ఆపిల్ కంపెనీ ఇండియాకి తరలివస్తోంది !

Written By:

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రారాజు ఏది అంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం ఐఫోన్.ఈ ఫోన్ చేతిలో ఉంటే ఆ స్టైలే వేరని భావించేవారు చాలామందే ఉంటారు. అయితే ఆ ఫోన్లు ఎక్కడో విదేశాల్లో తయారయి మనదేశానికి వస్తాయి. ఇప్పుడు అలా కాకుండా మనదేశంలోనే అవి తయారైతే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆపిల్ ఆ దిశగా అడుగుల వేస్తోంది.

జియోకు అదిరే షాక్..లైఫ్ ఫోన్లు పేలిపోతున్నాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ను నెలకొల్పేందుకు సంసిద్ధత

ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ భారత్లో తన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వం కనుక తగిన రాయితీలు కల్పిస్తే యూనిట్ ఏర్పాటుకు తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని కేంద్ర రెవెన్యూ, ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖలకు తెలిపినట్టు సమాచారం.

మొత్తం ఆరు దేశాల నుంచి ఉత్పత్తి

అమెరికా, కొరియా, జపాన్, దేశాల్లో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్న ఆపిల్ సంస్థ భారత్లోనూ ఓ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆపిల్ ఉత్పత్తులు కొరియా, జపాన్, అమెరికాతోపాటు మొత్తం ఆరు దేశాల నుంచి ఉత్పత్తి అవుతున్నాయి.

అప్పట్లో ఉన్న నిబంధనల కారణంగా

ఇందుకోసం మేలోనే కేంద్ర ఆర్థిక శాఖకు దరఖాస్తు చేసుకుంది. అయితే విదేశీ పెట్టుబడుల విషయంలో అప్పట్లో ఉన్న నిబంధనల కారణంగా ఆమోదం లభించలేదు. సింగిల్ బ్రాండ్ రిటైల్ సెగ్మెంట్లో పెట్టుబడులు పెట్టేందుకు 30 శాతం వస్తువులను స్థానికంగా సేకరించాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలని గతంలో ఆపిల్ కోరగా .. కేంద్రం నిరాకరించింది.

తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు

ప్రస్తుతం తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ రకాల ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు మోడిఫైడ్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీ స్కీం (ఎంఎస్ఐపీఎస్) ను కేంద్రం ప్రకటించింది.

హార్డ్వేర్ తయారీ యూనిట్లు స్థాపించేందుకు పలు రాయితీలు

అంతేకాక ప్రత్యేక ఆర్థిక జోన్లలో ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ తయారీ యూనిట్లు స్థాపించేందుకు పలు రాయితీలు కల్పించింది. అందువల్ల ఇండియాలో ప్లాంట్ ఏర్పాటుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆపిల్ సంస్థ మరోమారు

దీంతో ఆపిల్ సంస్థ మరోమారు తన ఆసక్తిని వెల్లడించింది. కేంద్ర రెవెన్యూ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలకు సమాచారం అందించింది. ఆపిల్ దరఖాస్తుపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple seeks incentives to set up manufacturing unit in India read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting