యాపిల్ స్మార్ట్‌వాచీ యువకుడి ప్రాణాలు కాపాడింది

Written By:

యాపిల్ వాచీ టైం చూపించడమే కాదు మనిషి ప్రాణాలను కూడా కాపాడుతోంది..ఏందీ ఈ విషయం నమ్మలేకున్నారా..ఇది నిజం అమెరికాలో జరిగింది.ఆ కుర్రాడు యాపిల్ వాచీ ధరించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు.ఆ వాచీ లేకుంటే అతను ప్రాణాలు పైకి పోయేవి. ఈ సంధర్భంగా ఆ కుర్రాడు యాపిల్ కు థ్యాంక్స్ కూడా చెప్పాడు. మరి యాపిల్ స్మార్ట్ వాచీ ఆ యువకుడి ప్రాణాలు ఎలా కాపాడిందో తెలుసుకోవాలనుందా అయితే కింద స్లైడర్ లో దానికి సంబంధించిన సమాచారం ఉంది ఓ సారి చదివేయండి.

Read more: స్మార్ట్ వాచీలతో స్మార్ ఫోన్లకు బై..బై

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హృదయ స్పందన రేటు

అమెరికాలో ఓ యువకుడి ప్రాణాలను అతను ధరించిన స్మార్ట్‌వాచీ కాపాడింది. పాల్ హూలే అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడి హృదయ స్పందన రేటు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటాన్ని స్మార్ట్‌వాచీ గుర్తించి.. వెంటనే హెచ్చరించింది. దాంతో వెంటనే ఆ యువకుడ్ని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్సనందించి.. ప్రాణ ముప్పును తొలగించారు.

గదికి వచ్చి విశ్రాంతి

మసాచుసేట్స్‌లోని మారియన్‌లో ఉన్న టాబర్ అకాడమీ సీనియర్ క్రీడాకారుడైన పాల్ .. గరిష్ఠ ఉష్ణోగ్రతలో ఏకబిగిన రెండు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. నొప్పి రావడంతో తన గదికి వచ్చి విశ్రాంతికి ఉపక్రమించాడు.

నిమిషానికి 145 సార్లు

తన చేతికి ధరించిన ఆపిల్ వాచీ మానిటర్‌లో సాధారణ స్థాయిలో ఉండే హృదయ స్పందన రేటు 60 నుంచి 80 కంటే.. నిమిషానికి 145 సార్లు కొట్టుకోవడం నమోదైంది.

ఎమర్జెన్సీ రూంకు..

తొలుత వాచీ పాడైపోయిందని పాల్ భావించాడు. కాని పరిస్థితి తనకు తెలియకుండానే చేయి దాటిపోయింది. ఇక అక్కడే అలానే పడిపోయాడు. తన కోచ్, స్కూల్ నర్సు పరిస్థితిని గమనించి.. ఎమర్జెన్సీ రూంకు తరలించారు.

రాబ్డోమయోలిసిస్‌కు ..

దేహంలోని కండరాలు విచ్ఛిన్నమై.. రక్తంలోకి ఓ రకమైన ప్రొటీన్లు విడుదలై.. కీలక అవయవాలు విఫలమయ్యే లక్షణాలున్న రాబ్డోమయోలిసిస్‌కు గురయ్యాడని డాక్టర్లు గుర్తించారు.

యాపిల్ వాచ్ నన్ను కాపాడిందని..

ఈ పరిస్థితిని పట్టించుకోకుండా మళ్లీ ప్రాక్టిస్‌కు వెళ్లి ఉంటే ప్రాణాలతో మిగిలి ఉండేవాడివి కాదని వైద్యులు హెచ్చరించారని పాల్ తెలిపారు. ఈ సందర్భంగా యాపిల్ వాచ్ నన్ను కాపాడిందని దానికి చాలా ధ్యాంక్స్ అంటూ మనోడు అందరికీ చెబుతున్నాడు.

ప్రాణం పోయో టైంలో ..

అంతే కదా.. ప్రాణం పోయో టైంలో యాపిల్ వాచ్ అలా మనోడికి సాయం చేయడం అంటే గ్రేటే మరి. నిజంగా యాపిల్ స్మార్ట్ వాచీకి థ్యాంక్స్ చెప్పాల్సిందే.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు. https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple Watch Heart Rate Monitor Saves Massachusetts Teen’s Life
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot