షాక్...అమెజాన్‌లో ఆ వస్తువులన్నీ ఫేక్ !

Written By:

ఆపిల్ కంపెనీ వస్తువులను అమెజాన్ లో కొంటున్నారా..అయితే కొనే ముందు ఓ సారి చెక్ చేసుకోండి.అమెజాన్ లో ఆపిల్ లోగోతో ఫేక్ వస్తువులు అమ్ముడుబోతున్నాయని సాక్షాత్తు ఆపిల్ కంపెనీనే చెబుతోంది. ఇవి ఆపిల్ ఉత్పత్తులు కావని వీటి లోగోలు కూడా చాలా తేడాగా ఉన్నాయంటూ కోర్టులో కేసు వేసింది. అయితే అమెజాన్ కూడా ఈ విషయంపై సీరియస్ అయింది.

బ్యాంకు డెబిట్ కార్డులు హ్యాకయ్యాయి, వెంటనే చెక్ చేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్, గ్రూపాన్ లు

ఈ-కామర్స్ వెబ్ సైట్లు అమెజాన్, గ్రూపాన్ లు అధికారికంగా అమ్ముతున్న ఆపిల్ మొబైళ్లకు సంబంధించిన కొన్ని వస్తువులు నకిలీవని కంపెనీ ప్రకటించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆపిల్ మొబైల్ స్టార్ ఎల్ఎల్సీ'పై కోర్టులో కేసు

ఈ మేరకు అమెరికాకు చెందిన ఆపిల్ ఉత్పత్తుల అమ్మకదారు 'మొబైల్ స్టార్ ఎల్ఎల్సీ'పై కోర్టులో కేసు వేసింది. 'మొబైల్ స్టార్ ఎల్ఎల్సీ' ఈ-కామర్స్ సైట్లకు అందిస్తున్న ఆపిల్ ఉత్పత్తుల్లో 90శాతం నకిలీవని పిటిషన్ లో పేర్కొంది.

ఆపిల్ యూఎస్ బీ కేబుల్స్, పవర్ అడాప్టర్లు

అమెజాన్ లో అమ్ముడవుతున్న ఆపిల్ యూఎస్ బీ కేబుల్స్, పవర్ అడాప్టర్లు నకిలీవని అమెజాన్ బ్రాండ్ కు ఉన్న వ్యాల్యూతో వినియోగదారులను 'మొబైల్ స్టార్ ఎల్ఎల్సీ' మోసం చేస్తోందని ఆపిల్ ఆరోపించింది. అమెజాన్ లో లభ్యమవుతున్న పది రకాల ఆపిల్ ప్రొడక్ట్స్ లో తొమ్మిది నకిలీవని చెప్పింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

15లక్షల డాలర్లు

కాపీరైట్స్ నిబంధనల ఉల్లంఘన కింద 15లక్షల డాలర్లు, ఆపిల్ కంపెనీ పేరును ఉపయోగించి వినియోగదారులను మోసం చేస్తున్నందుకు మరో రెండు మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని కోరింది.

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

కాగా, దీనిపై స్పందించిన అమెజాన్ నకిలీ వస్తువుల అమ్మకాన్ని కంపెనీ సహించబోదని తెలిపింది. తయారీదారులు, ప్రముఖ కంపెనీలతో కలిసి తాము పనిచేస్తామని చెప్పిన అమెజాన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple Sues Accessory Makers for Selling Fake Products on Amazon, Groupon read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting