప్‌కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది. మొదట్లో ఈ వార్తలను ఖండించిన యాపిల్ తరువాత ఒప్పుకోక తప్పలేదు. వాస్తవానికి ప్రోటోటైప్ దశలో ఉన్న ఐఫోన్ ను యాపిల్ ఉద్యోగి ఓ బార్ లో మరిచిపోయి వెళ్లిపోవటంతో ఆ ఫోన్ ను ఆ వెబ్ సైట్ వేరొకరి వద్ద కొనుగోలు చేసింది.

యాపిల్ ఐఫోన్ చరిత్రలో చోటుచేసుకున్న 8 అతిపెద్ద వివాదాలు

యాపిల్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌లు వంగిపోతున్నాయని పలు వినియోగదారులు ఫిర్యాదు చేయటంతో ఒక్కసారిగా మార్కెట్ ఉలిక్కి పడింది బెండ్ గేట్ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌లు కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple iPhone 6S, iPhone 6S Plus listed on Flipkart. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot