ఫ్లిప్‌కార్డ్‌తో జతకట్టి ఆపిల్ కుమ్మేసింది

Written By:

పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టిన ఆపిల్ తన ఐఫోన్ 7 విక్రయాలను అదే ఊపులో అదరగొట్టింది. దాదాపు ఎన్నడూ జరగనంతగా ఆపిల్ ఐఫోన్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరిగాయి. నేరుగా ఇంటికే ఆపిల్ ఫోన్ అన్న కాన్సెప్ట్ కూడా ఆపిల్‌కు బాగా కలిసొచ్చింది. అదీగాక శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేళుళ్లు కూడా దీనికి బాగా కలిసొచ్చింది.

జీఎం నుంచి సరికొత్త మొబైల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తన ఐఫోన్ 7 అమ్మకాల్లో

ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టిన వేళా విశేషం ఏంటోగాని ఆపిల్ గత నెల్లో తన ఐఫోన్ 7 అమ్మకాల్లో దుమ్ము రేపింది. అక్టోబర్‌లో 50 శాతం ఐఫోన్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌తోనే జరిగినట్టు తెలిసింది.

దోస్తీ బాగా సహకరించిందని

ఆపిల్‌కు ఎలాంటి అవుట్ టెల్స్ లేకపోవడంతో, సిటీలకు, పట్టణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డెలివరీ చేయడానికి ఈ దోస్తీ బాగా సహకరించిందని ఆపిల్ సంబరపడుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ విక్రయాలు

ఆపిల్ లేటెస్ట్‌గా తీసుకొచ్చిన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ విక్రయాలు అక్టోబర్‌లో దాదాపు 2.6 లక్షల యూనిట్ల సరుకు రవాణా జరిగినట్టు టెక్నాలజీ పరిశోధన సంస్థ సైబర్ మీడియా తెలిపింది.

ఎక్కువ శాతం ఐఫోన్ విక్రయాలు

అయితే ఎక్కువ శాతం ఐఫోన్ విక్రయాలు ఎక్స్చేంజ్ ఆఫర్లోనే జరిగినట్టు పేర్కొంది. 70 శాతం ఆండ్రాయిడ్ ఫోన్లను ఐఫోన్ 7 ల కోసం ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు వివరించింది. 30 శాతం ముందటి తరం ఐఫోన్లకు అప్‌గ్రేడ్‌గా తీసుకున్నట్టు తెలిపింది.

శాంసంగ్ నోట్ 7

శాంసంగ్ నోట్ 7 ఎదుర్కొంటున్న పేలుళ్ల సమస్య కూడా ఆపిల్‌కు బాగా కలిసి వచ్చినట్టు సైబర్ మీడియా తెలిపింది. ఒక్క భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా శాంసంగ్ గెలాక్సీ పేలుళ్ల సమస్య ఆపిల్‌కు లబ్ది చేకూర్చిందని తెలిపింది.

సంప్రదాయానికి భిన్నంగా

మొదటిసారి సంప్రదాయానికి భిన్నంగా, ఈ పండుగ సీజన్‌లో ఆన్ లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టి, డైరెక్ట్‌గా తానే ఐఫోన్ విక్రయాలను భారత్‌లో చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple rides Flipkart to push iPhone 7 read more ati gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot