ఆపిల్‌ కంపెనీలో ఉద్యోగం కావాలంటే...

By Hazarath
|

ఆపిల్..ప్రపంచ పటంలో దూసుకుపోతున్న దిగ్గజ కంపెనీ. ఈ కంపెనీలో జాబ్ చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. అయితే ఆపిల్ కంపెనీలో జాబ్ కొట్టాలంటే దానికి ఎంతో కష్టపడాడి. మెదడుకి పదును పెట్టాలి. చిన్న కంపెనీలోనే ఇంటర్యూ చాలా కష్టంగా ఉంటే ఇక దిగ్గజ కంపెనీల్లో ఇంటర్యూ ఎలా ఉంటుంది. దీనికి సంబంధించి ఆపిల్ కంపెనీ సీఈఓ కొన్ని క్లూ లు ఇచ్చారు. ఆపిల్ కంపెనీలో జాబ్ కొట్టాలంటే కావాలిసిన అర్హతలను ఆయన ఓ ఇంటర్యూలో ప్రస్తావించారు ఆ వివరాలు మీకోసం.

Read more: 25 ఏళ్ల ఇంటర్నెట్‌కు ఎన్నో రంగులు..

ఇప్పుడు ఆపిల్ కంపెనీ ఉద్యోగులు
 

ఇప్పుడు ఆపిల్ కంపెనీ ఉద్యోగులు

ఆపిల్ కంపెనీలో సంసృతిని నిర్మించడానికి అక్కడ ఉద్యోగులను మాకు అనుగుణంగా మార్చుకోడానికి చాలా సమయమే పట్టిందని కుక్ అన్నారు. ఇప్పుడు ఆపిల్ కంపెనీ ఉద్యోగులు ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉన్నారని ఆపిల్ సీఈఓ చెప్పారు.

వారి గురించి తెలుసుకోవడమంటే

వారి గురించి తెలుసుకోవడమంటే

ఆపిల్ కంపెనీ ఉద్యోగుల ఆపిల్ కోసమే పనిచేస్తారు. వారి గురించి తెలుసుకోవడమంటే అమెరికా సీఐఎ రహస్యాలు తెలుసుకోవడం కన్నా చాలా కష్టమైనదంటూ ఇంటర్యూలో జోకులు పేల్చారు

60 నిమిషాల ఇంటర్యూలో చార్లే రోజ్ అడిగిన ప్రశ్నలకు

60 నిమిషాల ఇంటర్యూలో చార్లే రోజ్ అడిగిన ప్రశ్నలకు

60 నిమిషాల ఇంటర్యూలో చార్లే రోజ్ అడిగిన ప్రశ్నలకు టిమ్ కుక్ జవాబులు ఇచ్చారు. ఆపిల్ ఎటువంటి ఉద్యోగులను కోరుకుంటోంది అని అడగ్గా దానికి కుక్ ఆపిల్ కు ప్రపంచాన్ని మార్చే యోధులను కోరుకుంటోందని చెప్పారు.

వారు మనసులో ఎటువంటి నెగిటివ్ మైండ్స్ ఉండకూడదు
 

వారు మనసులో ఎటువంటి నెగిటివ్ మైండ్స్ ఉండకూడదు

వారు మనసులో ఎటువంటి నెగిటివ్ మైండ్స్ ఉండకూడదు. అలాగే ఎటువంటి విషయాల్లోనూ రాజీ పడకూడదు. వారు ప్రపంచాన్ని మార్చాలి. అలాంటి వారు మాకు కావాలని ఆపిల్ సీఈఓ అన్నారు.

వారు ప్రపంచాన్ని మార్చాలని

వారు ప్రపంచాన్ని మార్చాలని

ఇతర కంపెనీల్లో సాధారణంగా వేరే దృష్టితో ఉద్యోగలు ఆ కంపెనీలో పనిచేస్తుంటారు. అయితే ఆపిల్ కంపెనీలో అలా కాదు. వారు ప్రపంచాన్ని మార్చాలని పనిచేస్తారు. వారికంటూ ఓ అభిరుచి ఉంటుంది. దానికనుగుణంగా వారు పనిచేయవలిసి ఉంటుంది.

ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఎక్కువ సమయం

ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఎక్కువ సమయం

అలాగే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకునేవారిని ఆపిల్ కంపెనీ ఇష్టపడదు. వారి దేన్నీ అంత తేలిగ్గా అంగీకరించకూడదు. దాన్ని మేము మారుస్తామని చెప్పాలి. అలాంటి వారే ఆపిల్ కంపెనీకి కావాలని కుక్ తెలిపారు.

అంతర్గత విషయాలతో సతమతమయ్యే వారికి

అంతర్గత విషయాలతో సతమతమయ్యే వారికి

అంతర్గత విషయాలతో సతమతమయ్యే వారికి ఆపిల్ కంపెనీలో ఛాన్స్ లేదు. వారిని ఆపిల్ కంపెనీ అసలు పరిగణలోకి తీసుకోదు. అంతర్గతంగా ఎన్ని అవాంతరాలెదురైనా వాటిని లెక్కచేయక ముందుకు సాగేవారిని ఆపిల్ కంపెనీ కోరుకుంటోంది. వాటికోసం బాధపడకుండా వాటికి పరిష్కారమార్గాలను వెతికే ఆలోచన చేసేవారే మాకు కావాలి.

అసలు ఆ విషయాల గురించి ఆలోచనే వారి మదిలోకి

అసలు ఆ విషయాల గురించి ఆలోచనే వారి మదిలోకి

అసలు ఆ విషయాల గురించి ఆలోచనే వారి మదిలోకి రాకూడదు. వాటిని అంగీకరించకూడదు. అటువంటి ఉత్తమ లక్షణాలున్న వారినే ఆపిల్ కంపెనీ కోరుకుంటోంది అని ఇంటర్యూలో కుక్ అన్నారు.

మేము వారికి ఎటువంటి టెస్ట్ లు పెట్టమని

మేము వారికి ఎటువంటి టెస్ట్ లు పెట్టమని

అయితే ఆ లక్షణాలున్న వారి మీ కంపెనీకి రెజ్యూమ్ పంపిస్తే మీరెలా స్పందిస్తారని రోజ్ పాయింట్ అవుట్ చేస్తే దానికి కుక్ అదిరిపోయో సమాధానం ఇచ్చారు. మేము వారికి ఎటువంటి టెస్ట్ లు పెట్టమని వారిని డైరక్ట్ గా కంపెనీలోకి ఆహ్వనిస్తామని ఆయన అన్నారు.

చదివిన దాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పేవారిని

చదివిన దాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పేవారిని

ఆపిల్ కంపెనీకి 10 నుంచి 12 మంది ఇంటర్యూకు వస్తే వారిలో ఎవరు ఢిపరెంట్ పాయింట్ వ్యూస్ మాకు చెబుతారో వారినే మేము సెలక్ట్ చేసుకుంటాం. అంతేకాని చదివిన దాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పేవారిని అసలు పరిగణలోకి తీసుకోమని కుక్ అన్నారు.

 ప్రపంచాన్ని మార్చే శక్తికి పనికివచ్చే పాయింట్ ఆఫ్ వ్యూస్

ప్రపంచాన్ని మార్చే శక్తికి పనికివచ్చే పాయింట్ ఆఫ్ వ్యూస్

అయితే ఆ 12 మందిలో కూడా మీకు సరిపడా ఉన్నవారి లేనప్పుడు మీరు ఎవరిని తీసుకుంటారన్న ప్రశ్నకు ప్రపంచాన్ని మార్చే శక్తికి పనికివచ్చే పాయింట్ ఆఫ్ వ్యూస్ ఏమైనా వారిదగ్గర ఉంటే వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని కుక్ అన్నారు.

అంతిమంగా ఆపిల్ కంపెనీకి కావాల్సింది

అంతిమంగా ఆపిల్ కంపెనీకి కావాల్సింది

అంతిమంగా ఆపిల్ కంపెనీకి కావాల్సింది ఈ ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో వారు మాత్రమే ఆపిల్ కంపెనీలో జాబ్ చేయడానికి అర్హులు అని కుక్ చెప్పారు. చర్చల్లో వారు సరికొత్త విషయాలను బయటకు తీసుకురావాలి. వారు ఆ పాయింట్లతో మాత్రమే ముందుకు దూసుకువెళ్లాలన్నారు.

ఉత్తమంగా ఆలోచించేవారికి ఎల్లప్పుడూ

ఉత్తమంగా ఆలోచించేవారికి ఎల్లప్పుడూ

ఉత్తమంగా ఆలోచించేవారికి ఎల్లప్పుడూ ఆపిల్ కంపెనీ తలుపులు తెరిచే ఉంటాయని, వారు సరికొత్తగా ప్రపంచం గురించి ఆలోచించాలని అటువంటి వారు ఆపిల్ కంపెనీకి ఇంటర్యూకు వస్తే వారికి ఎటువంటి పరీక్షలు పెట్టకుండానే తీసుకుంటామంటూ కుక్ తన ఇంటర్యూని ముగించారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write how to get a job at Apple according to CEO Tim Cook

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X