ఆపిల్ కంపెనీకి, అమెరికాకు రూ.లక్ష కోట్ల షాక్

By Hazarath
|

అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ప్రపంచ మార్కెట్లో దూసుకుపోతున్న టెక్ రారాజు ఆపిల్ కంపెనీకి యూరోపియన్ యూనియన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. దాదాపు రూ. లక్ష కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు పంపించింది. అయితే ఈ విషయంపై ఆపిల్ అలాగే అగ్రదేశం అమెరికా ఇప్పుడు కిందా మీదా పడుతోంది. దీనిపై న్యాయపోరాటం చేస్తోంది.

 

mobiles, Tablets, Laptops

మీ మొబైల్ 4జీ సపోర్ట్ చేస్తుందా..చెక్ చేసుకోండిలా..

ఐర్లాండ్లో అమ్మకాలు జరిపే తన ఉత్పత్తులపై

ఐర్లాండ్లో అమ్మకాలు జరిపే తన ఉత్పత్తులపై

తన ఉత్పత్తులపై పన్నులు చెల్లించకుండా ఉండేందుకు ఐర్లాండ్ ప్రభుత్వంతో ఆపిల్ కంపెనీ చేసుకున్న ఒప్పందాలన్నీ చట్టవిరుద్ధమైనవి ఈయూ స్పష్టం చేసింది. ఈ ఒప్పందాల వల్ల ఐర్లాండ్లో అమ్మకాలు జరిపే తన ఉత్పత్తులపై కంపెనీ పూర్తిస్థాయిలో పన్నుమినహాయింపు పొందిందని, ఇది సరైనది కాదని పేర్కొంది.

పాత పన్నుల కింద 1,300 కోట్ల యూరోలు (రూ.లక్ష కోట్లు)

పాత పన్నుల కింద 1,300 కోట్ల యూరోలు (రూ.లక్ష కోట్లు)

ఇందులో భాగంగా ఆపిల్ కంపెనీకి యూరోపియన్ యూనియన్ (ఇయు) భారీ పన్ను నోటీసు పంపింది. చెల్లించాల్సిన పన్నులు న్యాయబద్ధంగా చెల్లించకపోవడం వ్లల పాత పన్నుల కింద 1,300 కోట్ల యూరోలు (రూ.లక్ష కోట్లు) చెల్లించాలని యూరోపియన్ యూనియన్ కోరింది.

డబ్లిన్ అంగీకారాన్ని సాకుగా చూపుతూ
 

డబ్లిన్ అంగీకారాన్ని సాకుగా చూపుతూ

డబ్లిన్ అంగీకారాన్ని సాకుగా చూపుతూ ఆపిల్ సంస్థ చట్టవిరుద్ధంగా అన్ని రకాల పన్నులు ఎగవేసిందని ఇయు పేర్కొంది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న ఆపిల్ కంపెనీ అలాగే ఐరిష్ ప్రభుత్వం ఇయు తీర్పుపై తాము అప్పీలుకు వెళతామని ప్రకటించాయి.

అంతర్జాతీయ విక్రయాలన్నీ ఈ కేంద్రం ద్వారానే

అంతర్జాతీయ విక్రయాలన్నీ ఈ కేంద్రం ద్వారానే

2008 లోనే ఐర్లాండ్లోని కార్క్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన ఆపిల్ అంతర్జాతీయ విక్రయాలన్నీ ఈ కేంద్రం ద్వారానే నిర్వహిస్తూ లక్షలాది కోట్ల యూరోల పన్నులు ఎగవేస్తూ వస్తోంది.

ఈ కార్యాలయం లో ఐదు వేల మంది

ఈ కార్యాలయం లో ఐదు వేల మంది

ఈ కార్యాలయం లో ఐదు వేల మంది పని చేస్తున్నారు. అయితే ఐర్లాండ్లోని ఈ ప్రధాన కార్యాలయం కాగితాలకే పరిమితమని, ఇక్కడ ఉద్యోగులు గాని, కార్యకలాపాలు గాని వాస్తవంగా ఏవీ లేవని యూరోపియన్ యూనియన్ కాంపిటీషన్ కమిషనర్ మార్గరెట్ వెస్తాగర్ తీర్పు చెప్పారు.

జరిమానా కాదని కేవలం అంతకు ముందుకు చెల్లించకుండా తప్పించుకున్న పన్నులు మాత్రమే

జరిమానా కాదని కేవలం అంతకు ముందుకు చెల్లించకుండా తప్పించుకున్న పన్నులు మాత్రమే

ఆపిల్ కంపెనీకి ఇది జరిమానా కాదని కేవలం అంతకు ముందుకు చెల్లించకుండా తప్పించుకున్న పన్నులు మాత్రమే డిమాం డ్ చేశామని అధికారులు చెబుతున్నారు. డబ్లిన్ పన్ను మినహాయింపులు వర్తింపచేయడం చట్టవిరుద్ధమే అవుతుందా అన్న అంశంపై దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఈ రకమైన ఉత్తర్వులు జారీ చేశారు.

ఉద్రిక్తంగా మారిన వాషింగ్టన్, బ్రసెల్స్ మధ్య వాతావరణం

ఉద్రిక్తంగా మారిన వాషింగ్టన్, బ్రసెల్స్ మధ్య వాతావరణం

అయితే ఇప్పుడు ఆపిల్, అమెజాన్, స్టార్బక్స్, ఫియట్ క్రిస్లర్ వంటి కంపెనీలు లక్ష్యంగా చేసుకుని వరుసగా యాంటీ ట్రస్ట్ దర్యాప్తు చేపట్టడంతో వాషింగ్టన్, బ్రసెల్స్ మధ్య వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ తీర్పుపై తాము అప్పీలు చేస్తామని. ఆ నిర్ణయం వీగిపోతుందన్న విశ్వాసం తమకున్నదని ఆపిల్ తెలిపింది.

ఈ విషయంపై అమెరికా సీరియస్

ఈ విషయంపై అమెరికా సీరియస్

అయితే ఈ విషయంపై అమెరికా సీరియస్ అవుతోంది. కారాలు మిరియాలు నూరుతోంది. ఇయుతో ఆర్థిక భాగస్వామ్యాన్ని కుదించుకునే అంశం పరిశీలిస్తామని అమెరికా ఆర్థిక శాఖ హెచ్చరించింది.

 

 

Best Mobiles in India

English summary
Here Write Apple slapped with $533 million fine for patent violation

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X