టాప్ హెడ్స్ అవుట్ : కష్టాల్లో ఆపిల్ కంపెనీ

Written By:

ఇండియాలో ఆపిల్ కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. కంపెనీని ముందుండి నడిపించిన టాప్ హెడ్స్ ఒక్కొక్కరుగా వైదొలుగుతుండటంతో ఆపిల్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కంపెనీని ముందుండి నడిపించే వారి కోసం ఇప్పుడు అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పటికే ఇండియాలో బ్రాండ్ రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నామని ఆపిల్ ప్రకటించడం అదే సమయంలో టాప్ హెడ్స్ వైదొలగడం కూడా పెద్ద దెబ్బేనని చెప్పాలి.

Read More : ఫేస్‌బుక్‌లో పరిచయం 19 రోజులే : వచ్చాడు, చంపేసి వెళ్లాడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్ జెయింట్ ఆపిల్ ముందు సవాలు

ఇండియాలో వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు కొత్త బాస్ లను వెతుక్కోవాల్సిన పరిస్థితి టెక్ జెయింట్ ఆపిల్ ముందు సవాలుగా నిలిచింది. సంస్థ అమ్మకాలను కోట్ల రూపాయల నుంచి వేల కోట్లకు చేర్చిన ఆపిల్ దీర్ఘకాల భారత మేనేజర్ ఏఓఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ మనీష్ ధిర్ తన పదవికి రాజీనామా చేశారు.

శరద్ మొహరోత్రా ఇటీవల తన పదవికి రాజీనామా చేసి

గడచిన నెల వ్యవధిలో యాపిల్ భారత విభాగాన్ని వీడి వెళ్లిన రెండో ఉన్నతోద్యోగి మనీష్.కంపెనీలో ఎంటర్ ప్రైజ్ మొబిలిటీ యూనిట్ ను పర్యవేక్షించే శరద్ మొహరోత్రా ఇటీవల తన పదవికి రాజీనామా చేసి వైవీ మొబిలిటీ పేరిట సొంత సెల్ ఫోన్ కంపెనీ పెట్టుకున్న సంగతి తెలిసిందే.

కాగా తన రాజీనామా విషయమై ప్రత్యేకించి

కాగా తన రాజీనామా విషయమై ప్రత్యేకించి స్పందించేందుకు నిరాకరించిన మనీష్ ధిర్ రాజీనామా మాత్రం అ వాస్తవమని తెలిపారు.

2010లో ఆయన విధుల్లోకి వచ్చినప్పుడు

2010లో ఆయన విధుల్లోకి వచ్చినప్పుడు 100 మిలియన్ డాలర్లుగా అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 670 కోట్లుగా ఉన్న ఆపిల్ అమ్మకాలు ఆయన పదవి వీడేసరికి బిలియన్ డాలర్లును అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 6,700 కోట్లు అధిగమించాయి.

ఆపిల్ స్వీయ బ్రాండెడ్ స్టోర్లను

ఆపిల్ స్వీయ బ్రాండెడ్ స్టోర్లను ఇండియాలో ప్రారంభించడం ద్వారా మరింతగా విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్న వేళ ధిర్ రాజీనామా కొంత ఇబ్బందికరమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.

యాపిల్ తాజాగా భారత్‌లో సింగల్ బ్రాండ్ రిటైల్ స్టోర్లను

ఇక ఇదిలా ఉంటే ఐఫోన్, ఐపాడ్ తయారీ కంపెనీ యాపిల్ తాజాగా భారత్‌లో సింగల్ బ్రాండ్ రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నది. కంపెనీ తాజాగా స్టోర్ల ఏర్పాటు కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ, ప్రమోషన్ (డీఐపీపీ)కు దరఖాస్తు చేసుకుంది.

కంపెనీ సింగల్ బ్రాండ్ స్టోర్ల ఏర్పాటు కోసం

కంపెనీ సింగల్ బ్రాండ్ స్టోర్ల ఏర్పాటు కోసం డీఐపీపీ అనుమతి కోరిందని, అలాగే తన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తుందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. కంపెనీ.. స్టోర్ల ఏర్పాటుకు ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసేది, ఎన్ని స్టోర్లను ఏర్పాటు చేస్తుందనే అంశాలు తెలియాల్సి ఉంది.

ఇప్పటి వరకు యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను

ఇప్పటి వరకు యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను చైనా, జర్మనీ, యూకే, అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో సొంత స్టోర్ల ద్వారా విక్రయిస్తోంది. అయితే భారత్‌లో యాపిల్ విక్రయాలు రెడింగ్టన్, ఇన్‌గ్రామ్ మైక్రో అనే డిస్ట్రిబ్యూటర్ల ద్వారా జరుగుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple on the lookout for new India business head following Maneesh Dhir's exit
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot