ఐఫోన్ వచ్చి నేటికి 10 ఏళ్లు, హైలెట్స్ ఇవే !

ఐఫోన్ నుంచి సూపర్ ఫోన్ త్వరలోనే రాబోతుందని ఆపిల్ సీఈఓ మాటలను బట్టి తెలుస్తుంది.

By Hazarath
|

ఆపిల్ ఐఫోన్ వచ్చి నేటికి సరిగ్గా 10 ఏళ్లయింది. ఈ 10 ఏళ్ల కాలంలో ఆపిల్ ఐఫోన్ కుర్రకారు మదిని ఎంతగానో దోచుకుంది. ఇతర ఫోన్లకు సవాల్ విసురుతూ ఐఫోన్ చరిత్రలో టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సంధర్భంగా ఆపిల్ సీఈఓ ఐఫోన్ నుంచి ఇంకా అత్యుత్తమ మైన ఫోన్ రావాల్సి ఉందని దాని కోసం కసరత్తు చేస్తున్నామని తెలిపారు.ఆయన మాటలను బట్టి చూస్తే ఐఫోన్ నుంచి సూపర్ ఫోన్ త్వరలోనే రాబోతుందని తెలుస్తుంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఐఫోన్ హైలెట్ పాయింట్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

రూ. 2 వేల కన్నాతక్కువకే దిగిరానున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు

 2007 జనవరి 9న

2007 జనవరి 9న

మొట్టమొదటిసారిగా 2007 జనవరి 9న ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా మొదటి తరం ఐఫోన్ ను ప్రవేశపెట్టారు. మొదట అమెరికాలో 2007 నవంబర్‌లో యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఐఫోన్ విక్రయాలు జరిపారు.

భారత్‌లోకి ఐఫోన్ 2008 ఆగస్టులో

భారత్‌లోకి ఐఫోన్ 2008 ఆగస్టులో

మొదటి ఐఫోన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టలేదు. భారత్‌లోకి ఐఫోన్ 2008 ఆగస్టులో ప్రవేశించింది. ఐఫోన్ 3 జీ ఫోన్‌ను మొదట భారత్ లో లాంచ్ చేశారు. వొడాఫోన్, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌తో భారత్‌లోకి ప్రవేశించింది.

సిస్కో దావా

సిస్కో దావా

స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ను ప్రవేశపెట్టిన కొన్ని రోజులకే సిస్కో దీనిపై దావా వేసింది. 'ఐఫోన్' ట్రేడ్ మార్కు వాస్తవానికి తమదంటూ సిస్కో ఉత్తర కాలిఫోర్నియా ఫెడరల్ జిల్లా కోర్టులో దావా వేసింది. అనంతరం రెండు కంపెనీలు కూర్చొని ట్రేడ్ మార్కు సమస్యను సెటిల్ చేసుకున్నాయి.

టైమ్ మ్యాగజైన్

టైమ్ మ్యాగజైన్

2016 లో టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన 50 గాడ్జెట్‌ల జాబితాల్లో ఐఫోన్ టాప్‌లో నిలిచింది. ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు, దీనికసలు ఎలాంటి యాప్ స్టోర్ లేదు.

200 పేటెంట్ హక్కులు

200 పేటెంట్ హక్కులు

ఐఫోన్ టెక్నాలజీకి సంబంధించిన 200 పేటెంట్ హక్కులు ఆపిల్ వద్ద ఉన్నాయి. ఐఫోన్ ఫోన్లలో అత్యంత ఖరీదైన భాగమేదంటే అది రెటీనా స్క్రీనే.

ఐఫోన్ విక్రయాల ప్రారంభం తర్వాతనే అధిక రెవిన్యూ

ఐఫోన్ విక్రయాల ప్రారంభం తర్వాతనే అధిక రెవిన్యూ

2016 జూన్ నాటికి ఆపిల్ ఐఫోన్ విక్రయాలు 1 బిలియన్ (100 కోట్ల) మార్కును చేధించాయి. కూపర్టినో‌లో జరిగిన ఉద్యోగుల సమావేశంలో ఈ విషయాన్ని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఆపిల్ కంపెనీకి ఐఫోన్ విక్రయాల ప్రారంభం తర్వాతనే అధిక రెవిన్యూ వస్తోంది.

ఎప్పుడూ సమయం 9.41am

ఎప్పుడూ సమయం 9.41am

ఆపిల్ ఐఫోన్ యాడ్‌లో ఎప్పుడూ సమయం 9.41am గానే కనిపిస్తోంది. ఇందుకు కారణం స్టీవ్ జాబ్స్ మొదట ఐఫోన్‌ను ఆ సమయంలోనే ప్రవేశపెట్టారు. అదే కంటిన్యూ అవుతోంది.

 

 

Best Mobiles in India

English summary
Apple iPhone turns 10, Tim Cook says 'Best is Yet to Come read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X