బ్యాంకు డెబిట్ కార్డులు హ్యాకయ్యాయి, వెంటనే చెక్ చేసుకోండి

Written By:

బ్యాంకు లావాదేవీలు కార్డులు ద్వారా జరిపేవారికి ఇది నిజంగా షాక్ లాంటి వార్తే...దేశంలో ప్రధాన బ్యాంకుల కష్టమర్ల డెబిట్ కార్డులు హ్యాకయ్యాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులకు చెందిన లక్షల కార్డులు హ్యాకింగ్ భారీన పడ్డాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్ల గురించి షాకింగ్ నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రధాన బ్యాంకు కంపెనీల డెబిట్ కార్డులు

ఇండియలోని ప్రధాన బ్యాంకు కంపెనీల డెబిట్ కార్డులు హ్యాకయ్యాయి. చైనాలోని పలు ప్రాంతాల నుంచి తమ డెబిట్ కార్డులను వాడుతున్నట్టు కష్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దాదాపు 32 లక్షల డెబిట్ కార్డుల వివరాలు

దాదాపు 32 లక్షల డెబిట్ కార్డుల వివరాలు హ్యాకర్ల బారిన పడ్డట్టు అధికారులు అనుమానిస్తున్నారు. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులకు చెందిన కార్డులే అత్యధికంగా ఉన్నాయని తెలుస్తోంది.

ఏటీఎంలలోకి మాల్ వేర్

వీసా, మాస్టర్ కార్డ్ ప్లాట్ ఫాంపై వాడుతున్న 26 లక్షల కార్డులతో పాటు రూపే ప్లాట్ ఫాంపై వాడుతున్న 6 లక్షల కార్డుల వివరాలు అక్రమార్కులకు చేరినట్టు తెలుస్తోంది. హ్యాకర్లు ఏటీఎంలలోకి మాల్ వేర్ ను ప్రవేశపెట్టి కార్డు నంబర్, పిన్ వివరాలు తెలుసుకుని డబ్బు నొక్కేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లోపాలను కనుగొనే దిశగా

ఇప్పటికే సెక్యూరిటీ సేవల సంస్థ ఎస్ఐఎస్ఏ, బెంగళూరు కేంద్రంగా సాగిన చెల్లింపులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, తప్పుడు లావాదేవీల సమాచారాన్ని బయటపెట్టింది. మరోవైపు పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సైతం భారత సర్వర్లలోని లోపాలను కనుగొనే దిశగా విచారణకు ఆదేశించింది.

ఎన్పీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ హోతా

బ్యాంకుల డెబిట్ కార్డు మోసాలపై ఇప్పటికే వందలాది ఫిర్యాదులు అందాయని వెల్లడించిన ఎన్పీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ హోతా, అనుమానాస్పద లావాదేవీలన్నీ చైనా నుంచి సాగాయని స్పష్టం చేశారు. లోపం ఎక్కడ ఉందన్న విషయాన్ని విచారణ తరువాతే నిగ్గు తేలుస్తామని తెలిపారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏటీఎం సెంటర్లలో పిన్ నంబర్లు

హెచ్‌డీ‌ఎఫ్‌సీ యేతర ఏటీఎం సెంటర్లలో పిన్ నంబర్లు మార్చుకున్న అన్ని కార్డుల వివరాలూ బయటకు పొక్కినట్టు అనుమానిస్తున్నామని హెచ్‌డీ‌ఎఫ్‌సీ వెల్లడించింది. కస్టమర్లంతా పిన్ నంబర్ మార్చుకోవాలంటే హెచ్‌డీ‌ఎఫ్‌సీ ఏటీఎంలను మాత్రమే వాడాలని సలహా ఇచ్చింది.

తమ ఏటీఎంలలో ఎలాంటి లోపాలూ లేవని

కాగా, తమ ఏటీఎంలలో ఎలాంటి లోపాలూ లేవని, ఎస్‌బీఐ కార్డులుండి ఇతర నెట్ వర్క్ ఏటీఎంలు వాడిన వారి కార్డులన్నీ మారుస్తున్నట్టు ఎస్‌బీఐ బ్యాంకు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్యాంకులు స్పందించాల్సి వుంది

మరి ఏటీఎం కార్డుల మోసాలపై వీసా, మాస్టర్ కార్డ్, ఐసీఐసీఐ, యాక్సిస్, యస్ బ్యాంకులు స్పందించాల్సి వుంది. ఇప్పటికే ఎస్ బిఐ కొంతమంది డెబిట్ కార్డులను బ్లాక్ చేసి కొత్త కార్డులను పంపిస్తున్నామని తెలిపింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Over 30 lakh debit cards hacked in India: 10 things to know read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot