ఫేస్‌బుక్‌లో పరిచయం 19 రోజులే : వచ్చాడు, చంపేసి వెళ్లాడు

Written By:

ఫేస్‌బుక్‌ని ఆ జుకర్‌బర్గ్ ఏ ముహార్తాన కనిపెట్టారో తెలియదు కాని అది అందరికీ సినిమా చూపిస్తోంది ఇప్పుడు..అన్ని రకాల సినిమాలు అందులో నవరసాలతో నిండి కనువిందు చేస్తున్నాయంటే నమ్మండి. అవి హర్రర్ కావచ్చు లేకుంటే మరేదైనా కావచ్చు.. సరిగ్గా ఇలాంటి సంఘటనే బెంగుళూరులో జరిగింది. 19 రోజుల ఫేస్‌బుక్ పరిచయం ఓ అమ్మాయి పాలిట శాపంలా మారింది. ఆమెను తిరిగిరాని లోకాలకు పంపేలా చేసింది. షాక్ కొడుతున్న కథనం చదవండి.

Read more : జపాన్‌లో నేతాజీ దహనం: మిస్టరీ వీడినట్టేనా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇద్దరూ ఫేస్‌బుక్‌లో ఒకరికొకరు

ఇద్దరూ ఫేస్‌బుక్‌లో ఒకరికొకరు

ఆమె ఉండేది బెంగుళూరు..అతను ఉండేది పంజాబ్ అయితేనేం ఇద్దరూ ఫేస్‌బుక్‌లో ఒకరికొకరు పరిచయమ్యారు. ఇక అతన్ని ఇంటికి ఆహ్వనించింది. అతను వచ్చాడు చంపేసి వెళ్లాడు..ఇప్పుడు ఇది టెకీ ప్రపంచంలో ఓ సంచలనంగా మారింది.

చంపేందుకు అతను వాడిన ఆయుధాలు చూస్తే

చంపేందుకు అతను వాడిన ఆయుధాలు చూస్తే

చంపేందుకు అతను వాడిన ఆయుధాలు చూస్తే ఇంకా కళ్లు బైర్లు కమ్మాల్సిందే మరి. ఓ ల్యాప్‌టాప్‌ చార్జర్‌ తీగ, రాసుకునే పెన్ను!వీటితోనే అతను ఆ అమ్మాయిని చంపేసి వెళ్లాడు. పాపం 19 రోజుల ఫేస్‌బుక్‌ స్నేహమే తన పాలిట మృత్యు గీతమవుతుందని ఆ అమాయకురాలు అనుకోలేదు!

పోలీసు వర్గాల కథనం ప్రకారం

పోలీసు వర్గాల కథనం ప్రకారం

పోలీసు వర్గాల కథనం ప్రకారం.... పంజాబ్‌కు చెందిన కుసుమ్‌ రాణి (31) బెంగళూరులోని ఐబీఎంలో ఉద్యోగిని. ఆరు నెలల క్రితమే ఇక్కడికి వచ్చింది. కడుగోడిలో విలాసవంతమైన ఫ్లాట్‌లో అద్దెకు ఉంటోంది

మంగళవారం రాత్రి 8 గంటలకు రూమ్‌మేట్‌ నిధి శర్మ వచ్చేసరికి.

మంగళవారం రాత్రి 8 గంటలకు రూమ్‌మేట్‌ నిధి శర్మ వచ్చేసరికి.

మంగళవారం రాత్రి 8 గంటలకు రూమ్‌మేట్‌ నిధి శర్మ వచ్చేసరికి... కుసుమ్‌ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. ఆమె సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.

అప్పుడేం తేలిందంటే...

అప్పుడేం తేలిందంటే...

గుర్గావ్‌కు చెందిన సుఖ్‌బీర్‌తో డిసెంబర్‌ 31న కుసుమ్‌కు ‘ఫేస్‌బుక్‌' పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ‘ఫ్రెండ్స్‌' అయ్యారు. ఈనెల 9వ తేదీన ఒకరి ఫోన్‌ నెంబర్లు మరొకరు ఇచ్చి పుచ్చుకున్నారు. మాటలు కలుపుకొన్నారు.

19వ తేదీ ఉదయం సుఖ్‌బీర్‌ విమానంలో బెంగళూరులో

19వ తేదీ ఉదయం సుఖ్‌బీర్‌ విమానంలో బెంగళూరులో

19వ తేదీ ఉదయం సుఖ్‌బీర్‌ విమానంలో బెంగళూరులో దిగాడు. మధ్యాహ్నానికి కుసుమ్‌ ఫ్లాట్‌కు చేరుకున్నాడు. ఆ సమయానికి ఆమె అక్కడ లేదు. కాసేపటికి వచ్చింది.

విజిటర్స్‌ బుక్‌లో సుఖ్‌బీర్‌ వివరాలు

విజిటర్స్‌ బుక్‌లో సుఖ్‌బీర్‌ వివరాలు

విజిటర్స్‌ బుక్‌లో సుఖ్‌బీర్‌ వివరాలు నమోదు చేసింది. ఇద్దరూ కలిసి పైకి వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటలకు సుఖ్‌బీర్‌ ఒక్కడే ఫ్లాట్‌ నుంచి వెళ్లిపోయాడు. అతని భుజానికి... ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌ వేలాడుతోంది.

మధ్యలో ఏం జరిగింది?

మధ్యలో ఏం జరిగింది?

తనకు డబ్బు అవసరముందని, రూ.50 వేలు ఇవ్వాలని కుసుమ్‌ను సుఖ్‌బీర్‌ కోరాడు. అప్పటికే క్రెడిట్‌ కార్డు మోసంలో రూ.5 లక్షలు పోగొట్టుకుని కష్టాల్లో ఉన్న కుసుమ్‌... ‘నో' చెప్పింది. అతను బతిమాలాడు.

చివరికి... ఢిల్లీకి రిటర్న్‌ ఫ్లైట్‌ టికెట్‌కైనా డబ్బులు

చివరికి... ఢిల్లీకి రిటర్న్‌ ఫ్లైట్‌ టికెట్‌కైనా డబ్బులు

చివరికి... ఢిల్లీకి రిటర్న్‌ ఫ్లైట్‌ టికెట్‌కైనా డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అవి కూడా ఇవ్వలేనంది. అంతే... ల్యాప్‌టాప్‌ చార్జర్‌ కార్డుతో కుసుమ్‌కు ఉరి బిగించాడు. పెన్నుతో పొడిచి పొడిచి చంపాడు. కుసుమ్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు, సెల్‌ఫోన్లను సుఖ్‌బీర్‌ ఎత్తుకెళ్లాడు.

పోలీసులు కాల్‌ డేటా, ఫేస్‌బుక్‌ అకౌంట్‌, ఇతర ఆధారాలతో

పోలీసులు కాల్‌ డేటా, ఫేస్‌బుక్‌ అకౌంట్‌, ఇతర ఆధారాలతో

బెంగళూరులో రూ.10 వేలు గీకేశాడు. లేట్‌ నైట్‌ ఫ్లైట్‌లో ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ ఏటీఎంల నుంచి మరో 30 వేలు లాగాడు. కుసుమ్‌ ఫోన్‌ను సిటీ బయట పడేశాడు. దానిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్‌ డేటా, ఫేస్‌బుక్‌ అకౌంట్‌, ఇతర ఆధారాలతో గురువారం సుఖ్‌బీర్‌ను అరెస్టు చేశారు.

సుఖ్‌బీర్‌ కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరే!

సుఖ్‌బీర్‌ కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరే!

అన్నట్లు... సుఖ్‌బీర్‌ కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరే! గతంలో యాహూ, యాక్సెంచుర్‌లో పని చేశాడు.

ఫేస్‌బుక్ పరిచయం చివరకు

ఫేస్‌బుక్ పరిచయం చివరకు

ఫేస్‌బుక్ పరిచయం చివరకు ఆ అమ్మాయిని పై లోకాలకు పంపించింది. అందుకే ఫేస్‌బుక్ వాడే సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి. ఎందుకైనా మంచిది. లేకుంటే మొదటికే మోసం వస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Bengaluru techie met her killer on Facebook 19 days before murder
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot