Home
News

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

By Hazarath

ఆపిల్‌కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. చైనాలో అయితే ఆపిల్ కంపెనీ ఇప్పట్లో కోలుకునే మార్గం కనపడ్డం లేదు. ఇప్పుడు చైనా ఇచ్చిన మరో భారీ షాక్ ట్రీట్ మెంట్ కు కుదేలయినట్లయింది. గతంలో ఐ ఫోన్ ట్రేడ్ మార్క్ కేసుపై ఆపిల్ కు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆపిల్ కలవరపడింది. అయితే తాజాగా చైనాలో ఆపిల్ 6 ఫోన్ సీరిస్ అమ్మకాలను తమ దేశ రాజధాని బీజింగ్ లో చేపట్టరాదంటూ చైనీస్ రెగ్యులేటరీ సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది. మరి ఎందుకు అలా చేసిందో మీరు చూడండి.

Readmore: ఆపిల్‌ కంపెనీలో ఉద్యోగం కావాలంటే...

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

తమ దేశ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఐఫోన్-6 సిరీస్ ఉండటం గుర్తించిన రెగ్యులేటర్ ఈ ఆదేశాలు జారీచేసింది. తక్షణమే అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించింది.

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

ఆపిల్ కు రెండో అతిపెద్ద గ్లోబల్ మార్కెట్ గా చైనాలో ఇటీవలే ఐట్యూన్స్ మూవీ సర్వీసులు నిలిపివేశారు. 

 ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

అదేవిధంగా చైనాలోని లోకల్ బ్రాండ్లు షియోమి, హ్యువాయ్ ల నుంచి ఆపిల్ కంపెనీ గట్టి పోటీని ఎదుర్కొంటూ మార్కెట్ షేరును కాపాడుకోవడంలో తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

 ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

అయితే ఇప్పుడు ఆపిల్ కు షాక్ నిస్తూ బీజింగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలను జారీచేసింది. చిన్న చైనీస్ బ్రాండ్ షెన్జెన్ బైలీ 100సీ మోడల్ ను ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్లు పోలీ ఉన్నాయని ట్రిబ్యూనల్ పేర్కొంది.

 ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

ఈ నిషేధ ఆర్డర్ ను ఆపిల్ కు మేలోనే ట్రిబ్యునల్ జారీచేసింది. కానీ ఈ వార్త చైనీస్ ప్రెస్ కు ఈ వారంలోనే అందింది. తాజా ఆదేశాలతో ఆపిల్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ పై బీజింగ్ కోర్టు స్టే విధించిందని ఆపిల్ చెబుతోంది. చైనాలో ఐఫోన్ 6, 6 ప్లస్ అమ్మకాలు చేపడుతున్నామని పేర్కొంది.

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

తన ఐబుక్స్, ఐట్యూన్స్ మూవీ సర్వీసులను ఆపిల్ ఏప్రిల్ లో నిలిపివేసింది. చైనీస్ రెగ్యులేటర్స్ ఆదేశాల మేరకు ఈ సేవలను బంద్ చేసింది. త్వరలోనే ఈ సేవలు చైనాలో పునరుద్ధరించాలని కంపెనీ ఆశిస్తోంది.

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

మరి కంపెనీ తన ప్రస్థానాన్ని చైనాలో ఘనంగా ప్రారంభిస్తుందా లేక మళ్లీ చతికిలపడుతుందా అనేది చూడాలి.

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

ఆపిల్‌కు మరో భారీ షాక్ ఇచ్చిన చైనా

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Apple ordered to suspend iPhone 6 sales in Beijing
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X