మానవతను చాటుకున్న ఆపిల్

Written By:

ఆపిల్ తన మానవతను చాటుకుంది.ప్రపంచంలో ఎంతోమంది అవయువాల దొరక్క అనేక బాధలు అనుభవిస్తున్న తరుణంలో ఆపిల్ ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఐ ఫోన్ వాడే యూజర్లందరికీ ఈ అవయువ దానంపై అవగాహన కల్పించడానికి సరికొత్త అప్ డేట్ తో ముందుకొచ్చింది. ఇప్పటికే ఉన్న హెల్త్ యాప్ కి అధునాతన ఫీచర్ ను జోడించింది.ఆపిల్ యూజర్లు తమ అవయువాలను ఈజీ సైన్ బటన్ తో డొనేట్ చేసేలా కంపెనీ ఈ యాప్ రూపొందించింది. ఈ యాప్ గురించి చెబుతూ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్టీవ్ జాబ్స్ గురించి కొన్ని విషాదకర వాక్యాలు చెప్పారు.

కేవలం రూ.3వేలకే..అన్‌లిమిటెడ్ డాటాతో 4జీ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ కొత్త సాప్ట్ వేర్‌

మానవతను చాటుకున్న ఆపిల్

లక్షలమంది ఐ ఫోన్ యూజర్లను అవయవదానానికి ప్రోత్సహించడానికి ఆపిల్ కొత్త సాప్ట్ వేర్‌ను తీసుకొచ్చింది. అవయవ దానాన్ని తేలికగా చేయడానికి ఆపిల్ తన హెల్త్ యాప్ సాప్ట్ వేర్‌ను అప్‌డేట్ చేసింది.

అప్‌డేట్ చేసిన ఈ హెల్త్ యాప్‌ను

మానవతను చాటుకున్న ఆపిల్

అప్‌డేట్ చేసిన ఈ హెల్త్ యాప్‌ను ఐఓఎస్ 10 యూజర్లందరికీ అందుబాటులో ఉంచనుంది. ఈజీ సైన్-అప్ బటన్ తో ఆర్గాన్‌లు డొనేట్ చేసేలా కంపెనీ ఆ యాప్‌ను రూపొందించింది. ఈ నెలలో లిమిటెడ్ గా ఈ కొత్త సాప్ట్‌వేర్‌ను ఆపిల్ విడుదల చేయనుంది.

అవయవ దాత కొరత ఇబ్బందిని

మానవతను చాటుకున్న ఆపిల్

దీర్ఘకాలంగా కొనసాగుతున్న అవయవ దాత కొరత ఇబ్బందిని, ఈ యాప్ ద్వారా ఆపిల్ తగ్గించగలదని కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఆశాభావం వ్యక్తం చేశారు.

స్టీవ్ జాబ్స్

మానవతను చాటుకున్న ఆపిల్

తన స్నేహితుడు, ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, 2009లో లివర్ మార్పిడికి, అవయవం దొరకక ఎంతో బాధను భరించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 

ఎంతగా బాధపడ్డాడో కళ్లారా

మానవతను చాటుకున్న ఆపిల్

తన స్నేహితుడు ఎంతగా బాధపడ్డాడో కళ్లారా చూశానని, ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని కుక్ ఆవేదన వ్యక్తం చేశారు.తాను లివర్ దానం చేస్తానన్న స్టీవ్ జాబ్స్ అంగీకరించలేదని తెలిపారు.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో

మానవతను చాటుకున్న ఆపిల్

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో 2011లో జాబ్స్ చనిపోయారని, సరియైన సమయానికి అవయవ దాత దొరకక ఇబ్బందిపడుతున్న వారికి ఈ యాప్ ఎంతో సహకరించగలదని టిమ్ కుక్ చెప్పారు.

ఆర్గాన్ డొనేషన్ సమాచారం

మానవతను చాటుకున్న ఆపిల్

2014 లోనే యాప్ అందుబాటులోకి వచ్చిన్పటికీ ప్రస్తుతం అప్ డేట్ చేసిన ఈ యాప్ తో, ఆర్గాన్ డొనేషన్ సమాచారం కూడా అందుబాటులోకి రానుంది. అవయవ దాతగా నమోదు చేసుకున్న యూజర్ల సమాచారం, డొనేట్ లైఫ్ అమెరికాను నిర్వహిస్తున్న నేషనల్ డొనేట్ రిజస్ట్రీకి వెళ్తుంది.

ఎవరికైనా అవయవం కావాల్సి వస్తే

మానవతను చాటుకున్న ఆపిల్

ఎవరికైనా అవయవం కావాల్సి వస్తే, ఫోన్‌లాక్‌లో ఉన్నా సరే ఎమర్జెన్సీ సమాచారంగా ఫోన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ప్రస్తుతం డెవలపర్స్ బీటా ఐఓఎస్ 10 యూజర్లకు అందుబాటులో ఉంటుంది. దీన్ని మరింత వ్యాప్తి చేయడానికి కొత్త ఐఓఎస్ వెర్షన్ కంపెనీ ఆవిష్కరించనుంది.

అమెరికాలో 12వేలకు పైగా ప్రజలు

మానవతను చాటుకున్న ఆపిల్

అమెరికాలో 12వేలకు పైగా ప్రజలు తమ ప్రాణ రక్షణ కోసం అవయవదానానికి వేచిచూస్తున్నారు. వారిలో అవయవం అందక రోజుకు సగటున 22 మంది చనిపోతున్నారు. మన ఇండియాలో కూడా దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple iPhone’s new software to encourage organ donation
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot