ఐ ఫోన్ కుప్పకూలుతోంది..

By Hazarath
|

మార్పు ఒక్కటే శాశ్వతం అంటారు. మార్పును ఆహ్వానించి.. అందుకు తగ్గట్లు మారకుంటే జరిగే నష్టం ఎలా ఉంటుందో ఒకప్పటి మొబైల్ దిగ్గజం నోకియాను చూస్తే అర్థమవుతుంది. మొబైల్ మార్కెట్ లో తనదైన శైలిలో దూసుకెళుతూ ఉండే యాపిల్ ఫోన్లకు ఉన్న క్రేజ్ ఎంతో అందరికీ తెలిసిందే. అయితే.. ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఈ ఫోన్ల అమ్మకాలు తగ్గిపోవటం ఆందోళన కలిగిస్తోంది. యాపిల్ సంస్థ ఆదాయంలో 68 శాతం ఫోన్ల మీదనే వస్తున్న ఈ కంపెనీకి.. తాజాగా ఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టటం ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతోంది ఇప్పుడు.

Read more: శ్యాంసంగ్ కొత్త ఫోన్ ఫీచర్స్ లీకయ్యాయి

మొబైల్ మార్కెట్‌లో యమా క్రేజ్ ఉన్న ఐ ఫోన్

మొబైల్ మార్కెట్‌లో యమా క్రేజ్ ఉన్న ఐ ఫోన్

మొబైల్ మార్కెట్‌లో యమా క్రేజ్ ఉన్న ఐ ఫోన్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా.. అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. యాపిల్ సంస్థ 2007లో ఐ ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదటి సారిగా సేల్స్ గ్రోత్ రేట్ పడిపోతున్నట్లు గణాంకాల్లో తెలిపింది.

ధరలు భారీగా ఉండటం..

ధరలు భారీగా ఉండటం..

ధరలు భారీగా ఉండటం.. కొత్త కొత్త మోడల్స్ తో చౌక ధరకు పెద్ద పెద్ద కంపెనీలు ఫోన్లు వస్తున్న పరిస్థితి. అయితే.. ఏదీ ఆపిల్ సాటి రానప్పటికీ.. కొత్త మోడళ్ల ముందు.. వాటి ధరల ముందు యాపిల్ కళ తగ్గుతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు అండ్రాయిడ్ జోరు కూడా కారణంగా చెబుతున్నారు.

2007 తర్వాత అమ్మకాలు క్షీణించటం ఇదే తొలిసారి

2007 తర్వాత అమ్మకాలు క్షీణించటం ఇదే తొలిసారి

కారణాలు ఏమైనా కానీ.. 2007 తర్వాత అమ్మకాలు క్షీణించటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 74.8 మిలియన్ ఐఫోన్లు అమ్మితే.. ఈ ఏడాది ఇదేకాలంలో చూస్తే మాత్రం ఆశించినంతగా అమ్మకాల్లో వృద్ధి లేదని తేల్చారు.

రాబోయే త్రైమాసికానికి విడుదల చేసిన అంచనాల్లో కూడా

రాబోయే త్రైమాసికానికి విడుదల చేసిన అంచనాల్లో కూడా

రాబోయే త్రైమాసికానికి విడుదల చేసిన అంచనాల్లో కూడా గత సంవత్సరంతో పోల్చినప్పుడు వృద్ధి రేటు తగ్గనుందని ఆపిల్ వెల్లడించడం గమనార్హం. అయితే గతేడాది ఇదే టైంకి ఆపిల్ అమ్మకాలు 61.2 మిలియన్ ఐ ఫోన్లు అమ్ముడుకావడం గమనార్హం.

ఆపిల్ కంపెనీ ఆదాయం మీద కూడా ప్రభావం

ఆపిల్ కంపెనీ ఆదాయం మీద కూడా ప్రభావం

ఇక రాబోయే త్రైమాసికం అమ్మకాల విషయంలో క్షీణత తప్పదన్న అంచనాలతో ఆపిల్ కిందా మీదా పడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే..ఆపిల్ కంపెనీ ఆదాయం మీద కూడా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.

ఆపిల్ కంపెనీ మొత్తం రెవిన్యూలో ఐ ఫోన్

ఆపిల్ కంపెనీ మొత్తం రెవిన్యూలో ఐ ఫోన్

ఆపిల్ కంపెనీ మొత్తం రెవిన్యూలో ఐ ఫోన్ వాటానే 68 శాతంగా ఉంది. యాపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లుకా మాస్ట్రీ దీనిపై మాట్లాడుతూ.. అమెరికా డాలర్ బలపడటం మూలంగా యాపిల్ సేల్స్ ఫ్లాట్‌గా ఉన్నాయని వెల్లడించారు. ఇది కంపెనీ రెవెన్యూ మీద 5 బిలియన్ డాలర్ల మేర ప్రభావం చూపనుందని తెలిపారు.

అదీగాక చైనాలో మార్కెట్‌‌లో ఆపిల్ అమ్మకాలు డల్ కావడం

అదీగాక చైనాలో మార్కెట్‌‌లో ఆపిల్ అమ్మకాలు డల్ కావడం

అదీగాక చైనాలో మార్కెట్‌‌లో ఆపిల్ అమ్మకాలు డల్ కావడం కూడా ఆపిల్ అమ్మకాలపై తీవ్రమైన ప్రభావాన్నే చూపిస్తోంది. మరి.. ఈ కష్టాన్ని ఎదుర్కోవటానికి ఆపిల్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందో..?

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Apple warns iPhone sales set to fall for first time

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X