యాపిల్‌కు చైనా కంపెనీ ఝలక్

Posted By:

ఐ- ఫోన్లను తయారు చేసే యాపిల్ సంస్థకు.. చైనా మొబైల్ అడ్వర్టైజింగ్ కంపెనీ ఝలక్ ఇచ్చింది. యాపిల్ స్టోర్ లో అందుబాటులో ఉన్న యాప్స్ ను ఉపయోగించి.. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సేకరించడం మొదలుపెట్టింది. దీంతో యాపిల్ కంపెనీ.. తన స్టోర్స్ నుంచి భారీ స్థాయిలో యాప్స్ తొలగించాల్సిన పరిస్థితి తలెత్తింది. యాపిల్ హాండ్ సెట్ లో రహస్యంగా అమర్చిన కిట్ ద్వారా.. చైనాకు చెందిన మొబైల్ అడ్వర్టైజింగ్ ప్రొవైడర్ యూమీ యూజర్ ఐడీలు, మెయిల్ అడ్రస్ లు, డివైజ్ ఐడీలు, సర్వర్ కంపెనీ నుంచి ఇంటర్నెట్ రూట్ అయిన డేటా వంటి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తాము గుర్తించామని యాపిల్ వర్గాలు వివరించాయి.దీంతో యాపిల్ స్టోర్ లోని 250కి పైగా ఎస్డీకే యాప్ లను తొలగించారు.

Read more: హానర్ 7 : 10 స్టన్నింగ్ ఫీచర్స్

దీంతో పాటు భవిష్యత్ లో కూడా ఎస్డీకే అప్లికేషన్లను అనుమతించబోమని ఆ సంస్థ స్పష్టం చేసింది. తొలగించిన అప్లికేషన్స్ స్థానంలో అతి త్వరలో అప్ డేటెడ్ వెర్షన్స్ ను అందించేందుకు తమ సిబ్బంది పనిచేస్తున్నారని.. వీటిని త్వరలోనే రీప్లేస్ చేస్తామని ప్రకటించింది. తమ స్టోర్ నుంచి అనధికారికంగా.. డేటాను వాడుకోవడం.. యూజర్ల వ్యక్తిగత వివరాలు సేకరించడం.. చట్టరీత్యా నేరమని.. ఇది కంపెనీ లీగల్, ప్రైవసీ ఒప్పందాలను ఉల్లంఘించడమే అని యాపిల్ స్పష్టం చేసింది. త్వరలోనే చైనా కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యోచిస్తున్నామని తెలిపింది.యాపిల్ ఫోన్ చరిత్రను ఓ సారి పరిశీలిద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐప్యాడ్ రెటీనా డిస్‌ప్లేను

యాపిల్ ఐప్యాడ్ రెటీనా డిస్‌ప్లేను వాస్తవానికి తయారు చేసింది సామ్‌సంగ్.

 

 

యాపిల్ కంప్యూటర్ల దగ్గర పొగత్రాగితే

యాపిల్ కంప్యూటర్ల దగ్గర పొగత్రాగితే వారంటీని కోల్పొవల్సి వస్తుంది.

 

 

యాపిల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా

యాపిల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 90,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు.

 

 

యాపిల్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు

యాపిల్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఏడాదికి పొందే సగటు వేతనం 1,25,000 యూఎస్ డాలర్లు.,

 

 

2012లో యాపిల్ రోజుకు

2012లో యాపిల్ రోజుకు 3,40,000 ఐఫోన్‌లను విక్రయించగలిగింది.

 

 

యాపిల్ కంపెనీ ఆదాయం నిమిషానికి

యాపిల్ కంపెనీ ఆదాయం నిమిషానికి 300000 యూఎస్ డాలర్లు,

 

 

యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు

యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అప్పట్లో తన షేర్లను కేవలం 800 డాలర్లకు విక్రయించారు. ఇప్పుడు వాటి విలువ 35 బిలియన్ డాలర్లు.

సిరి వాయిస్ యాప్‌కు చెప్పే ప్రతి మాట

సిరి వాయిస్ యాప్‌కు చెప్పే ప్రతి మాట యాపిల్ కంపెనీని పంపబడుతుంది. ఆ పదాలను విశ్లేషించి స్టోర్ చేస్తారు.

 

 

యూఎస్ ఖజానాతో పోలిస్తే..

యూఎస్ ఖజానాతో పోలిస్తే యాపిల్ ఎక్కవ ఆపరేటింగ్ క్యాష్‌ను కలిగి ఉంది.

 

 

ప్రపంచవ్యాప్తంగా ఒక్క సెకను కాలంలో

ప్రపంచవ్యాప్తంగా ఒక్క సెకను కాలంలో డౌన్‌లోడ్ కాబడుతున్న యాపిల్ అప్లికేషన్ల సంఖ్య 800.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple Removes Over 250 iOS Apps With Ad SDK That Collects Personal User Data
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot