Apple MacBook Pro ఈ మోడళ్లకు ఉచితంగా బ్యాటరీని రీప్లేస్మెంట్ చేసుకునే గొప్ప అవకాశం..

|

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారుల ముందుకు ఒక గొప్ప శుభవార్తతో ముందుకు వచ్చింది. వివరాలలోకి వెళితే కొన్ని మాక్‌బుక్ మోడళ్లకు బ్యాటరీలను ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్లు ఆపిల్ యొక్క మద్దతు పేజీలో ప్రకటించింది. ఆపిల్ సంస్థ యొక్క పోస్ట్ ప్రకారం 2016 మరియు 2017 సంవత్సరంలో విడుదలైన మాక్‌బుక్ ప్రో కంప్యూటర్‌ల కస్టమర్‌లు తక్కువ సంఖ్యలో బ్యాటరీ 1% దాటకుండా ఉండే సమస్యను ఎదుర్కొంటున్నారు. అటువంటి వారికి ఈ రీప్లేస్మెంట్ స్కీమ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

మాక్‌బుక్ ప్రో మోడళ్ బ్యాటరీ రీప్లేస్మెంట్ స్కీమ్

మాక్‌బుక్ ప్రో మోడళ్ బ్యాటరీ రీప్లేస్మెంట్ స్కీమ్

కేవలం ఒక శాతం కూడా బ్యాటరీ ఛార్జ్ చేయని 2016 మరియు 2017 మాక్‌బుక్ ప్రో మోడళ్లలో బ్యాటరీ రీప్లేస్మెంట్ స్కీమ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం వెనుక గల కారణాన్ని పేర్కొననప్పటికీ ఈ సమస్యను చాలా తక్కువ మంది వినియోగదారులు ఎదురుకుంటున్నట్లు కుపెర్టినో టెక్ సంస్థ ఆపిల్ తెలిపింది. బ్యాటరీ రీప్లేస్మెంట్ కార్యక్రమంతో పాటు ఆపిల్ మాకోస్ బిగ్ సుర్ 11.2.1 అప్‌డేట్‌ను కూడా విడుదల చేసింది. ఇది బ్యాటరీ ఛార్జింగ్ సమస్యలను 2016 మరియు 2017 మాక్‌బుక్ ప్రో మోడళ్లలో పరిష్కరించడానికి ఉద్దేశించబడింది. బ్లూటూత్ కనెక్టివిటీ మరియు ఎక్సటర్నల్ డిస్ప్లే సమస్యలకు పరిష్కారాలను కలిగి ఉన్న మాకోస్ బిగ్ సుర్ 11.2 అప్‌డేట్‌ వచ్చిన కొద్ది వారాలకే మరొక కొత్త అప్‌డేట్‌ వస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బ్యాటరీ లైఫ్ స్టేటస్

2016 మరియు 2017 సంవత్సర మోడల్ మాక్‌బుక్ ప్రో ను కలిగిన వినియోగదారులు బ్యాటరీ లైఫ్ స్టేటస్ ద్వారా రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌కు అర్హతను కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేయవచ్చు. అది "సర్వీస్ రెకమెండేడ్" మెసేజ్ చూపుతుంది. మాకోస్ బిగ్ సుర్‌లో ఆపిల్ మెను> సిస్టమ్ ప్రిఫరెన్స్ > బ్యాటరీ పద్దతులను అనుసరించడం ద్వారా బ్యాటరీ లైఫ్ స్టేటస్ ను పొందవచ్చు. మాకోస్ కాటాలినా మరియు మునుపటి వెర్షన్ లలో మెను బార్‌లోని బ్యాటరీ గుర్తుని క్లిక్ చేయడం ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు.

ఆపిల్ బ్యాటరీ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌కు అర్హత

మీ బ్యాటరీ సాధారణమైన స్థితిలో ఉంది అని స్టేటస్ సూచిస్తే మీ బ్యాటరీ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌కు ప్రభావితం కాదు అని ఆపిల్ ఒక మద్దతు పేజీలో తెలిపింది. ఒకవేళ మీ మాక్‌బుక్ ప్రో మోడల్ బ్యాటరీ ఛార్జింగ్ సమస్యతో ప్రభావితమైందని చూపితే కనుక రీప్లేస్మెంట్ చేసుకోవడానికి మీరు ఆపిల్‌ను ఉచితంగా భర్తీ చేయడానికి సంప్రదించవచ్చు. అయితే ఉచిత బ్యాటరీ రీప్లేస్మెంట్ కోసం మీ యొక్క డివైస్ అర్హత ఉందో లేదో ధృవీకరించడానికి ఆపిల్ సర్వీస్ ముందుగా మోడల్‌ను పరిశీలిస్తుంది.

మాకోస్ బిగ్ సుర్ 11.2.1 అప్‌డేట్

మాకోస్ బిగ్ సుర్ 11.2.1 అప్‌డేట్

2016 మరియు 2017 మాక్‌బుక్ ప్రో మోడళ్లలో కొత్తగా విడుదలైన మాకోస్ బిగ్ సుర్ 11.2.1 కు అప్‌డేట్ చేయమని లేదా మాకోస్ కాటాలినా 10.15.7 సప్లిమెంటల్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయాలని ఆపిల్ సంస్థ తన యొక్క వినియోగదారులకు సిఫారసు చేస్తుంది. కొత్త మాకోస్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయడం వల్ల బ్యాటరీ సమస్య మరియు ఇతర సమస్యలు 2016 మరియు 2017 మాక్‌బుక్ ప్రో మోడళ్లలో జరగకుండా నిరోధించవచ్చని కంపెనీ గుర్తించింది.

Best Mobiles in India

English summary
Apple Provide Great Opportunity to Replace Battery For Free on These MacBook Pro Models

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X