రూ. 2 వేల కన్నాతక్కువకే దిగిరానున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు

Written By:

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ. 2 వేల కన్నా తక్కువగా ఉంటేనే డిజిటల్ ఇండియా కల సాకారం అవుతుందని చెప్పడంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది. రూ. 2 వేల కంటే తక్కువ ధరలకే ఫోన్లను తీసుకురావాలని దేశీయ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఆర్థిక లావాదేవీలు మరింత మందికి చేరువ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటు ధరల్లో డివైజ్‌లు లభ్యం కానంత వరకు నగదు రహిత ఎకానమీని ప్రోత్సహించలేమని ప్రభుత్వం భావిస్తోంది.

3 స్క్రీన్లతో ల్యాపీని ఎప్పుడైనా చూశారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తక్కువ ధరలకు స్మార్ట్‌ఫోన్లను

ఇటీవల నీతి ఆయో‌గ్ నిర్వహించిన భేటీలో మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్ సంస్థలను తక్కువ ధరలకు స్మార్ట్‌ఫోన్లను తీసుకురావాలని ఆదేశించింది. దీంతో డిజిటల్ లావాదేవీలను ప్రజలకు అందించవచ్చని పేర్కొనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

చైనా ఫోన్ల దెబ్బకు

అయితే చైనీస్ స్మార్ట్‌ఫోన్ సంస్థలు, శాంసంగ్, ఆపిల్ లాంటి బహుళ జాతీయ దిగ్గజాలు ఈ మీటింగ్‌కు హాజరుకాలేదు. చైనా ఫోన్ల దెబ్బకు దేశీయ దిగ్గజ కంపెనీలు విలవిలలాడుతున్న విషయం తెలిసిందే.

కంపెనీలకు సబ్సిడీ ఇవ్వడంలో

20 నుంచి 25 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేలా హ్యాండ్‌సెట్ కంపెనీలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించిందని, అయితే ఆ కంపెనీలకు సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం తోసిపుచ్చినట్టు ఇద్దరు అధికారులు పేర్కొన్నారు.

తక్కువ ధరలకు ఫోన్లను తీసుకురావడం

 
ఫింగర్ ప్రింట్ స్కానర్, అత్యాధునిక ప్రాసెసర్, మంచి నైపుణ్యతతో తక్కువ ధరలకు ఫోన్లను తీసుకురావడం తమకు సవాళ్లేనని పరిశ్రమలోని వ్యక్తులు చెబుతున్నారు.

ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల మీద

ప్రస్తుతం 3జీ స్మార్ట్‌ఫోన్లు రూ .2500 మధ్యలో లభ్యమవుతున్నాయి. 4 జీ ఫోన్లు అయితే ఇంకాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ. 2 వేలకు ఫోన్లను తీసుకురావడం అనేది ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల మీద ఆధారపడిఉంటుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Government asks local handset companies to make sub-Rs 2K smartphones read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot